For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

100 మంది ఇంజినీర్లు కూడా చేయలేరు కానీ ఒక్క అమ్మాయి చేసింది

By Sabari
|

ప్రపంచవ్యాప్తంగా మగవారితో సమానంగా సత్తా చాటిన మహిళా శక్తికి నిదర్శనగా మారిన యువతులు ఎందరో ఉన్నారు.

41 రోజులో

41 రోజులో

ప్రోత్సహం అందిస్తే అబ్బాయిలకి తాము ఏమి తీసిపోము అని వాళ్లు రుజువు చేస్తున్నారు.అద్భుతమైన తమ సత్తా చాటిన యువతుల కోవలో ఈ అమ్మాయి కూడా వస్తుంది. కాకలు తీరిన మగవారికి కూడా సాధ్యం కానీ ఈ పని కేవలం 41 రోజులో చేసి చూపించింది ఈ అమ్మాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా ? అది తెలుసుకోవాలి అంటే వివరాల్లోకి వెళ్లసిందే.

వెబ్ సైట్స్ డిజైన్

వెబ్ సైట్స్ డిజైన్

మాములుగా ఒక వెబ్ సైటు ని డిజైన్ చేయాలి అంటే చాల కష్టపడాలి కానీ ఈ అమ్మాయి కేవలం 41 రోజుల్లో ఏకంగా 101 వెబ్ సైట్స్ డిజైన్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

రజిత కందిమళ్ల

రజిత కందిమళ్ల

ఆమె పేరు రజిత కందిమళ్ల ఆమెది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుంటూరు జిల్లా నర్సారావు పేట .ఆమె సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి పేరు రాఘవయ్య అతను ఒక రైతు. ఆమెకి ఒక అక్క ఒక కవల సౌదరి, ఒక తమ్ముడు ఉన్నాడు. అంత చదువుకుంటున్నారు.

 ఇంజినీర్ కాలేజీలో

ఇంజినీర్ కాలేజీలో

ఇక రజిత మాత్రం నర్సారావు పేటలోని ఇంజినీర్ కాలేజీలో చదువుతోంది.ఐతే వాళ్ళ కాలేజీలో రీసెంట్ గా స్టార్ట్ అప్ విభాగం ఏర్పాటు చేశారు. దాంతో రజిత తాను కూడా ఏదో సాధించాలి అని అనుకొంది. వెబ్ డిజైన్ లో కొన్ని మెళుకువలు నేర్చుకొని నెమ్మదిగా వెబ్ డిజైన్ నేర్చుకొంది.అతి తక్కువ కాలంలోనే వెబ్ డిజైన్ లో పట్టు సంపాధించింది.

వేసవి సెలవులు

వేసవి సెలవులు

ఆలా వెబ్ డిజైన్ లో నైపుణ్యం సాధిస్తూ ఉండగా కాలేజీకి వేసవి సెలవులు ఇచ్చారు దాంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్న రజిత ముందుగా రెండు వెబ్ సైట్లను తయారు చేసింది.అవి బాగానే ఉన్నాయి అని నిపుణులు ఐన ఫ్రెండ్స్ మెచ్చుకోవడంతో మరి కొన్ని వెబ్ సైట్స్ డిజైన్ చేయాలి అనుకొంది.

101 వెబ్ సైట్స్

101 వెబ్ సైట్స్

దానికోసం పట్టుదలగా కృషి చేసింది 40 రోజుల్లో 101 వెబ్ సైట్స్ డిజైన్ చేసి అంతర్జాతీయ వండర్ బుక్ లో స్థానం తెచ్చుకొంది. దాంతో ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆమెని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తన కాలేజీ యాజమాన్యం చేతుల మీదగా రజిత ప్రసంశలు మరియు అవార్డులను అందుకొంది.

సొంత కంపెనీ

సొంత కంపెనీ

రజిత సొంతంగా ALL TEC TREND పేరుతో ఒక సొంత స్టార్ట్ అప్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి తానే CEO గా వ్యవహరిస్తోంది.

12 మందిని

12 మందిని

ఆ కంపెనీలో తమ కాలేజీ విద్యార్థులు ఒక 12 మందిని ఉద్యోలుగా నియమించింది. ఇప్పుడు ఆమెకి పలు కంపెనీల నుంచి వెబ్ డిజైనింగ్ ఆఫర్లు వస్తున్నాయి.

హైదరాబాద్ లో

హైదరాబాద్ లో

రజిత త్వరలోనే తన ALL TECH TREND కంపెనీని హైదరాబాద్ లో కూడా విస్తరించనుంది. నైపుణ్యం గురించి తెలుసుకున్న గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలు రజిత కంపెనీకి సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.

యాప్ డెవలప్మెంట్

యాప్ డెవలప్మెంట్

రజిత కేవలం వెబ్ డిజైనింగ్ కాకుండా యాప్ డెవలప్మెంట్, SEO వంటి సేవలు తమ కంపెనీ ద్వారా అందిస్తూ అందరి అభినందనలు అందుకుంటోంది.

రజిత డ్రీమ్

రజిత డ్రీమ్

రజిత డ్రీమ్ ఒకటే ఎప్పటికైనా గ్రామీణ ప్రాంతాలకి అర్థం అయ్యేలా అలాగే వారికీ ఉపయోగ పడేలా వెబ్ సైట్ తయారు చేయడమే ఆమె లక్ష్యం.

English summary

100 మంది ఇంజినీర్లు కూడా చేయలేరు కానీ ఒక్క అమ్మాయి చేసింది | 100 Engineers Can Not Do But One Girl Has Done

There are many young ladies who have become evidence of women's power that is equally capable of men all over the world.
Story first published: Friday, April 13, 2018, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X