హైదరాబాద్‌లో ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్లేందుకు త్వరలో విహాంగ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

మేనేజింగ్ డైరెక్టర్:
ప్రభుత్వ రంగ హెలీకాప్టర్ సర్వీసుల సంస్థ పవన్ హన్స్ నగరంలో హెలీ టాక్సీ సేవలను ప్రారంభించాలనుకుంటోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఏవియేషన్ షోలో పవన్ హన్స్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ బిపి శర్మ మాట్లాడుతూ.. తమ సంస్థ హైదరాబాద్‌లో హెలీ టాక్సీ సేవలను ప్రారంభించాలనుకుంటోందని అన్నారు

శంషాబాద్ విమానాశ్రయం:
అయితే, ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. త్వరలోనే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తొలుత నగరంలోని ఐటి హబ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు హెలీ టాక్సీ సేవలందించాలనుకుంటున్నట్లు శర్మ వెల్లడించారు.

హెలీ టాక్సీ సర్వీసులను:
దేశంలో మెట్రో నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని, దాంతోపాటు ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో హెలీ టాక్సీ సర్వీసులను ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, తమ సంస్థ కూడా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉందన్నారు.

2027 లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు:
సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా పదేళ్ల (2027 నాటికి)లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు శర్మ తెలిపారు. ఈ నిధులతో మరిన్ని కొత్త హెలీకాప్టర్ల కొనుగోలు, పాత వాటి ఆధునీకరణతోపాటు వ్యాపార విస్తరణకు తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 43 హెలీకాప్టర్లతో సేవలందిస్తున్న పవన్ హన్స్.. 2025 నాటికి సంఖ్యను 100కు పెంచుకోవాలనుకుంటోంది.

హెలీకాప్టర్ పైలట్ శిక్షణ:
దేశంలో ఇప్పటివరకు హెలీకాప్టర్ పైలట్ల శిక్షణ కేం ద్రం లేదని, ఔత్సాహికులకు తమ సంస్థ ట్రైనింగ్ ఇవ్వనుందన్నారు. ఇంటర్మీడియెట్ పాసైన వారు పైలట్ శిక్షణకు అర్హులని శర్మ తెలిపారు.

త్వరలో సీ ప్లేన్ సర్వీసులు:
సముద్ర విమాన సేవలపై సంస్థ గతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టిందని, తగిన అనుమతులు లభిస్తే త్వరలోనే ఈ సేవలను కూడా ప్రారంభించాలనుకుంటున్నట్లు శర్మ వెల్లడించారు. ఈ విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా సానుకూలంగా ఉందన్నారు.

సీ ప్లేన్ సర్వీసులతోపాటు:
సీ ప్లేన్ సర్వీసులతోపాటు స్మాల్ ఫిక్స్‌డ్ వింగ్ అపరేషన్స్, ఐలాండ్, టూరిజం సేవలు, హెలీపోర్టులు, హెలీప్యాడ్‌ల అభివృద్ధి, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి, ఎంఆర్‌ఒ కన్సల్టెన్సీ సర్వీసులను సైతం విస్తరించాలనుకుంటోంది.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications