ప్రపంచంలో చాల మంది పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని సార్లు ఆ పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఐతే ఇక్కడ కూడా అవే పొరపాట్లు జరిగాయి.కానీ అవి కోట్లతో ముడిపడిఉన్నాయి.అంటే వారు చేసిన తప్పు వల్ల కోట్ల రూపాయిలు నష్టం వచ్చింది అనమాట. మరి ఆ పొరపాట్లు ఏమిటో ఎందుకు చేసారో తప్పక తెలుసుకుందాం.

పెద్ద మిస్టేక్
ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టేక్ గా చెప్పుకొనే మొదటి తప్పు.ఎంతో తెలుసా అది ఎక్కడ జరిగిందో తెలుసా? చూద్దాం రండి.

లాటరీ టికెట్
ఇంగ్లాండ్ కి చెందిన ఒక అమ్మాయి లోటో అనే లాటరీ కంపెనీ ద్వారా ప్రతి వారం ఒక లాటరీ టికెట్ కొనేది. ప్రతిసారి ఆ లాటరీ టికెట్స్ నంబర్స్ ని ఒక కాగితం మీద రాసుకోవడం ఆమెకు అలవాటు. ఆ లాటరీ ఫలితాలు ప్రకటించేటప్పుడు వాటిని టీవీలో చూసి ఆ లాటరీ టికెట్స్ చెక్ చేసుకునేది. అదే క్రమంలో లక్కీగా ఆమె కొన్న లాటరీ టికెట్ కి లాటరీ తగిలింది. లాటరీ లో ఆమె 180 మిలియన్ డాలర్స్ గెలుచుకొంది. కానీ ఆ లాటరీ టికెట్ ని ఆమె పోగొట్టుకోవడంతో ఆమె ఆ డబ్బుని చేజార్చుకొంది. ఆమె చేసిన చిన్న మిస్టేక్ 180 మిలియన్స్ డాలర్స్ పోగొట్టుకొనేలాగా చేసింది.

స్టీవ్ జాబ్స్
ఆపిల్ కంపెనీని స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ వోజ్నియక్ 1976 లో స్టార్ట్ చేశారు అప్పటిలో వారికి చిన్న వయస్సు ఇద్దరికీ 20 ఏళ్ళు ఉండేవి. దాంతో ఆ కంపెనీని సమర్ధవంతంగా నడపడానికి సూపర్ విషన్ ఉంటె బాగుండుతుంది అని అలోచించి 42 ఏళ్ళు ఉన్న రోనాల్డ్ వాన్ అనే వ్యాపారవేత్తని ఆపిల్ కంపెనీలో 10 శాతం షేర్ ఇచ్చారు. అప్పటిలో ఈ ఆపిల్ లోగోని తయారు చేసింది మరియు ఆపిల్ కంప్యూటర్ మాన్యువల్ రాసింది ఈయనే. 1976 లో ఆపిల్ కంపెనీకి బైట్ షాప్ అనే కంపెనీ నుంచి 100 కంప్యూటర్స్ ఆర్డర్స్ వచ్చాయి. దీనికి స్టీవ్ జాబ్స్ ఒపుక్కున రోనాల్డ్ ఒపుకోలేదు దీనికి కారణం బైట్ కంపెనీ డబ్బులు సరిగ్గా డబ్బులు చెల్లించారు అని పేరు ఉండడంతో రోనాల్డ్ ఒప్పుకోలేదు. దీనికి స్టీవ్ జాబ్స్ ఒప్పుకోగా రోనాల్డ్ తన 10 శాతం షేర్స్ వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అదే 10 శాతం ఆపిల్ షేర్స్ యొక్క విలువ 5 లక్షల కోట్ల రూపాయిలు. అంటే రోనాల్డ్ తీసుకున్న నిర్ణయం వల్ల 5 లక్షల కోట్లను పోగొట్టుకున్నాడు అనమాట.

బిట్ కాయిన్స్
ఇక 7500 బిట్ కాయిన్స్ ఈ బిట్ కాయిన్స్ మనందరికీ తెలుసు ఈ మధ్యే బిట్ కాయిన్స్ యొక్క విలువ పెరిగి భారీగా సెన్సేషన్ సృష్టించింది.2007 లో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న 7500 బిట్ కాయిన్స్ తన కంప్యూటర్ సైట్లో మైనింగ్ చేస్తుండగా పక్కన పెట్టుకున్న సాఫ్ట్ డ్రింక్ చేయికి తగిలి అది కంప్యూటర్ మీద పడగా కంప్యూటర్ మొత్తం చెడిపోయింది.
దానివలన తన దగ్గర ఉన్న 7500 బిట్ కాయిన్స్ వివరాలు ఉన్న హార్డ్ డిస్క్ మొత్తం క్రాష్ అయిపోయింది. కానీ వాటికీ అప్పటిలో బిట్ కాయిన్స్ ఎక్కువ విలువ లేకపోవడంతో ఆ వ్యక్తి ఎక్కువ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు 7500 బిట్ కాయిన్స్ విలువ సుమారు 6 మిలియన్ల అమెరికన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కొన్ని వేల కోట్లతో సమానం.

ఈబేలో
కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి దగ్గర ఒక వైన్ బాటిల్ ఉండేది.అతనికి అర్జంట్ గా డబ్బులు అవసరం అయ్యాయి. అతను బాగా అలోచించి ఈబేలో అమ్మకానికి పెట్టాడు. ఆ బాటిల్ పేరు అస్సోప్ ఆర్కిటిక్ ఆలే కానీ అతను తప్పుగా పేరు టైపు చేసి పెట్టడంతో దాని ధర కేవలం 300 డాలర్లు కు అమ్ముడు పోయింది.
ఆ బాటిల్ కొన్న వ్యక్తి అదే బాటిల్ ని స్పెల్లింగ్ కరెక్ట్ గా టైపు చేసి ఈబేలో పెట్టగా ఈసారి ఆ బాటిల్ 5 లక్షల డాలర్లకు అమ్ముడు పోయింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications