For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిరవ్ మోడీ కి సంబంధించి రూ .5,100 కోట్ల ఆస్తులు జప్తు?

పంజాబ్ నేషనల్ బ్యాంకు లో 11 ,300 కోట్ల కుంభకోణానికి కారణమైన నిరవ్ మోడీ ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.నిరవ్ మోడీ కి సంబంధించి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ సుమారు 5 ,

|

పంజాబ్ నేషనల్ బ్యాంకు లో 11 ,300 కోట్ల కుంభకోణానికి కారణమైన నిరవ్ మోడీ ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.నిరవ్ మోడీ కి సంబంధించి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ సుమారు 5 ,100 కు పైమాటే అని వెల్లడించింది.

హైదరాబాద్, గుజరాత్ తదితర ప్రాంతాల్లోని నీరవ్ మోదీ ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో ఈడీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఇందులోభాగంగానే రూ.5,100 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

నిరవ్ మోడీ కి సంబంధించి రూ .5,100 కోట్ల ఆస్తులు జప్తు?

నీరవ్‌ మోదీ, అతని కుటుంబ సభ్యులు, కంపెనీలకు చెందిన 29 ఆస్తులను, 105 బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ జప్తు చేసింది. నీరవ్ మోదీ, ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలపై రూ.280 కోట్ల మోసానికి సంబంధించి బుధవారం ఈడీకి పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది.

విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కొన్నందుకు నల్లధనం నిరోధక చట్టం కింద నీరవ్‌ మోదీపై కేసు నమోదు చేసింది. నీరవ్‌కు సింగపూర్‌లో ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేరం రుజువైతే ఆస్తిని సొంతం చేసుకోవడమే కాకుండా 120 శాతం అదనంగా పన్ను విధిస్తారు.

ముంబై, ఢిల్లీ, సూరత్‌, జైపూర్‌లలోని ఆస్తులన్నీ జప్తు చేశారు. ఆదాయ పన్ను కేసులన్నింటిపైనా అదనంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసులు నమోదు చేసింది. నీరవ్‌ మోదీ బృందాన్ని తన ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 549 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను ఈడీ తాజాగా స్వాధీనం చేసుకుంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఫిర్యాదుపై జనవరి 31న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను విస్తృతం చేస్తూ సీబీఐ గీతాంజలి గ్రూప్‌ మీద ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. హైదరాబాద్‌ సహా దేశంలోని 20 నగరాల్లో ఉన్న గీతాంజలి నగల దుకాణాలపై దాడిచేసి, సోదాలు జరిపింది.

English summary

నిరవ్ మోడీ కి సంబంధించి రూ .5,100 కోట్ల ఆస్తులు జప్తు? | ED seizes Diamond, Gold Jewellery Worth Rs 5,100 Crore In Searches

The Enforcement Directorate swung into action on Thursday, conducting searches at several premises of Nirav Modi and Gitanjali Gems across the country, and seized assets worth ₹5,100 crore.
Story first published: Saturday, February 17, 2018, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X