ఎప్పుడుఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్న మెగా ఫాన్స్ అల్ మోస్ట్ గా ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున సినిమా రంగస్థలం.

నాలుగు రోజులు
ఎప్పుడుఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్న మెగా ఫాన్స్ అల్ మోస్ట్ గా ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున సినిమా రంగస్థలం.ఇంకా ఎన్నో రోజులు లేదు అండోయ్ జస్ట్ ఒక నాలుగు రోజులు ఉంది రంగస్థలం సినిమా చూసి ఆనందపరవశంలో మునిగి తేలడానికి అదే నండీ రిలీస్ వీక్ లోకి వచ్చేసాం

క్లాసు-మాస్
ఏమి డౌట్ లేదు రంగస్థలం సినిమా అందరి నుంచి ఒక ప్రత్యేక ఆకర్షణగా స్థానం పెట్టుకొంది.
క్లాసు ,మాస్ వీళ్లు, వాళ్లు ఎలా వర్గాలతో సంబంధం లేకుండా అందరు కూడా రంగస్థలం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రంగస్థలం పాటలు
రంగస్థలం పాటలు అందరిని పలకరిస్తున్నాయి అలరిస్తున్నాయి సినిమా గురించి ఆలోచింపచేస్తునాయి. చిన్న బడి కొట్టుల నుంచి కార్లలో,ఆటోలలో, చివరికి ఎడ్లబండి లో సెల్ ఫోన్ లో ఏ పాటలు పెట్టుకొని వింటున్నారు.

రంగమ్మ మంగమ్మ
పల్లెటూరు లో ఎక్కువ ఉండేది మాస్ జనం కదా ఎక్కువ మంది "జిగేల్ రాణి" పాటని ఇష్టపడతారు అనుకుంటాం కానీ ఎక్కడ చుసిన "ఎంత చక్కగా ఉన్నావే" "రంగమ్మ మంగమ్మ" పాటలే వినపడుతున్నాయి.ఇలా సినిమా జనాలలోకి బాగా వెళ్లిపోయింది అందరు కూడా సినిమా బాగుండాలి సూపర్ హిట్ చేసేదాం అని ఎదురుచూస్తున్నారు.

రంగస్థలం టీం
రంగస్థలం టీం కూడా సిద్ధంగా ఉంది అని అనిపిస్తోంది. డైరెక్టర్ సుకుమార్ మరియు హీరో రామ్ చరణ్ ప్రచారం మొదలు పెట్టారు ప్రతి ఇంటర్వ్యూ లోను ఇద్దరు కూడా సూపర్ కాంఫిడెన్స్ తో ఉన్నారు.

మెస్మరైజ్
ఒక కొత్త ధనాన్ని తెలుగు ఆడియన్స్ కి అందిస్తున్నారు. తప్పకుండ అందరు మెస్మరైజ్ అవ్వుతారు అని చాల గట్టిగా చెబుతున్నారు. అలాగే చెప్పాలి మరి ఎందుకంటే కష్టం వారిది.

రూ.100 కోట్ల
ప్రస్తుతం అయితే తెలుగు ఆడియన్స్ చాల ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2018 మొదలు అయిన తర్వాత వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసి ఆనందపరవశంతో వాళ్లని కట్టిపడేసి బ్లాక్ బస్టర్ రాలేదు. వాళ్లు కూడా ఎదురుచూస్తున్నారు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇద్దామని ఎద్దురుచుస్తునారు.
కావలసింది అల్లా నిరాశపరచకూడదు మంచి కంటెంట్ ఇంప్రెస్స్ చేసే కంటెంట్ తో నే రంగస్థలం వస్తోంది అనిపిస్తోంది.ఆలా వస్తే కనుక రూ.100 కోట్ల బిజినెస్ ఈ సినిమాకి చాలా సులువు.

రూ.100 షేర్
సినిమా మీద ఉన్న అంచనాలు చూస్తుంటే రూ.100 కోట్ల గ్రాస్ బిజినెస్ చేయడం ఖాయం అనిపిస్తోంది.పోతే షేర్ రూ.100 కోట్లు కొడితే అది చిరుత దెబ్బ అవ్వుతుంది. ఇంత వరకు బాహుబలి రెండు సినిమాలు మెగా స్టార్ ఖైదీ 150 మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రూ.100 షేర్ సాధించిన క్లబ్ లో ఉన్నాయి. ఈ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి అందరు పెద్ద హీరోలు ఫోకస్డ్ గా నే ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ అవకాశం వచ్చింది.

రూ.80 కోట్ల షేర్
రంగస్థలం సినిమా ప్రీ రిలీస్ బిజినెస్ చూస్తుంటే సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే రూ.80 కోట్ల షేర్ తప్పకుండ వసూల్ చేయాలి.ఎందుకంటే సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన థియేటర్ ట్రైలర్ బిజినెస్ సుమారు రూ.80 కోట్లు.ఈ రూ.80 కోట్లని తిరిగి సంపాదిస్తే సినిమా హిట్ అనిపించుకుంటుంది. అంతకన్నా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే షేర్ సాధిస్తే అంత పెద్ద విజయాన్ని ముట్టకట్టుకుంటుంది. సినిమా కి హిట్ మార్క్ రూ.80 కోట్లు అందరి అంచనా రూ.100 కోట్లు

పోటీపడినట్లు
సినిమాకి జరిగిన ప్రీ రిలీస్ బిజినెస్ చూస్తుంటే రామ్ చరణ్ ఎవరితోనూ పోటీపడినట్లు అనిపించలేదు.రికార్డులు కొట్టాలి రికార్డులు తిరగరాయాలి అని ఉద్దేశంతో బిజినెస్ జరిగినట్లు అనిపించలేదు. సినిమా మీద ఇంత వరకు అంచనాలు ఉన్నాయి ఎక్కడివరకు డిస్టిబ్యూటర్స్, ఎక్కడివరకు ఎఫర్ట్ చేయగలుగుతారు అని తెలుసుకొని బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.ఒక రకంగా ఏది మంచి పరిణామం అనే చెప్పచ్చు. సినిమా కనుక మంచి టాక్ వస్తే అందరికి మంచి లాభాలు వస్తాయి.

మగధీర
రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ మగధీర రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా రికార్డు రంగస్థలంతో కొట్టాలి అని చూస్తున్నాడు.

రూ.62 కోట్లు
రంగస్థలం సినిమా కి రెండు రాష్ట్రాల వరకే రూ.62 కోట్లు ప్రీ రిలీస్ బిజినెస్ జరిగింది.ప్రతి ఏరియా లోను సినిమాకి సంబంధించి బిజినెస్ జరిగినట్లు అనిపిస్తోంది. నైజాం ఏరియా లో సినిమా ని రూ.18 కోట్లకి అమ్ముడుపోయింది.సీడెడ్ ఏరియా రూ.12 కోట్లు, ఉత్తర ఆంధ్ర హక్కులు రూ.8 కోట్లు. ఇలా మిగతా ఏరియాలో కూడా సానుకూల రేట్లకే అమ్ముడు పోయింది అని తెలుస్తోంది

ఓవర్సీస్ రైట్స్
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.62 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత ఓవర్సీస్ రైట్స్ రూ.9 కోట్లకి పోయాయి. కర్ణాటక రైట్స్ సుమారు రూ.9 కోట్లకి పోయాయి అని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొంది రంగస్థలం మూవీ.

హిందీ డబ్బింగ్ రైట్స్
అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ అంటే టీవీ లో వేయడానికి మొత్తంగా సినిమా ప్రొడ్యూసర్స్ కి రూ.112 కోట్లు సంపాదించి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే రంగస్థలం సినిమా అంత సజావుగాను పోస్టివ్ గాను అనిపిస్తోంది. మార్చి 30 న జనాలనుంచి వచ్చే టాక్ పట్టి పరిస్థితులు రకరకాలుగా మారిపోతాయి
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications