ఈ నెంబర్ ప్లేట్ సల్లగుండ...దీని విలువ ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే?
కారు విలువ లక్షల్లో ఉండటం సాధారణ విషయం కానీ కారు నంబర్ కారు విలువ కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటే,కారు నంబర్ ఎంతుంటుంది మహా ఐతే లక్షల్లో ఉంటుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే
కారు విలువ లక్షల్లో ఉండటం సాధారణ విషయం కానీ కారు నంబర్ కారు విలువ కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటే,కారు నంబర్ ఎంతుంటుంది మహా ఐతే లక్షల్లో ఉంటుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అదేంటో అసలు ఆ కారు ఎవరిదీ ఎక్కడ ఉంది ఇంతకీ ఆ నంబర్ కి ఎందుకంత డిమాండో తెలుసుకుందాం...

సాధారణ నంబర్:
మన దేశంలో కారు కొన్నవాళ్ళు సాధారణంగా నంబర్ కోసం RTO ను సంప్రదిస్తాం అక్కడ కొన్ని నంబర్లు మనకు చూపిస్తారు వాటిలోనుండి మనకు నచ్చిన నంబర్ ఒకటి ఎంచుకొని తీసుకునే అవకాశం ఉంటుంది,కానీ కొంతమంది కారు నంబర్ బాగా ఫ్యాన్సీ గా ఉండాలని కొన్ని లక్షలు పెట్టి మరీ తీసుకుంటుంటారు.

జేమ్స్ బాండ్ నంబర్:
మనకు తెలుసు జేమ్స్ బాండ్ నంబర్ 0007,నంబర్ కి ప్రపంచవ్యాప్తంగా చాల డిమాండ్ ఉంది ఈ నంబర్ కావాలంటే లక్షల్లో డబ్బు వెచ్చించాల్సఉంటుంది.ఇదే జాబితాలో మరి కొన్ని నంబర్లు 9999,0001 కావాలంటే బోలెడు ఖర్చు పెట్టాలి.

కబాలి నంబర్:
ఇటీవల ప్రముఖ నటుడు రజినీకాంత్ నటించిన కబాలి నంబర్ కు ఎక్కడ లేనంత విదంగా విలువ చేసింది,సుమారు 8 లక్షలు ఖర్చుపెడితే వామ్మో అంత రేటా అని అందరు ముక్కున వేలేసుకున్నారు.కానీ అంతకు పది రెట్లు ఎక్కువ అంటే ఒక్కసారి ఊహించండి ఎంతుంటుందో.

uk కి చెందిన వ్యాపార వేత్త:
uk కి చెందిన ఒక వ్యాపార వేత్త తన కారు నంబరును ఈకంగా 132 కోట్లకు విక్రయిన్చేందుకు ప్రకటించారు.కారు నంబర్ F1 ఇతను ఖాన్ డిజైన్ యజమాని ఆఫ్జల్ ఖాన్ తన బుగాటి కార్ కోసం 2008 లో నాలుగు కోట్లు పెట్టి తీసుకున్నారు,కానీ ఎప్పుడు తనకు ఇష్టమైన F1 అనే నంబరును 132 కోట్లకు అమ్మాలని నిర్ణయిన్చాడు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన నంబర్:
కేవలం ఒక నంబర్ ప్లేటు ఖరీదు 132 కోట్లు అంటే మాములు విషయం కాదు ఇప్పటిదాకా చాల నంబర్ ప్లేట్ల విలువ చూసి కాస్త ఎక్కువ అనిపిస్తేనే మనం షాక్ కి గురవుతాం కానీ ఇప్పుడు ఇది ఏకంగా ఇంత బారి ఎత్తున ఖరీదంటే నమ్మలేకున్నాం కదూ.

అత్యంత ప్రసిద్ధ ప్లేట్లలో ఒకటి:
F1 ప్లేట్ UK లో మరియు ప్రఖ్యాత మోటర్లకు స్పష్టమైన సూచనల కారణంగా మరియు రెండు అంకెల ప్లేట్ అరుదుగా ఉన్న అత్యంత ప్రసిద్ధ ప్లేట్లలో ఒకటి. ఇది విక్రయించినట్లయితే, F1 ప్లేట్ ప్రపంచంలోనే విక్రయించిన అత్యంత ఖరీదైన ప్లేట్ గా నమోదవుతుంది. దుబాయ్ కి చెందిన D5 ప్లేట్ను ఇండియన్ బల్విన్డర్ సహనికి రూ. 67 కోట్లు విక్రయించిన షేడ్ను దాటేస్తుంది.ఇదే కోవలో అబూ ధాబీలో విక్రయించిన '1' అనే నంబర్ద ప్లేటు, ఇది 2008 లో సుమారు రూ 66 కోట్లు విక్రయించబడింది.


Click it and Unblock the Notifications