For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో కార్ల పేరుతో భారీ దోపిడీ ...60 కోట్లు స్కాం చేసిన 25 ఏళ్ల యువకుడు

By Sabari
|

తక్కువ ధరలకే లగ్జరీ కార్లు అని ప్రముఖుల్ని మోసం చేసాడు. 30 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తాం అంటూ బురిడీ కొట్టించాడు.

60 కోట్లతో నొక్కేసాడు

60 కోట్లతో నొక్కేసాడు

వేలు కాదు లక్షలు కాదు. ఏకంగా 60 కోట్లతో నొక్కేసాడు హైదరాబాద్ కి చెందిన ఆకాష్ అనే యువకుడు. రాత్రికి రాత్రే సైలెంట్ గా విదేశాలకి చెక్కెసాడు. 25 ఏళ్ల కుర్రాడు చేసిన ఈ స్కాం హైదరాబాద్ లో ఈ న్యూస్ సంచలనంగా మారింది.

 ఆకాష్ గా గుర్తించారు.

ఆకాష్ గా గుర్తించారు.

ఈ ఘరానా దొంగని నమ్మి పలువురు ప్రముఖులు కూడా మోసపోయారు అంట. బాధ్యుతుల ఫిర్యాదు తర్వాత టాస్క్ ఫోర్స్ ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్రధాన నిందితుడు ఆత్మకూరుకి చెందిన ఆకాష్ గా గుర్తించారు.

బడా కార్ల షో రూమ్స్ తో

బడా కార్ల షో రూమ్స్ తో

తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసిన ఆకాష్ నగరంలో ఉన్న బడా కార్ల షో రూమ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లగ్జరీ కార్లను కొనడానికి కస్టమర్లను తీసుకొస్తాను అని అందులో డిస్కౌంట్ ఇవ్వాలి అని షరతు పెట్టాడు. ఆ తర్వాత ప్రముఖుల్ని ట్రాప్ చేసాడు.

వాళ్లని నమ్మించాడు.

వాళ్లని నమ్మించాడు.

ఒక పెద్ద కంపెనీ బ్లాక్ మనీ ని వైట్ మనీ గా మార్చుకుంటోంది అని అందుకే కార్లను కొని అమ్ముతున్నాము అని వాళ్లని నమ్మించాడు.

ఖరీదు ఐనా కార్లు

ఖరీదు ఐనా కార్లు

వోల్వో, వోక్స్వ్యాగన్, BMW, జాగ్వర్, వంటి ఖరీదు ఐనా కార్లు 30 శాతం డిస్కౌంట్ తో ఇపిస్తాను అంటూ ఆశ పెట్టాడు.

లగ్జరీని చూసి

లగ్జరీని చూసి

2 కోట్ల కారు లో తిరుగుతూ పోజులు కొట్టడంతో ఆకాష్ బుట్టలో ప్రముఖులు అంత పడ్డారు. అతడి లగ్జరీని చూసి చాలామంది నిజంగానే తక్కువ ధరకే వాహనాలు వస్తాయి అని నమ్మారు. ఆకాష్ మరియు అతని గ్యాంగ్ లక్షలు వెనకవేసుకున్నారు. ప్రస్తుతం ఆకాష్ టాస్క్ ఫోర్స్ పోలిసుల చేతికి చిక్కాడు.

కోట్లలో స్కామ్

కోట్లలో స్కామ్

మొత్తం ఆకాష్ మోసం చేసింది మొదట 30 మంది అనుకున్నారు కానీ ఇప్పుడు అది 60 కి చేరుకొంది మొత్తం కొన్ని కోట్లలో ఈ స్కాం జరిగింది అని పోలీసులు వెల్లడించారు.

Read more about: hyderabad
English summary

హైదరాబాద్ లో కార్ల పేరుతో భారీ దోపిడీ ...60 కోట్లు స్కాం చేసిన 25 ఏళ్ల యువకుడు | Huge Exploitation of Cars in Hyderabad ... 25 Year Old Youth Scrambling 60 Crore

Fraudsters are known to be luxury cars at low prices. with hit 30 percent discount.
Story first published: Thursday, April 26, 2018, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X