తెరాస ఒక ఉద్యమ పార్టీ గా ఆవిర్భవించి ఎన్ని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి అనేక మంది ప్రాణ త్యాగాల తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న విషయం విదితమే.
తెరాస ఒక ఉద్యమ పార్టీ గా ఆవిర్భవించి ఎన్ని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి అనేక మంది ప్రాణ త్యాగాల తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న విషయం విదితమే.ఇక పోతే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస అధిక స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.వీటన్నిటికీ ముఖ్య వ్యక్తి కెసిఆర్,తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి కాలం చేపట్టి 4 సంవత్సరాలు కావస్తోంది,ఈ సందర్బంగా ప్లీనరీ సమావేశం భారీ ఎత్తున ఏర్పాటు చేసారు.

ప్లీనరీ:
తెరాస పార్టీ ఆవిర్భావం నుండి ఇది 17 వ ప్లీనరీ,ఈ సమావేశానికి రాష్ట్రము నుండే కాకుండా విదేశాల నుండి కూడా ప్రతినిధులు హాజారు కానున్నారు.ప్లీనరీ లో పలు తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు మరియు ప్రధానంగా రాజకీయ తీర్మానంపై ఆసక్తి నెలకొంది.కొమ్మేపల్లి లోని BGR గార్డెన్ లో ఈ సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దీనికి ప్రగతి ప్రాంగణం అనే పేరు పెట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా:
ఈ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 119 నియోజిక వర్గాలనుండి దాదాపు 13000 మంది ప్రతినిధులు హాజరు కానునందున వారికి ఎలాంటి అసౌకర్యం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని పార్టీ వర్గాలు తెలిపాయి.

వాలంటీర్లు:
కొన్ని వేల సంఖ్యలో హాజరు కానున్న ఈ ప్లీనరీ సమావేశానికి సుమారు 2000 మంది వాలంటీర్లను నియమించినట్టు చెప్పారు.వీరు మొత్తం సంఖ్యలో భాగాలుగా విభజించి వారు చేయాల్సిన పనులు గురించి చెప్పి కేటాయించడం జరుగుతుంది.వచ్చే అతిధులకు కూర్చోడానికి వసతి కలిపించడం కోసం కొందరు,శీతల పానీయాలు సరఫరా చేయడానికి కొందరు మరియు ఆహార పదార్థాలు దగ్గర మరి కొందరిని అమర్చి ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని చెప్పారు.

విందు:
ప్లీనరీ కి రానున్న ప్రతినిధుల కోసం సుమారు 27 రకాల వంటకాలను సిద్ధం చేస్తోంది తెరాస ప్రభుత్వం.ప్రత్యేకంగా తెలంగాణ రుచులు చూపించబోతున్నారు.దాదాపు 20000 వేళా మందికి విందు సదుపాయం ఏర్పాటు చేసారు.ఇందులో ముక్యంగా చెప్పుకోవాల్సిన వంటకాలు చికెన్ బిరియాని,మటన్ బిరియాని,చికెన్ ఫ్రై,చికెన్ కర్రీ,మటన్ కుర్మా,గుడ్ల పులుసు మరియు నాటు కోడి ప్రధాన వంటకాలు.అధిక ఎండల దృష్ట్యా ఒక లక్ష నీళ్ల ప్యాకెట్లు మరియు లక్ష మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తెరాస పార్టీ నిధి:
కెసిఆర్ మాట్లాడుతూ తెరాస పార్టీ దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర అని అభివర్ణించారు,పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు,కార్యకర్తల కృషి మరువలేమన్నారు.ఇక పోతే ప్రభుత్వం వచ్చిన తరువాత మెంబెర్ షిప్ రూపంలో ప్రభుత్వానికి సమకూరిన డబ్బు సుమారు రూ. 50 కోట్లు అని ప్రకటించారు.

ఖర్చు చేసిన నిధులు:
పార్టీ అధికారం లోకి వచ్చినప్పటినుండి మెంబెర్ షిప్ రూపం లో వచ్చిన డబ్బు లో నుండి 20 కోట్లకు పైగా డబ్బు కార్యకర్తల ఇన్సూరెన్స్ కోసం ఖర్చు పెట్టమని అన్నారు,ఇంకొంత డబ్బు పార్టీ అవసరాలకోసం ఫిక్స్డ్ డిపాజిట్ రూపం లో పెట్టాం అని పేర్కొన్నారు.ఈ వివరాలు మనం ఏపాటి కప్పుడు ఎలక్షన్ కమీషన్ కి పంపుతున్నాము మరియు ఆదయ పన్ను శాఖకు కూడా సమర్పిస్తుంటాం అని అన్నారు.వీటన్నిటికీ పొగ ప్రస్తుతం మన దగ్గర ఉన్న డబ్బు రూ. 21 కోట్ల 67 లక్షలు అని ప్రకటించారు.

ప్రస్తుత ప్లీనరీ లో వచ్చిన విరాళాలు:
రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ ఫండు కింద కొంతమంది ప్రతినిధులు విరాళాలు ప్రకటించారు,ఇందులో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 2 కోట్లు పార్టీ విరాళం ప్రకటించారు,మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మల్ల రెడ్డి రూ. 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు,అలాగే వారి తరపు నుండే మర్రి రాజశేఖర్,టి.విజేందర్ రెడ్డి కూడా తల ఒక రూ.1 కోటి ప్రకటించారు.ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సబ్యుకు జి.వివేక్ గారు రూ.1 కోటి విరాళం ఇచ్చారు,శ్రీమతి జి.వివేక్ గారు కూడా ఒక కోటి ప్రకటించినట్టు చెప్పారు,సలీమ్ ఒక కోటి,పార్లమెంట్ సబ్యడు జితేందర్ రెడ్డి తనయుడు వారికీ సంబందించిన మరో ఇద్దరు బందు మిత్రులు కలిసి రవీందర్ రెడ్డి,నితిన్ రెడ్డి రూ.2 కోట్లు ప్రకటించారు,భాను ప్రసాద్ MLC ఒక కోటి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక కోటి,మర్రి జనార్దన్ రెడ్డి నగర్ కర్నూల్ MLA ఒక కోటి,చెల్లా ధర్మారెడ్డి పరకాల MLA రూ. 75 లక్షలు బి బి పాటిల్ జహీరాబాద్ MLA రూ.51 లక్షలు,దండే విట్టల్ రూ.50 లక్షలు తదితరులు పెద్ద మొత్తం లో విరాళాలు ఇచ్చారని కెసిఆర్ ప్రకటించారు.
ఇది మొత్తం రూ. 20.41 కోట్లు
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications