మహానటి సావిత్రి పాత్రలో చేస్తున్న కీర్తీ సురేష్ పారితోషికం ఎంతో తెలుసా?
భారతీయ సినిమా చరిత్రలో సావిత్రికి ఒక ప్రత్యకమైన స్థానం ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ముఖంలో హావభావాలు పలికించడంలో, కళ్ళతో అభినయించడంలోను ఆమెకు ఆమె సాటి.

మహానటి సావిత్రి
సావిత్రిలాంటి మరో నటి ఇండస్ట్రీకి దొరకడం మహాకష్టం. అందుకే ఆమె మహానటి అయింది. మహానటి సావిత్రి పాత్రలో నటించడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో అనుభవం ఉండాలి.

అనుభవం లేని
అప్పుడే మహానటి పాత్రకు కొంతమేరకైనా న్యాయం చేస్తారు. పెద్దగా అనుభవం లేని కీర్తి సురేష్ మహానటి పాత్రకు ఎంపిక కావడంతో.. ఆమెపై విమర్శలు వచ్చాయి. కీర్తి సురేష్ ఆ పాత్రకు ఎంతమేరకు న్యాయం చేయగలదనే అనుమానాలు రేకెత్తాయి.

నాగ్ అశ్విన్ దైర్యం
సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఫోటో షూట్ చేసినపుడు ఆమె అచ్చు సావిత్రిలా ఉండటం.. నాగ్ అశ్విన్ దైర్యం ఇవ్వడంతో.. ఆమెకు దైర్యం వచ్చింది. ఇక నటన విషయంలో ఎంతమేరకు మెప్పిస్తుందనే విషయం తెలియాలి.

ఎంత రెమ్యునరేషన్ తీసుకొందో తెలుసా
కీర్తి నటించిన చిత్రాల్లో నటనకు స్కోప్ ఉన్న సినిమాలు లేవనేచెప్పాలి. మరి ఈ మహానటిలో కీర్తి సురేష్ ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే మే 9 వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇక మహానటిలో నటించేందుకు కీర్తి ఎంత రెమ్యునరేషన్ తీసుకొందో తెలుసా.. ఏకంగా కోటి యాభైలక్షలు.

సమంత, కాజల్
తెలుగు, తమిళ భాషల్లో రూపొండుతున్న సినిమా కాబట్టి కీర్తి సురేష్ కు అంత పెద్ద మొత్తంలో ముట్టజెప్పారట. ప్రస్తుతం తెలుగులో సమంత, కాజల్ లు ఈ పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు వారి పక్కన కీర్తి కూడా చేరిపోయింది.


Click it and Unblock the Notifications