అదొక కుగ్రామం.. పట్టణానికి దూరంగా వున్న పల్లె. అయినా.. అక్కడ కరెంట్ కోత అనేది వుండదు..
కరెంట్ బిల్లు అస్సలు రాదు.

వెలిగే వీధి దీపాలు
ప్రతి ఇంటికీ రెండు బల్బులు, ఒక ఫ్యాన్ కు విద్యుత్ ఉచితం.. అక్కడి ప్రజలు మినిరలైజ్డ్ వాటరే తాగుతారు.. ఊరంతా సిమెంట్ రోడ్లు..ఊరంతా నిత్యం వెలిగే వీధి దీపాలు..ఊరి మధ్యన వేయి మంది కూర్చోడానికి అనువైన కల్యాణ మంటపం (ఊరి వారికి ఉచితం)

సంక్రాంతి
ప్రతి ఇంటికీ అధునాతనమైన మరుగుదొడ్డి..ఊరి బడిలో పిల్లలు బల్లలపై కూర్చుని డెస్కులపై రాసుకుంటారు.. అన్నట్టు సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఊరందరికీ కొత్తబట్టలు పేరు పేరునా వచ్చేస్తాయ్.

ఉద్యోగం
ఒక మాదిరిగా చదువుకున్న పిల్లాడు వుంటే చాలు వాడికి వెంటనే ఉద్యోగంఇన్ని సౌకర్యాలు.. వసతులు ఉంటాయి.

జములపల్లి
మన నేతలు జపం చేస్తున్న సింగపూరు, చైనా, జపానుల్లోనూ కాదు..అచ్చంగా మన రాష్ట్రంలో అందునా తూర్పు గోదావరి జిల్లాలో మీదు మిక్కిలి మన పిఠాపురం మండలంలోనే వుంది..
ఆ ఊరి పేరు "జములపల్లి" అవును ఈ ఊరిలో నేను చెప్పిన అన్ని సౌకర్యాలూ "అన్ని కులాల వారికీ అన్ని వర్గాల వారికి" అచ్చంగా అందుతున్నాయి.

పి పి రెడ్డి.
ఈ అద్బుతానికి ఆద్యుడు ఇదే గ్రామానికి చెందిన పి పి రెడ్డి.
ఈయన హైదరాబాద్ లోని మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అదినేత.. అంత ఎత్తు ఎదిగినా.. తప్పటడుగులు వేసిన నేలను మరిచిపోలేదు. గ్రామంలో చదువుకున్న ప్రతి యువకుడికీ తన ఫ్యాక్టరీల్లో ఉపాధి కల్పించారు.కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తన గ్రామాన్నీ అద్బుతమైన సుందర వనంగా తీర్చిదిద్దారు

కల్యాణ మంటపం
ఊరంతటికీ విద్యుత్ ఇచ్చే సోలార్ ప్లాంటు, రక్షిత నీరునిచ్చే ఆర్వో ప్లాంటు, కల్యాణ మంటపం, సిసి రోడ్లు నిర్మించారు.
అంతటితో ఆగకుండా తన ఫ్యాక్టరీలో ఈ ఊరి కోసం ఎక్కడా లేని విధంగా రెడీమేడ్ మరుగుదోడ్లు తయారు చేయించి ప్రతి ఇంటికీ ఉచితంగా అందజేశారు .జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు.

ప్రతి పల్లె సింగపూరు
ఎప్పుడైనా పిఠాపురం వస్తే తప్పకుండా ఈ భూతల స్వర్గాన్ని చూడండి..ఎదిగిన ప్రతి పారిశ్రామిక వేత్తా.. తన గ్రామం పట్ల ఇంతటి ప్రేమ కలిగి వుంటే..వేరే సింగపూర్ లు ఎందుకూ.. ప్రతి పల్లె సింగపూరు కాదా..
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications