For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో కోట్లు కొల్లగొట్టడానికి వస్తున్న పందెం కోళ్లు..?

By Sabari
|

సంక్రాంతి నాడు ఒకేసారి ఇద్దరు, ముగ్గురు పెద్ద హీరోలు వచ్చినా బిజినెస్ రూ.200 కోట్లు మించదు... దసరా నాడు మూడు, నాలుగు సినిమాలు రిలీజైనా బిజినెస్ రూ.150 కోట్లు కూడా ఉండదు... సమ్మర్‌లో ఈ లెక్కలు రూ.300 కోట్లు దాటతాయి...

పెద్ద హీరో సినిమా:

పెద్ద హీరో సినిమా:

తెలుగు సినీ ప్రియులకు శుభవార్త... ఇక ప్రతీ శుక్రవారం పండుగ చేసుకోవడమే తరువాయి... మార్చి 16 నుంచి మే 31 వరకు సినిమాల జాతరే...! ప్రతీవారం పెద్ద హీరో సినిమా... లేదంటే క్రేజీ మూవీ థియేటర్స్‌లోకి రావాల్సిందే...

క్రేజీ ప్రాజెక్ట్స్:

క్రేజీ ప్రాజెక్ట్స్:

ఈ సమ్మర్‌లో వచ్చే క్రేజీ ప్రాజెక్ట్స్ 20 దాకా ఉన్నాయి... రజనీకాంత్, మహేష్‌బాబు లాంటి సూపర్ స్టార్స్, రాంచరణ్‌, బన్నీ లాంట్ స్టార్స్, నాగార్జున, రవితేజ, గోపిచందర్ వంటి సీనియర్స్, నాని, నితిన్, నిఖిల్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలున్నారు. ఈ లెక్కన అన్నితరాల సమ్మేళనంగా సమ్మర్ సందడి చేయనుంది

కిరాక్ పార్టీ :

కిరాక్ పార్టీ :

సమ్మర్ సీజన్ మార్చి 16న రిలీజయ్యే కిరాక్ పార్టీతో మొదలవుతోంది. కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ కి రీమేక్ ఇది.రూ.4 కోట్ల తో తెరకి ఎక్కినా ఈ కన్నడ చిత్రం రూ. 40 కోట్లు వసూల్ చేసింది.వరుస హిట్స్ అందుకుంటున్న నిఖిల్ అప్ కమింగ్ మూవీ కిరాక్ పార్టీ బిజినెస్ రూ.15 కోట్లకి చేరింది

ప్రీరిలీజ్ బిజినెస్:

ప్రీరిలీజ్ బిజినెస్:

మరి ఈ సీజన్ లో వచ్చే సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ ఏంటి? వసూళ్లు ఏ తరహాలో ఉండబోతున్నాయి? ఎవరి రేంజ్ ఏంటి? తెలుసుకుందాం.

గత రెండుఏళ్లుగా సమ్మర్ వెలవెల బోయింది.ఒకరు ఇద్దరు పెద్ద హీరోలు తప్ప మరొకరు కనిపించలేదు.

స్టార్స్ సందడి :

స్టార్స్ సందడి :

కానీ ఈ సమ్మర్ కి బన్నీ ,రజనీకాంత్,లాంటి స్టార్స్ సందడి చేయనున్నారు.వీళ్ల సినిమాలు అని ఏప్రిల్ 27 న ఒకే రోజు విడుదల చేయాలని అనుకున్న పెద్దల జోక్యంతో ఈ ముగ్గురు వారం గ్యాప్ లో వస్తున్నారు.

సమ్మర్ సినిమా బిజినెస్:

సమ్మర్ సినిమా బిజినెస్:

సమ్మర్ సినిమా బిజినెస్ మొత్తం రూ.500 కోట్లు ఐతే ఈ స్టార్స్ సినిమా బిజినెస్ రూ.250 కోట్లు దాటింది.

రామ్ చరణ్ :

రామ్ చరణ్ :

సమ్మర్ లో వస్తున్న తొలి స్టార్ రామ్ చరణ్.2016 డిసెంబర్ లో వచ్చిన ధృవ తర్వాత ఏడాది తర్వాత గ్యాప్ తీసుకోని రంగస్థలం తో వస్తున్నాడు చెర్రీ.మార్చి 30 న రిలీజ్ ఐతుంటే ఇప్పటికే రిలీస్ ఐనా టీజర్స్ సినిమా పై అంచనాలు పెంచేసాయి.దింతో బిజినెస్ రూ.70 కోట్లు చేరుకుంటుంది అని అంచనా.

నితిన్:

నితిన్:

రంగస్థలం రిలీజ్ అయిన తర్వాత మరో స్టార్ హీరో రావడానికి 20 రోజులు టైం ఉంది .ఈ గ్యాప్ లో యంగ్ హీరోల నిర్మాతలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ గ్యాప్ లో చల్ మోహన రంగా అంటూ నితిన్ అదృష్టాన్ని టేస్ట్ చేసుకోబోతున్నాడు. నితిన్ ఫ్లోప్స్ లో ఉన్న త్రివిక్రమ్ కథ అందిస్తున్న సినిమా కావడం అందులోనూ పవన్ కళ్యాణ్ నిర్మాత కావడంతో చల్ మోహన రంగా బిజినెస్ రూ.25 కోట్లకి పైగా ఉంటుంది అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

నాని:

నాని:

8 వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న నాని సమ్మర్ లో ట్రిపుల్ హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వేంకటాద్రి ఎక్సప్రెస్ ,ఎక్సప్రెస్ రాజా వంటి సూపర్ హిట్స్ తీసిన మేకపార్ల గాంధీ దర్శకత్వం లో నాని నటిస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 12 న రిలీజ్ అవుతోంది. సినిమా సినిమాకి మార్కెట్ పెంచుకుంటున్న నాని కృష్ణార్జున యుద్ధం రూ.30 కోట్లకి వస్తుంది అని అంచనా.

థియేటర్స్:

థియేటర్స్:

ఏప్రిల్ లో ఎండల త్రీవ్రతతో పాటు స్టార్స్ ఎంట్రీతో సినిమా థియేటర్స్ కళకళలాడిపోతాయి. ఏప్రిల్ 20 నుంచి అసలు బిజినెస్ మొదలు అవ్వుతుంది.

మహేష్ బాబు:

మహేష్ బాబు:

మహేష్ బాబు సినిమా తో అసలు బిజినెస్ మొదలు అవ్వుతుంది. ఎందుకు అంటే సమ్మర్ సిసొన్ లో ఎక్కువ బిజినెస్ జరుపుకుంటున్న సినిమా భరత్ అనే నేను.

శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎక్కువ అంచనాలు ఉన్నాయి. శ్ర్రేమంతుడు రూ.92 కోట్లు వసూల్ చేస్తే భరత్ అనే నేను శ్రీమంతుడు బిజినెస్ దాటేస్తోంది.

రజనీకాంత్ :

రజనీకాంత్ :

సమ్మర్ రేస్ లో రిలీజ్ అవ్వుతున్నా స్ట్రయిట్ సినిమాలతో రజనీకాంత్ కాలా పోటీ పడుతోంది.భరత్ అనే నేను వచ్చిన వారం గ్యాప్ లో ఏప్రిల్ 27 న కాలా వస్తుంది. రంజిత్ దర్శకుడు.ఈ ఇద్దరి కలయికలో వచ్చిన కబాలి తెలుగు డబ్బింగ్ రైట్స్ రూ.32 కోట్లకి అమ్ముడు అయితే కాలా అనువాద హక్కులు రూ.40 కోట్లు దాటాయి.

అల్లు అర్జున్:

అల్లు అర్జున్:

ఏప్రిల్ 27 రావలసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మే 4 న రిలీజ్ అవ్వుతోంది.బన్నీ సినిమాలోకి రికార్డు స్థాయిలో నైజాం హక్కులు రూ.21 కోట్లకి అమ్ముడు ఐయ్యింది.మొత్తం మీద ట్రైలర్ రైట్స్ కి రూ.70 కోట్లు దాకా ఉండే అవకాశం ఉంది.

పెద్ద స్టార్స్ :

పెద్ద స్టార్స్ :

చిరంజీవి,బాలకృష, నాగార్జున,వెంకటేష్,మనకు నలుగురు స్టార్స్ ఉన్న సమ్మర్ లో వీళ్ల సందడి తక్కువే .చిరంజీవి నటిస్తున్న సై రా నరసింహ రెడ్డి సమ్మర్ కి రిలీజ్ కాదు.

బాలయ్య సంక్రాంతి కి జై సింహ తో వచ్చాడు. త్వరలో NTR బయోపిక్ షూటింగ్ ఇప్పట్లో మొదలు కాదు.

ఇంకా వెంకటేష్ సినిమా రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది.

నాగార్జున:

నాగార్జున:

ఈ లెక్కన సమ్మర్ కి వస్తున్న సీనియర్ హీరో నాగార్జున, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అక్కినేని ఫాన్స్ ని ఊరిస్తోంది.

గోవింద గోవింద రిలీజ్ అయిన 24 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. మే 25 న రిలీజ్ కి ముస్తాబు అవ్వుతున్నా ఆఫీసర్ బిజినెస్ రూ.20 కోట్లు ఉంటుంది అని అంచనా.

రవి తేజ :

రవి తేజ :

టచ్ చేసి చూడు ప్లాప్ తర్వాత రవి తేజ నెక్స్ట్ మూవీ బిజినెస్ మాత్రం షాక్ గురి చేస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన,రారండోయ్ వేడుక చూద్దాం,వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకుడు కావడం తో రవితేజ సినిమా బిజినెస్ రూ.27 కోట్లకి చేరింది.

గోపీచంద్ :

గోపీచంద్ :

వరుస ప్లాప్ లో ఉన్న గోపిచంద్ బాక్సాఫీస్ తో పంతానికి పోయాడు. కొత్త దర్శకుడు చక్రి నటిస్తున్న సినిమా పంతం మే 18 న రిలీజ్ అవ్వుతోంది.సరైన హిట్స్ లేకపోవడంతో పంతం బిజినెస్ రూ.20 కోట్ల లోపలే ఉంటుంది

సమ్మర్:

సమ్మర్:

సినిమాలకి పెద్ద సీజన్లో సమ్మర్,సంక్రాంతికి 5 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి అదే సమ్మర్ కి రెండు నెలలు ఉంటాయి. దింతో నిర్మాతలు సమ్మర్ ఎపుడు ఎపుడు వస్తుందా సినిమాలు రిలీజ్ చేద్దమా అని ఎదురుచూస్తుంటారు. ఆల్రెడీ చాల మంది నిర్మాతలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కూడా.

విజయ్ దేవరకొండ :

విజయ్ దేవరకొండ :

మే లో పెద్ద సినిమాలు లేకున్నా చిన్న సినిమాల మధ్య పోటీ బాగా ఉంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం టాక్సీ వాలా మే 12 విడుదలకి సిద్ధం అవ్వుతోంది.

రాహుల్ పరిచయం అవ్వుతునా ఈ సినిమాని గీత ఆర్ట్స్ నిర్మిస్తోంది.

అర్జున్ రెడ్డి రూ.6 కోట్లకి అమ్ముడు అవ్వుతే ఈ టాక్సీ వాలా మూడు ఇంతలు బిజినెస్ చేసింది.

ఆకాష్ :

ఆకాష్ :

మే లో వస్తున్న మరో చిత్రం మెహబూబా పూరి జగన్ కొడుకు హీరోగా పరిచయం చేస్తున ఈ సినిమా మే లో రానుంది.

పూరి వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న మెహబూబా బిజినెస్ డైరెక్టర్ కు తాజాగా క్రేజ్ పాటి ఉండ్తుంది అని అంచనా.

కళ్యాణ్ రామ్ :

కళ్యాణ్ రామ్ :

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా MLA మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని అర్థం.స్టార్ హీరోయిన్ కాజల్ కళ్యాణ్ రామ్ నటిస్తున్న రెండో చిత్రం ఇది.మొత్తం మీద ఈ సినిమా బిజినెస్ రూ.10 కోట్ల పైగా ఉంటుంది అని సమాచారం.

శ్రీ విష్ణు :

శ్రీ విష్ణు :

సెకండ్ హీరో గ చేసి బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు.మెంటల్ మదిలో సినిమాతో సోలో హీరో గ సక్సెస్ చూసాడు.మరో సరి నీది నాది ఒకే కథ తో అదృష్టం చూసుకోబోతున్నాడు.

నాగ చైతన్య :

నాగ చైతన్య :

ప్రేమమ్ సినిమా తర్వాత నాగ చైతన్య దర్శకుడు చందు మొండేటి కంబో లో వస్తున్న మరో సినిమా సవ్య సాచి .డైరెక్టర్ కి ఉన్న క్రేజ్ ని సినిమా బిజినెస్ రూ.15 కోట్లకి పెంచింది.

మంచు విష్ణు:

మంచు విష్ణు:

కొన్ని కారణాల వల్ల ఆగిన ఆచారి అమెరికా యాత్ర మంచు విష్ణు హీరో గ చేస్తున చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది.

సుధీర్ బాబు :

సుధీర్ బాబు :

ఇంద్ర గంటి దర్శకుడిగా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సమ్మోహనం ఇదే సీసన్ లో వస్తోంది.

సినిమా ప్రేమికులకు:

సినిమా ప్రేమికులకు:

టాలీవుడ్ సినిమా ప్రేమికులకు సమ్మర్ లో కావాల్సినంత వినోదం బిజినెస్ రూ.500 కోట్లుపెద్ద సినిమా ల వ్యాపారం దాదాపు రూ.300 కోట్లు ఉంటోంది.సమ్మర్ వ్యాపారం తెలుగు సినిమా కి లాభమా నష్టమా అనేది తెలుగు సినిమా పైన ఉంటుంది.ఈ ఏడాది రిలేస్ అయిన చలో తొలిప్రేమ హిట్ అయ్యాయి.

Read more about: business
English summary

సమ్మర్ లో కోట్లు కొల్లగొట్టడానికి వస్తున్న పందెం కోళ్లు..? | Tollywood Movies Summer Release Business Crosses 500 Crores

Sankranthi will not be over Rs 200 crore at the same time, but the business does not exceed Rs 200 crore .Dasara has three and four films that do not have a business Rs 1,000 crore. Summers will cross Rs 300 crore. But if you look at the movies of this summer ... Over 500 crores . But what's this coming summe
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X