ఏడు కొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద.కలియుగ ప్రత్యక్ష దైవం మన వడ్డీ కాసుల వాడు వేంకటేశ్వరుడు ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతుంటాడు.కోరిన కోర్కెలు తీర్చే దేవుడు మన తిరుమల వెంకన్న ఆలయం.

ఇలా కొండకు వచ్చే భక్తులతో పాటూ స్వామివారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. కొత్త ఏడాదిలో శ్రీవారి ఆదాయం రికార్డుల మోత మోగించింది. జనవరిలో శ్రీనివాసుడ్ని 20లక్షల 97వేలమంది దర్శించుకుంటే... హుండీ ఆదాయం రూ.83కోట్ల 84 లక్షల వరకు వచ్చిందట.

2016 నవంబర్‌లో నోట్ల రద్దుతో స్వామి హుండీ ఆదాయం తగ్గింది తర్వాత జనవరి నుంచి పెరిగింది. గతేడాది స్వామివారి హుండీ ఆదాయం రూ.69కోట్ల 95 లక్షలు.
భక్తుల రద్దీతో ఇటు లడ్డూల విక్రయం కూడా పెరిగింది. సర్వ దర్శనం ద్వారా స్వామివారికి దర్శించుకునే ఒక్కో భక్తుడికి 5 లడ్డూలు... నడకదారిలో వచ్చే ఒక్కొక్కరికి 4 ఇస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 2 లక్షల అదనపు లడ్డూల విక్రయం జరిగాయి. అలాగే అన్నప్రసాదం స్వీకరించే వారు... తల నీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. మొత్తం మీద వెంకన్నకు భక్తులు తాకిడి పెరిగింది... హుండీ కూడా నిండింది.

అంతేకాదు భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో 60వేల నుంచి 70వేలమంది వస్తే... సెలవు రోజులు, వారాంతంలో లక్షకుపైగానే స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. గతేడాదితో పోలిస్తే 26వేల 605మంది అదనంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్లుగా టీటీడీ కూడా ఏర్పాట్లను చేస్తోంది. గతంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సాధారణ సమయంలో 4 నుంచి 8 గంటలు... రద్దీ రోజుల్లో 8 నుంచి 12 గంటలులోపే పూర్తవుతోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications