ఏ.పి కి దుబాయ్ కంపెనీలు వస్తున్నాయి.... ఏంటో కంపెనీలు చూద్దామా!
నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పెట్టుబడులు పెట్టేందుకు అడ్డంకిగా మారిన కొన్ని నిబంధనలను సరళతరం చేసేందుకు దుబాయ్‌కి చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరం(బీఎల్‌ఎఫ్) చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది.

సీఎం మాట్లాడుతూ
గురువారం బీఎల్‌ఎఫ్ ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, యూఏఈ పెట్టుబడివర్గాలు ఆశిస్తున్నట్లుగా ఏపీలో అపార అవకాశాలూ, విస్తృతంగా సౌకర్యాలు ఉన్నాయన్నారు. విశాలమైన తీరప్రాంతం, మంచినీటి వసతి, చల్లని వాతావరణం, మానవ వనరుల లభ్యత అన్నింటిలోనూ ముందుందని వివరించారు.

విలేజ్ టూరిజం
అరకు, లంబసింగి విలేజ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎయిర్‌లైన్స్ అభిృవృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్‌ఎఫ్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ మధ్య సీఎం సమక్షంలో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.

యూఏఈ
యూఏఈ పెట్టుబడిదారులు అడుగుపెట్టేందుకు ఇవి దోహదపడతాయని ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈవో జాస్తి కృష్ణకిశోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు రామ్ బక్సానీ, నికాయ్ గ్రూప్ చైర్మన్ పరాస్ షహద్‌పూరి, యూఏఈ ఎక్చేంజ్ ఎల్‌ఎల్‌సీ ప్రెసిడెంట్ వై.సుధీర్‌కుమార్ షెట్టి, స్కైలైన్ వర్సిటీ కాలేజీ చైర్మన్ కమల్ పూరి, దనూబ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎఫ్‌జెడ్ కో చైర్మన్ రిజ్వాన్ సాజన్, పెట్టుబడుల రంగానికి చెందిన సుదేశ్ అగర్వాల్, లులు గ్రూప్ ఎండీ అదీబ్ అహ్మద్, ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ నవాబ్ షాజీ ఉల్ ముల్క్ తదితరులు ఉన్నారు

తిరుపతిలో
తిరుపతిలో రూ.వెయ్యి కోట్లతో లగ్జరీ రిసార్ట్స్‌ను నిర్మించేందుకు సీఎం, మంత్రి అఖిలప్రియ సమక్షంలో న్యూయార్క్‌కు చెందిన ఇంటర్‌ప్స(ఐటీయూపీ) సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ లక్ష్మీప్రసాద్ పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకున్నారు. రిపోర్ట్స్ ఫ్రొం ఏబిన్


Click it and Unblock the Notifications