జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ దగ్గరైన వారిలో చమ్మక్ చంద్ర ఒకడు,కుటుంబ కథలు తీస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే ప్రతిఒక్కరు ఇష్టపడుతారు.
జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ దగ్గరైన వారిలో చమ్మక్ చంద్ర ఒకడు,కుటుంబ కథలు తీస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే ప్రతిఒక్కరు ఇష్టపడుతారు.ఒకపక్క ఆడవారిని తక్కువ చేస్తూ మరో పక్క వారి విలువేంటో చెప్పి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నాడు.అందుకే జబర్దస్త్ షో లో చంద్ర స్క్రిట్ కి మంచి రేటింగ్ ఉంది.

చంద్ర ఎవరు:
అసలు ఈ చంద్ర ఎవరు,ఎక్కడినుండి వచ్చాడు,కుటుంబ వివరాలు మరియు ఎంతవరకు చదుకున్నాడు అనే వివరాలు చాల మందికి తెలీదు.ప్రస్తుతం ఏసి కార్ లో తిరుగుతున్న చంద్రఒకప్పుడు హైదరాబాద్ లో కూలి పని చేసేవాడు.

చంద్ర గతం:
మనందరికీ తెలిసిన ఇప్పుడు చంద్ర సినీపరిశ్రమకు రాక ముందు కూలి పని చేస్తూ ఓకే పూట అన్నం తిని రెండుపూటల పస్తుండే విషయం మీకు తెలుసా,చంద్ర కుటుంబ పరిస్థితి తెలిస్తే విన్న ఎవరి కళ్లయినా చలిస్తాయి.

చంద్ర కుటుంబం:
చెప్పాలంటే చంద్ర చాల పేద కుటుంబంలో జన్మించాడు,ఎంత పేదరికం అంటే ఇతడి తల్లి గారు తనని మరియు తమ్ముడిని చిన్నతనంలో ఎత్తుకొని మరి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి మిషన్ కుట్టి కొంత డబ్బు సంపాదిస్తే ఇక ఆయన తండ్రి దాదాపు 12 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లి కట్టెలు అమ్మేవారు,ఎలా వచ్చిన కొంత డబ్బుతో అతి కష్టం మీద కుటుంబం నెట్టుకుంటూ వచ్చారు అంతేకాక వీరికి ఒక ఆవు ఉండేది పాలను అమ్మి వచ్చే డబ్బుతో బియ్యం కొనేవారు.

పుట్టిన స్థలం:
చంద్ర నిజామాబాద్ జిల్లా వెంకటాపురం తండాకు చెందిన ఇతను 10 వ తరగతి వరకే చదువుకున్నాడు,చిన్నప్పటినుండి సినిమాలు చూస్తూ పెరిగిన చంద్రకు కామెడీ అంటే చాల ఇష్టం ఇంకో విషమేమిటంటే చంద్ర లో చిన్న తనం నుండే కామెడీ లక్షణాలు ఉండటం,తన చిలిపి చేష్టలతో స్నేహితులను కడుపుబ్బా నవ్వించేవాడట,అది చూసిన వారంతా చంద్ర నువ్వు తలుచుకుంటే జీవితం లో గొప్ప హాస్య నటుడు అవతావని అంటూ ఉండేవారు.

ప్రోత్సాహంతో:
స్నేహితులు మరియు సన్నిహితులు చెప్పిన మాటలు విన్న చంద్ర ఎలాగైనా పెద్దయ్యాక మంచి హాస్య నటుడు కావాలని నిర్నయిన్చుకున్నాడు,అంతే కాక తనను తాను నిరూపించుకోడానికి వూర్లో పెళ్ళిళ్ళు జరిగే చోట స్టేజి మీద పాటలు పడుతూ మరియు జోకులు వేస్తూ జనాలని నవ్వించేవాడు.

చంద్ర సోదరులు:
చంద్ర కు ఇద్దరు సోదరులు వీళ్ళు పెద్దయ్యాక ఊర్లోనే వ్యవసాయం చేయడం ప్రారంభించారు,కానీ చంద్ర మాత్రం ఎలాగైనా సినిమా రంగంలో రాణించి తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే కసితో హైదరాబాద్ దారి పట్టాడు,అక్కడకు వెళ్లిన చంద్రకు అసలు ఏమి తెలీదు,సినిమాలోకి ఎలా వెళ్లాలో ఎవరిని కాలవలో ఏమి తెలియని పరిస్థితి.

ఉద్యోగం:
హైదరాబాద్ లో పూట గడవాలన్న లేక రూమ్ లో ఉండాలన్న ఎంతోకొంత ఆదాయం ఉండాలి,10 వ తరగతి చదివిన చంద్ర కి ఎక్కడ ఉద్యోగం రాలేదు సరే ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లితీరాలని బతుకు తెరువు కోసం ఒకపక్క కూలి పని చేస్తూ మరోపక్క సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తుండేవాడు.కూలి పని చేస్తూ వచ్చిన డబ్బుతో కేవలం ఒక్కపూట మాత్రమే అన్నం తిని రెండు పూటలా పస్తులుండి ఖర్చులకి పోగా మిగిలిన డబ్బును ఇంటికి పంపేవాడు.

కలిసొచ్చిన అదృష్టం:
అలంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్ర కి కలిసొచ్చిన అదృష్టం పేరు 'జబర్దస్త్' తన మొదటి షో లోనే లేడీ గెట్ అప్ వేసిన చంద్ర తన కామెడీ టైమింగ్ తో అందరిని నవ్వించడమే కాకుండా జబర్దస్త్ లో ఒక బ్రాండ్ గా మారాడు.చంద్ర స్క్రిట్ వచ్చిందంటే చాలు ప్రారంభం నుండి చివరిదాకా నవ్వాల్సిందే.

ఆనందం:
జబర్దస్త్ షో తో మంచి పేరు తెచ్చుకున్న చంద్ర ని చూసి తన తల్లీదండ్రులు ఎంతో ఆనంద పడుతున్నారు.ఒక్కపుడు ఎలా కష్ఠాలు పడిన చంద్ర ఇప్పుడు ఎలా ఉన్నాడో మనందరికీ తెలిసిన విషయమే.

సంపాదన:
ప్రస్తుతం జబర్దస్త్ లో చంద్ర ఒక్క ఎపిసోడ్ కి లక్ష యాబై వేలు తీసుకుంటున్నాడు రూ.1,50,000 . ఐతే ఈ సక్సెస్ అంతే సులభంగా రాలేదు చంద్ర కి జబర్దస్త్ లో అవకాశం రావడానికి 13 ఏళ్ళు పట్టింది,ఇతడు పడిన కష్టాలకి మరియు నిరీక్షణకు ఫలితమే ఈ రోజు విజయ తీరాలకు చేర్చిందని చెప్పుకునే వ్యక్తుల్లో చంద్ర కూడా ఒకడు.


Click it and Unblock the Notifications