For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు వేతన ఉద్యోగా? మీ టిడిఎస్‌ (TDS) జాగ్రత్తగా చెక్‌ చేసుకోండి

By Sabari
|

మీరు వేతన ఉద్యోగా? ప్రతి నెలా మీ జీతం నుంచి టిడిఎస్‌ (మూలం వద్ద పన్ను) కట్‌ అవుతోందా? టిడిఎస్‌ చెల్లించమని మీకు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసేమీ రాలేదు కదా.!

టిడిఎస్‌:

టిడిఎస్‌:

టిడిఎస్‌ అన్న పదం గురించి వేతన జీవులందరికీ తెలుసు. ఉద్యోగి జీతం నుంచి ఫలానా మొత్తాన్ని యాజమాన్యమే మినహాయించి.. అతని లేదా ఆమె పాన్‌ (పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్‌) పేరుతో ప్రభుత్వానికి చెల్లించడం. ఆర్థిక సంవత్సరం ముగిశాక యాజమాన్యం తన ఉద్యోగులందరికీ ఫారమ్‌-16ని అందజేస్తుంది. అందులో గడచిన ఆర్థిక సంవత్సరంలో వారికి వచ్చిన మొత్తం జీతం, చెల్లించిన పన్నుల వివరాలు వంటివన్నీ ఉంటాయి.

భారీ కుంభకోణం:

భారీ కుంభకోణం:

అయితే ఈ మధ్యే ఓ భారీ కుంభకోణం బయటపడింది. సుమారు 447 ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల నుంచి టిడిఎస్‌ పేరుతో నెలనెలా నిర్దిష్ట మొత్తాన్ని కట్‌ చేసి తమ ఖాతాలో వేసుకుంటున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చింది. దాదాపు 3,200 కోట్ల రూపాయల మేర ఇలా టిడిఎస్‌ స్వాహా జరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.

ఫారమ్‌-16

ఫారమ్‌-16

కంపెనీలు ఉద్యోగుల డబ్బును మింగేస్తే ఆదాయపు పన్ను శాఖ సదరు ఉద్యోగికే నోటీసులిస్తుంది. ఫారమ్‌-16లో లేదా ఫారమ్‌ 26 ఎఎ్‌సలో అవకతవకలు, లోపాలపై వివరణ కోరుతుంది. అప్పుడు లబోదిబోమనడం ఉద్యోగి వంతవుతుంది. ఇలా జరక్కుండా ఏం చేయాలన్న దానిపై ఐటి అధికారులు తర్జన భర్జన పడి చివరకు ఉద్యోగులే నిరంతరం తమ టిడిఎస్‌ కటింగ్‌ను తనిఖీ చేసుకొనేలా కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు.

ఎలా చేయాలి:

ఎలా చేయాలి:

  • ఫారమ్‌-16 కోసం ఏడాదంతా వేచి చూడాల్సిన పనిలేదు. ప్రతి మూడు నెలలకోసారి ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.
  • మీ లాగిన్‌, పాస్‌వర్డ్‌లతో ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు.
  • కుడి వైపున ఉన్న 26 ఎఎస్‌ టాబ్‌ను క్లిక్‌ చేస్తే ట్రేసెస్‌ అనే మరో వెబ్‌సైట్‌లోకి దారి దొరుకుతుంది.
  • ట్రేసెస్‌ వెబ్‌సైట్‌ నుంచి ఫారమ్‌ 26 ఎఎస్‌ను డౌన్‌లోడ్‌ చేయదల్చుకుంటే టాక్స్‌ క్రెడిట్‌ (ఫారమ్‌ 26 ఎఎస్‌ ఆప్షన్‌)ను క్లిక్‌ చేయాలి.
  • ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌:

    ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌:

    • మీకు ఏదైనా బ్యాంకుతో నెట్‌ బ్యాంకింగ్‌ ఉంటే దాని ద్వారా కూడా ఫామ్‌ 26 ఎఎ్‌సను చూడవచ్చు. నెట్‌ బ్యాంకింగ్‌ వెబ్‌సైటుకు వెళ్లి ‘‘ఫారమ్‌ 26 ఎఎస్‌ వ్యూ'' అన్న ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే చాలు... వివరాలన్నీ కనబడతాయి
    • మీ పాన్‌ నెంబరు పేరిట టిడిఎస్‌ కట్‌ అయి ప్రభుత్వానికి చేరిందో లేదో ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
    • ఇందుకోసం ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో మీరు తరచూ వాడే ఫోన్‌ నెంబరు (ఇది మీ అకౌంట్‌ పేరున రిజిస్టర్‌ అయి ఉండాలి) సరిగ్గా, అప్‌డేటెడ్‌గా ఉందో లేదో చూసుకోండి.
    •  పాన్‌ నంబరు:

      పాన్‌ నంబరు:

      మీ సరైన పాన్‌ నంబరును మీ యాజమాన్యానికి తెలియజేయాలి. ఒకవేళ మీరు చెక్‌ చేసుకొంటున్నప్పుడు ఏవైనా తేడాలు గమనిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకొని సవరించిన ఫారమ్‌ 16ను తీసుకోండి

English summary

మీరు వేతన ఉద్యోగా? మీ టిడిఎస్‌ (TDS) జాగ్రత్తగా చెక్‌ చేసుకోండి | What is TDS and How To Apply for TDS

TDS is the abbreviation for 'Tax Deducted at Source'. It was introduced to collect tax at the source from where an individual's income is generated.
Story first published: Monday, March 12, 2018, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X