For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిటీ లో సొంత ఇల్లు మీ కళ..?ఐతే చూడండి..?

మనలో చాల మందికి సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ప్రతి ఒక్కరు ఎంతో కొంత సంపాదించి సొంతంగా చిన్న ఇళ్లైనా కొనుగోలు చేయాలనీ ధేయంగా ఉంటుంది.

|

మనలో చాల మందికి సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ప్రతి ఒక్కరు ఎంతో కొంత సంపాదించి సొంతంగా చిన్న ఇళ్లైనా కొనుగోలు చేయాలనీ ధేయంగా ఉంటుంది.ముక్యంగా మధ్య తరగతి కుటుంబం సంబంధించి సొంత ఇంటి కళ అనేది వారి జీవితం లో అతి ముఖ్యమైన విషయం అనే చెప్పచ్చు,వీరు నెలసరి సంపాదనలో ఇంటి కోసం కాస్త డప్పు ను బ్యాంకు లో కానీ లేదా చిట్ ఫండ్స్ లో కానీ పొదుపు చేస్తూ ఉంటారు.

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్ ఒక మహా నగరం,మెట్రోపోలిటాల్క్ సిటీల్లో ఒకటి మరియు అతి వేగంగా ఎదుగుతున్న మహా నగరాల్లో హైదరాబాద్ చాల ముందుంది.ఎక్కడికి ప్రతి రోజు అనేక ప్రాతాల నుండి కొన్ని వేళా మంది వస్తుంటారు.ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో వచ్చి ఇక్కడే స్థిరపడుతుంటారు.హైదరాబాద్ లో ప్రస్తుతం IT కంపెనీలు చాలానే ఉన్నాయి నిరంతరం కొత్త కంపెనీలు వస్తూనే ఉంటాయి యువత కు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నగరాల్లో హైదరాబాద్ డి ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు.

నగర జీవనం:

నగర జీవనం:

మెట్రోపాలిటన్ సిటీలలో పోల్చి చూస్తే హైదరాబాద్ లో జీవనం చాల అనుకూలంగా ఉంటుంది.ఎక్కడ మనకు తరచు అవసరమైన నిత్యావసర వస్తువులు కూడా చౌకగానే దొరుకుతాయి మరియు ఇంటి అద్దెలు కూడా సాధారణ రేటు లో దొరుకుతాయి అందుకే చాలామంది నగరాలకు వెళ్లి ఉద్యోగం చేసి జీవనం సాగించాలి అని అనుకునే అనేకమంది హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతారు.

సొంత ఇల్లు:

సొంత ఇల్లు:

కొన్ని సంవత్సరాలు గా నగరాల్లో ఉంటూ ఉద్యోగం లేదా ఈ ఇతరత్రా వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డ వారికీ సొంత ఇల్లు కొనుగోలు చేయాలనీ దానికి తగ్గట్టు ప్రాణిక రచించుకోము డబ్బును పొదుపుచేస్తుంటారు.ముఖ్యంగా నగరంలో సొంత ఇల్లు ఉంటే చాలు నెలకు 30 ,000 సంపాదించే వాళ్ళు సంతోషంగా కుటుంబ జీవనం సాగించవచ్చు.నగరం లో ప్రదేశాన్ని బట్టి ఇల్లు ధరలు ఉన్నాయి ఆ ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడండి.

హైటెక్ సిటీ (Hitech city ):

హైటెక్ సిటీ (Hitech city ):

హైటెక్ సిటీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది IT కంపెనీలు.హైదరాబాద్ లో అత్యధికంగా సాఫ్ట్వేర్ కంపెనీలు హైటెక్ సిటీ లో నే ఉన్నాయి.అందుకే ఈప్రాతం లో ధరలు చాల అధికంగా ఉంటాయి.IT కంపెనీలు అధికంగా ఎక్కడ ఉండటం వల్ల మిగతా వ్యాపార సముదాయాలు మొత్తం వాటి చూట్టు ఎన్నో వెలిసాయి తద్వారా ఎక్క రేట్లు అమాంతరంగా పెరిగిపోయాయి.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ.3,810 - 9,537 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ. 8,905 / sqft .

మాదాపూర్(Madhapur ):

మాదాపూర్(Madhapur ):

మాదాపూర్ కూడా IT కంపెనీలు నెలకొన్న ప్రదేశాల్లో ఒకటి,ఇక్కడకూడా అనేక కంపెనీలు మరియు ప్యాపారు సంస్థలు చాలానే ఉన్నాయి,ఇళ్ల ధరలు ఇక్కడ కూడా చాల అధికంగా వున్నాయి.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ.3,500 - 10,000 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ.8,176 / sqft

కొండాపూర్(Kondapur ):

కొండాపూర్(Kondapur ):

కొండాపూర్ లో ఇళ్ల ధరలు అత్యధికంగా ఉన్నాయి చెప్పాలంటే ఒక 10 ఏళ్ల కింద ఎక్కడ ఇళ్ల ధరలు చాల చౌకగా ఉన్నాయి కానీ దీని చూట్టు IT కంపెనీలు రావడం వల్ల అమాంతరంగా ధరలు పెరిగిపోయాయి అంతే కాకుండా చాల మంది ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది నగరానికి కాస్త దూరంగా ఉండటం కాలుష్యం కూడా తక్కువుగా ఉందాం వల్ల ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ.3,351 - 56,117 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ. 20,726 / sqft

గచ్చిబౌలి(Gachibowli ):

గచ్చిబౌలి(Gachibowli ):

గచ్చిబౌలి నగరానికి కాస్త దూరంగా ఉండటం వల్ల ఇక్కడ ధరలు కాస్త తక్కువనే చెప్పవచ్చు.కానీ ఇది IT కంపెనీలు ఉన్న ప్రదేశాలకు కాస్త సమీపంలోనే ఉంది ఈ ప్రదేశంలో స్థలాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ.2,632 - 10,000 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ. 7,688 / sqft

కూకట్పల్లి(Kukatpally ):

కూకట్పల్లి(Kukatpally ):

కూకట్పల్లి నగరం మధ్యలో నెలకొంది ఈ ప్రదేశంలో జనాభా కూడా చాల ఎక్కువగానే ఉంటారు.నగరంలో అనేక ప్రాతాలకు వెళ్లంటే ఈ ప్రదేశం మీదుగానే వెళ్ళాలి.ఇక్కడ ధరలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి సామాన్య ప్రజలు జీవించడానికి అనువుగా ఉంటుంది.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ. 2,100 - 49,790 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ. 22,959 / sqft

మియాపూర్(Miyapur ):

మియాపూర్(Miyapur ):

ఇది నగరానికి చాల దూరం అందుకే ఇక్కడ ఇళ్ల ధరలు కూడా చాల తక్కువ చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ కాస్తో కూస్తో ధరలు పలుకుతున్నాయి కానీ అభివృద్ధి లో భాగంగా నగరం నలువైపులా వేగంగా విస్తరిస్తోంది ఒక్క 5 సంవత్సరాల్లోపే ఇక్కడ కూడా ధరలు రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ. 1,259 - 35,994 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ.17,573 / sqft

బంజారా హిల్స్(Banjara Hills):

బంజారా హిల్స్(Banjara Hills):

హైదరాబాద్ నగరంలో అత్యధిక ధరలు ఉన్న ప్రదేశాల్లో బంజారా హిల్స్ ఒకటి.ఇక్కడ అత్యధిక ధనవంతులు నివసించే ప్రాంతం అంతే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన చాల మంది ఎక్కడ నివసిస్తుంటారు అందుకే ఈ ప్రాంతం లో ఇల్లు ధరలు మోస్తరుగానే ఉంటాయని చెప్పవచ్చు.ఇక ధర విషయానికొస్తే

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ.3,500 - 20,636 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ. 11,777 / sqft

జూబిలీ హిల్స్(Jubilee hills ):

జూబిలీ హిల్స్(Jubilee hills ):

జూబిలీ హిల్స్ కూడా మంచి సంపన్న కుటుంబాలు నివసించే చోటు.ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్తలు,వైద్యులు,ఇంజినీర్లు మరియు సినీ నటులు ఎంతో మంది ఇక్కడ ఆవాసం ఏర్పరచుకొని నివసిస్తున్నారు అంతే కాక పలు రాజకీయ పార్టీలకు సంబందించిన వ్యక్తులు కూడా చాల మందే నివసిస్తున్నారు.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ. 3,794 - 11,842 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ. 7,906 / sqft

హిమాయత్ నగర్(Himayat nagar ):

హిమాయత్ నగర్(Himayat nagar ):

హిమాయత్ నగర్ కూడా నగరంలో మంచి ఖరీదయిన ప్రాంతం అనే చెపొచ్చు.ఇక్కడ అనేక వ్యాపార సముదాయాలు ఉన్నాయి.షాపింగ్ మాళ్లు,హోటళ్లు,ముల్టీఫ్లెక్లు ఇంకా ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ. 792 - 7,364 / sqft గా పలుకుతోంది కచ్చితమైన ధర చెప్పాలంటే ఇంచు మించు రూ. 6,610 / sqft

దిల్సుఖ్ నగర్(Dilsukh nagar ):

దిల్సుఖ్ నగర్(Dilsukh nagar ):

దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ లో రద్దీ గా ఉండే ప్రాంతాల్లో ఒకటి.ఇక్కడ అనేక వ్యాపారాల దుకాణాలు చాలానే ఉన్నాయి.అంతే కాకుండా విద్యకు సంబంధించి అనేక పాఠశాలలు,కళాశాలలు మరియు ఎన్నో కోర్సులకు సంబంధించి ఇంస్టిట్యూట్లు ఈ ప్రాంతం లో ఉన్నాయి ఇక్కడ నివాసం అన్ని విధాలుగా మంచిది ముక్యంగా మధ్య తరగతి కుటుంబాలు నివసించేందుకు అనువైన ప్రదేశం ఇక ధర విషయానికొస్తే..

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ.3,846 per Sq.Ft.

అమీర్ పెట్(Ameerpet ):

అమీర్ పెట్(Ameerpet ):

మనందరికీ తరచు వినపడే పేరు అమీర్ పేట్ మనకు ఈ పేరు చెప్పంగనే వెంటనే గుర్తొచ్చేది విద్యార్థులు,ఎందుకంటే దేశం లో అనేక ప్రాతాలనుండి ఉన్నత విద్య పూర్తి చేసిన తరువాత మరింత నైపుణ్యం కోసం కోర్సులలో శిక్షణ పొందటానికి ఇక్కడికి వస్తుంటారు.ఈ ప్రదేశం రోజు కొన్ని వేల మంది విద్యార్థులతో నిత్యం కిటకిట లాడుతుంటుంది.ఇక్కడ ధర విషయానికొస్తే ఒక డబల్ బెదురూమ్ ఫ్లాట్

ఈ ప్రాంతం లో ఫ్లాట్ కొనాలంటే రూ. 6,666 per Sq.Ft.

Read more about: business hyderabad
English summary

సిటీ లో సొంత ఇల్లు మీ కళ..?ఐతే చూడండి..? | Property Rates And Price Trends In Hyderabad

Real estate in Hyderabad is mature both commercially and the residential market. In the recent years, despite the division of states and resultant chaos, commerce has thrived leading to improvement in the job scenario as well as infrastructure development.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X