ఆంధ్రప్రదేశ్ ఫుల్ జోష్...
నవ్యాంధ్ర మంచి నేల. దేశంలో వినూత్నంగా ఆలోచించేవారిలో ఆంధ్రులు ముందు వరుసలో ఉంటారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ వ్యాలీ అవుతుంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సోమవారం ముగిసిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సభలో సిఎం ఈ విషయం ప్రకటించారు.


డిపిఆర్:
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకకు ముందుకు వచ్చే కంపెనీలు సవివరణ ప్రాజెక్టు నివేదికలు (డిపిఆర్ సమర్పిస్తే 21 రోజుల్లో అన్ని అనుమతులిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు 22వ రోజు నుంచే పనులు ప్రారంభించవచ్చన్నారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు జరుగుతుందన్నారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలకు పిలుపిచ్చారు. వ్యాపార విస్తరణకు పారిశ్రామికవేత్తలు ఎపిని కేంద్రంగా చేసుకోవాలని ఆహ్వానించారు.

1.29 లక్షల కోట్ల పెట్టుబడులు
తమ మూడున్నరేళ్ల పాలనలో ఇప్పటి వరకు రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడితో 531 పారిశ్రామిక యూనిట్లు ఉత్పత్తి దశలో ఉన్నట్టు చెప్పారు. వాటి ద్వారా 2.64 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారి నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు.

ఎలక్ట్రానిక్స్‌లో ఎపి వాటా పెంచుతాం
దేశ ఎలక్ర్టానిక్స్ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాను ప్రస్తుత 20 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎం చెప్పారు. ఎలక్ర్టానిక్స్ హార్డ్‌వేర్ కేంద్రంగా ఎపిని మలిచేందుకు పెట్టుబడులతో తరలి రావాలని కంపెనీలను ఆహ్వానించారు.

హార్డ్‌వేర్ పరిశ్రమ:
ఉపాధి అవకాశాల కల్పనలో సాఫ్ట్‌వేర్‌తోపాటు హార్డ్‌వేర్ పరిశ్రమ కూడా కీలకపాత్ర వహిస్తుందని సిఎం అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రంలో సెల్‌ఫోన్‌లు, సెట్‌టాప్ బాక్స్‌లు, వాషింగ్ మెషీన్‌లు తదితర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రూ.30,100 కోట్ల పెట్టుబడులకు వీలు కల్పించే ఎంఒయులను సిఎం, ఐటి మంత్రి లోకేశ్ సమక్షంలో అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు.


Click it and Unblock the Notifications