యూఎస్ మార్కెట్ మరోసారి భారీగా పతనాన్ని చవిచూసింది?
అమెరికా చైనా దేశాల మధ్య ట్రేడ్ యుద్ధం తార స్థాయికి చేరుకుంది ఒకరి దేశం పై మరొకరు వస్తువులపై సుంకాల్ని పెంచుతూనే వెళ్తున్నారు ఇదే సమయంలో యూఎస్ ట్రేడ్ మార్కెట్ మరోసారి భారీగా పతనానికి గురయినది.
అమెరికా చైనా దేశాల మధ్య ట్రేడ్ యుద్ధం తార స్థాయికి చేరుకుంది ఒకరి దేశం పై మరొకరు వస్తువులపై సుంకాల్ని పెంచుతూనే వెళ్తున్నారు ఇదే సమయంలో యూఎస్ ట్రేడ్ మార్కెట్ మరోసారి భారీగా పతనానికి గురయినది.

ఎస్ అండ్ పీ, నాస్‌డాక్, డౌజోన్స్ సూచీలు దాదాపు 2 శాతం మేర పతనమయ్యాయి. మరోమారు ఎస్ అండ్ పీ 500 సూచీ 2600 పాయింట్లకు దిగివచ్చింది. దీంతో వారం మొత్తం మీద సైతం యూఎస్ ఈక్విటీలు నష్టాలనే నమోదు చేసినట్లయింది. చైనా, యూఎస్ మధ్య రగులుతున్న వాణిజ్య మంటలు ఎక్కడదాగా వ్యాపిస్తాయోనన్న భయాలు వాల్‌స్ట్రీట్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి.
ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలకు నిదర్శనంగా సీబీఓఈ వీఐఎక్స్ మళ్లీ 21కి పైకి చేరింది. తాజా మార్కెట్ సంక్షోభం తాత్కాలిక బాధను మాత్రమే కలిగిస్తుందని, తమ చర్యల పర్యవసానాలు అమెరికాను మంచి స్థానంలో నిలబెడతాయని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అసౌకర్యాలను తొలగించేందుకు అనధికార చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ ఆర్థిక సలహాదారు చెప్పారు. అయితే ఎలాంటి చర్యలు జరగట్లేదని చైనా స్పష్టం చేసింది. మరోవైపు యూఎస్ జాబ్ మార్కెట్ కోలుకుంటుందన్న గణాంకాలు కనిపించినా తాజా వాణిజ్య యుద్ధమేఘాలు సదరు పాజిటివ్ వార్తను కమ్మేశాయి.
నిజానికి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో మార్కెట్లు మూడు రోజులు ర్యాలీ జరిపాయి, అయితే ట్రంప్ కఠినవ్యాఖ్యలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. వారం మొత్తం మీద ఎస్ అండ్ పీ 500 1.4 శాతం క్షీణించింది. శుక్రవారం డౌజోన్స్ 2.3 శాతం మేర పతనమైంది.


Click it and Unblock the Notifications