ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. 27, 1978 ఫిబ్రవరి 27 న ఆయన చిత్తూరు జిల్లాలోని తన స్థానిక చంద్రగిరి నుండి గెలిచిన తరువాత (అసెంబ్లీ) అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ కు చెందిన అంజాయా క్యాబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు.చంద్రబాబు నాయుడు, ఎన్.టి.రామారావు (ఎన్టీఆర్) కుమార్తెని వివాహం చేసుకుని, తరువాత తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారు.

సర్పంచ్ ఎన్నికలు:
ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకే ఖర్చు లక్షలు దాటుతోంది! ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలంటే కోట్లే! మరి. 40 ఏళ్ల క్రితం చంద్రగిరి నియోజకవర్గంలో తొలిసారి బరిలోకి దిగిన చంద్రబాబు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? సుమారు రూ.89 వేలు. ఇందులో అధికభాగం ఆయన తండ్రి ఖర్జూర నాయుడు చెరకు పండించి, బెల్లం విక్రయించి ఇచ్చిన డబ్బు. మిగిలినది బాబు మిత్రులు, సన్నిహితులు తలో కొంత పెట్టుకున్నారు

ప్రచారం:
ప్రచారంలో పాల్గొనేవారికి చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ కూడా వంటచేసి పెట్టేవారు. ఆ రోజుల్లో హోటళ్లు అందుబాటులో ఉండేవి కావు. ఇంటిదగ్గరే తినేసి బయలుదేరడం, తర్వాత తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసేవారు. ఇప్పుడు... ప్రచారానికి వెళ్లాలంటే కార్లూ, జీపులూ ఉండాల్సిందే. అప్పుడు చంద్రబాబు తరఫున ప్రచారంలో రెండు మూడు కార్లు మాత్రమే వాడేవారు. అద్దెకు తీసుకుందామన్నా అందుబాటులో ఉండేవికావు. ఎక్కువగా బైకులు వాడేవారు.

బుల్లెట్ బైక్:
చంద్రబాబు బుల్లెట్, ఎజ్డీ బైక్ ఉపయోగించేవారు. బైకులపై ముగ్గురేసి ప్రయాణించేవారు. పోస్టర్లు ముద్రించిన దాఖలాలు లేవు. ఇందిరా కాంగ్రెస్ గుర్తు ‘హస్తం'. అరచేతిని ఇంకులో ముంచి గోడలపై అచ్చు కొట్టేవారు.

రూ.89వేలు ఖర్చు :
అప్పట్లో కొంత మొత్తం పత్రికల్లో ప్రకటనలకు ఖర్చు చేశారు. అప్పట్లో ఓటర్లకు నేరుగా డబ్బులు ఇచ్చే సంస్కృతి లేదు. అయితే, ఎన్నికల సందర్భంగా హడావుడి చేయడం, భోజనాలు పెట్టడం, ప్రయాణాలకు ఖర్చు అయ్యేది. అయినప్పటికీ... చంద్రబాబు తరఫున రూ.89వేలు ఖర్చు చేసినట్లు ఒక అంచనా! నలభై ఏళ్ల క్రితం ఇదేమంత తక్కువ ఖర్చు కాదు!


Click it and Unblock the Notifications