కేంద్రాన్ని వణికిస్తున్న కర్ణాటక ఎలక్షన్స్ కారణం ..పెట్రోల్ అంట? ఏంటో చూడండి!
పెట్రో ధరల విషయంలో మోదీ సర్కారుకు మూడేళ్లకుపైగా అదృష్టం పట్టింది! కానీ. కొన్నాళ్లుగా ఆ అదృష్టం దూరమవుతూ వస్తోంది!

సిరియా యుద్ధ మేఘాలతో
సిరియా యుద్ధ మేఘాలతో కేంద్రంలో కలవరం మొదలైంది. మరీ ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ముందు పెట్రో ధరల మంట రాజకీయంగా చేటు తెస్తుందని ఆందోళన తలెత్తుతోంది. దీంతో. కొన్నాళ్లపాటు ధరలు పెంచవద్దని చమురు సంస్థలకు ‘ఆదేశాలు' వెళ్లినట్లు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల ముందు కూడా కేంద్రం ఇలాంటి వైఖరే ప్రదర్శించింది.

మోదీ అదృష్టం
2014లో మోదీ ప్రధాని అయినప్పుడు బ్యారెల్ ముడిచమురు ధర 106 డాలర్లు! మోదీ అదృష్టం కొద్దీ. చమురు ఎగుమతి దేశాల మధ్య విపరీతమైన పోటీతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడం మొదలైంది. గత ఏడాది సెప్టెంబరులో బ్యారెల్ ముడి చమురు ధర 54 డాలర్లకు చేరుకుంది.

పన్ను
మోదీ ఒక దశలో ఇదంతా ‘మా అదృష్టం' అని చెప్పుకొచ్చారు. అయితే ఈ అదృష్టం మొత్తాన్ని కేంద్రమే అనుభవించింది. పెట్రో ధరలను తగ్గాల్సినప్పుడు తగ్గించకుండా. జనం జేబుల్లో మంటపెట్టింది. అలాగని, చమురు సంస్థలకూ ఆ లాభాన్ని పంచలేదు. 2014 నవంబరు నుంచి 2016 జనవరి మధ్య పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా 9 సార్లు పెంచి తన ఖజానా నింపుకొంది. గత ఏడాది అక్టోబరులో మాత్రం లీటరుకు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. వెరసి.పెట్రో ధరల విషయంలో మోదీ సర్కారు పన్నుల పండగ చేసుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో
గత ఏడాది మధ్య నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం మొదలైంది. ఇదే అదనుగా చమురు సంస్థలు... పక్షం రోజులకొకసారి బదులు, రోజువారీగా ధరలు వడ్డించడం మొదలుపెట్టాయి. దీంతో గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.

లీటరు పెట్రోలు రూ.80
తాజాగా సిరియాపై క్షిపణి దాడి చేస్తానని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ముడి చమురు ధర ఏకంగా 73.09 డాలర్లకు చేరింది. అమెరికా సిరియాపై క్షిపణి దాడి చేస్తే దాన్ని లక్ష్యం చేరక ముందే పేల్చేస్తామని రష్యా ప్రకటించింది. దీని ప్రభావంతో ముడిచమురు ఒకేరోజు 2 శాతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటుగా లీటరు పెట్రోలు రూ.80కు చేరింది.

కర్ణాటక
అసలే మోదీపై జనంలో ఉన్న అసంతృప్తికి.పెట్రో ధరలు ఆజ్యం పోస్తున్నాయి. అటు కర్ణాటక ఎన్నికలతోపాటు... 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రంలోనూ ఇది కలవరం పుట్టిస్తోంది. మరోవైపు బ్యారెల్ ముడి చమురు ధరను 80 డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని సౌదీ అరేబియా బహిరంగంగానే ప్రకటించింది.

మన దేశంలో
బ్యారెల్ ముడి చమురు 70 డాలర్లు ఉన్నప్పుడే మన దేశంలో పెట్రో ధరలు అదుపు తప్పుతున్న పరిస్థితి. ఇది 80 డాలర్లకు చేరితే ప్రజలపై భారం మరింత పెరగడం ఖాయం. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు తగ్గించి ధరలు దించాలని ప్రజలూ కోరుకుంటున్నారు!
రిపోర్ట్స్ ఫ్రొమ్ ఏ బి న్.


Click it and Unblock the Notifications