కొత్తగా ఏర్పడినంక ఆంధ్ర ప్రదేశ్ లో ఇది నాలుగవ బడ్జెట్ అందులోను రాబోయే ఎన్నికలకు ఇది చివరి బడ్జెట్ కావడం తో ప్రజలంతా చాల ఆసక్తి కరంగా ఎదురుచొస్తున్నారు.
కొత్తగా ఏర్పడినంక ఆంధ్ర ప్రదేశ్ లో ఇది నాలుగవ బడ్జెట్ అందులోను రాబోయే ఎన్నికలకు ఇది చివరి బడ్జెట్ కావడం తో ప్రజలంతా చాల ఆసక్తి కరంగా ఎదురుచొస్తున్నారు.లోటు బడ్జెట్ తో విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం కూడా ఇప్పటిదాకా ఎన్నో ఇస్తామని వాగ్దానం చేసి అరా కొర నిధులు మాత్రమే ఇస్తూ వచ్చింది.అందులోను ప్రత్యేక హోదా ఇస్తామని మభ్య పెట్టి చివరకు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది.ఇలాంటి పరిణామాల మధ్య ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బడ్జెట్:
ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ AP అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఇందులో భాగంగా బడ్జెట్ పూర్తి వ్యయం రూ.1,91,63.61 కోట్లు అని చెప్పారు.క్యాపిటల్ వ్యయం అంచనా రూ.28,678.49 కోట్లు అని మరియు ఆర్ధిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లని తెలిపారు.

వెనుక బడిన వర్గాలకు:
ఇప్పటికే ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాలకు ST కులాలకు చెందిన వదువులకోసం దుల్హన్ మరియు గిరి పుత్రిక పథకం కింద సహాయం అందజేస్తోందని,ఇకనుండి SC వెనుకబడిన కులాలకు సంబందించిన వధువుకు కూడా సహాయం అందించడానికి చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఈ వర్గాలకు చెరో రూ.100 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయిస్తున్నట్టు చెప్పారు.

విద్య:
వెనుక బడిన తరగతుల విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు,పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లకు,ప్రైవేటు ఫీజు వాపసుకు,NTR విద్యోన్నతకి,NTR విదేశీ విద్యాధరణ,హాస్టల్ మరియు రెసిడెన్సియల్ విద్య కోసం దాదాపు 16 లక్షల విద్యార్థులకు లబ్ది చేకూర్చే విదంగా BC స్టడీ సర్కిల్ వంటి పథకాల కోసం గతం లో కేటాయించిన రూ.1,732 కోట్ల పై 25 శతం పెంచుతూ మొత్తం రూ.2,165 కోట్లు ప్రదిపాదించారు.కాపు సామజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 400 కోట్లు కేటాయించారు,ఆర్థికంగా వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రైవేటు ఫీజులకీ 700 కోట్లు కేటాయించారు.

చేతి వృత్తులకు:
నిరంతరం ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకునే వీలుగా అత్యాధునిక పరికరాలను సమకూర్చు కొనుటకు వెనుకబడిన తరగతులకు చెందిన చేతి వృత్తులవారికీ ఆదరణ పథకం రాష్ట్రమంతటా చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయిఇంచింది దీని ద్వారా 2,55,000 మందికి లబ్ది చేకూరుతుందని ఇందుకు గాను రూ.750 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

వెనుకబడిన తరగతుల కోసం:
వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపులో రూ.3,316 కోట్ల నుండి రూ.4,477 కోట్లు అనగా 35 శాతం పెంచుతూ బడ్జెట్ కేటాయిస్తున్నాం.
ఆర్య వైశ్యులు మరియు కాపులు:
వైశ్యుల సంక్షేమం కోసం 30 కోట్లు అలాగే కాపు;ఆ సంక్షేమం కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

చేనేత కార్మికులకు:
చేనేత పని వారు సాంప్రదాయ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు కానీ ఆధునిక సాంకేతికతతో వారు పోటీ పడలేక పోతున్నారు ప్రభుత్వం వీరు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు వీరి సంక్షేమానికి కట్టుబడి ఉందని వీరు ఉత్పత్తి చేసే వస్త్రాలను అన్ని సేకరించి నిరుపేదలకు 50 పెర్సెంట్ రాయితీలు పై జనతా వస్త్రాలుగా పంపిణి చేయాలనీ నిర్ణయించాం.ఇందుకుగాను రూ.200 కోట్లు కేటాయిస్తూ అంతే కాకా పట్టు నేత పని వారికీ నూలుపోగులపై రాయితీ కొరకు 42 కోట్లు కేటాయించారు.

మాత్స్త్యు కారులకు:
మాత్స్త్యు కారులకు మరియు మెరైన్ మాత్స్త్యు కారుల ఆదాయం పెంచేందుకు మరియు వారి జీవనోపాధి మెరుగు పరచడానికి సాపిసిది రేట్లపై మర,ముడవులు,వలలు మరియు డీజిల్ అందించే యేచనలో ఉంది ఇందుకు గాను రూ.77 కోట్లు కేటాయించారు.
అంతే కాదు 50 సంవత్సరాలు పైబడిన మచ్యు కారులకు పెన్షన్ సదుపాయం కలిగించారు.

నాయి బ్రాహ్మణులకు:
నాయి బ్రాహ్మణులకు ఆధునిక వృత్తి పరమైన సాంకేతికత పరిజ్ఞానానికి సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చేసుకోడానికి కేటాయించిన 85 లక్షల నుండి 35 రెట్లు పెంచుతూ మొత్తం రూ.30 కోట్లు ప్రకటించారు.

కళ్ళు గీత కార్మికులకు:
కళ్ళు గీత కార్మికులకు గతంలో ప్రకటించిన 35 కోట్ల నుండి 70 కోట్లకు పెంచుతూ బడ్జెట్ లో నిధులు కేటాయించారు.

వాల్మీకులకు:
వాల్మీకులకు బోయలకు గతంలో కేటాయించిన 25 కోట్ల నుండి రూ.50 కోట్లు ప్రకటిస్తూ బడ్జెట్ లో కేటాయిమ్పులు చేసారు.

వడ్డెర్లకు:
వడ్డెర్లకు గతంలో కేటాయించిన రూ.25 కోట్ల నుండి రూ.50 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదించారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications