దేశ ప్రజలకి ఆరోగ్య బీమా కల్పించే యోచనలో కేంద్రం
నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఆర్థిక సంస్కరణలతో సామాన్యుడికి ఆగ్రహం తెప్పించిన మోదీ సర్కారు.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రజా ప్రయోజన పథకాల దిశగా అడుగులేస్తోంది. అందులో భాగంగా దేశ ప్రజలందరికీ రూ. 5 లక్ష
నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఆర్థిక సంస్కరణలతో సామాన్యుడికి ఆగ్రహం తెప్పించిన మోదీ సర్కారు.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రజా ప్రయోజన పథకాల దిశగా అడుగులేస్తోంది. అందులో భాగంగా దేశ ప్రజలందరికీ రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పించనుందని తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా ఈ మొత్తాన్ని కేటాయించే వీలుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఓ హిందీ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ప్రజల ఆరోగ్య బీమా కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరించనున్నాయని సదరు పత్రిక తెలిపింది. ఆరోగ్య బీమా అమలు కోసం ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆరోగ్య బీమా పథకాన్ని మూడు రకాలుగా విభజించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న వారంతా కల్యాణ్ పథకం పరిధిలోకి వస్తారు. వీరికి బీమా మొత్తాన్ని ప్రభుత్వాలే చెల్లిస్తాయి. రూ. 2 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు సౌభాగ్య పథకం పరిధిలోకి వస్తారు. వీరు నామమాత్రం సొమ్ము చెల్లించి బీమా సదుపాయం పొందొచ్చు. రూ. 2 లక్షలకు మించి వార్షికాదాయం ఉన్నవారు సర్వోదయ పథకం పరిధిలోకి వస్తారు.
ఇప్పటి వరకూ దేశ జనాభాలో 4 శాతం మందే ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారు. ఆరోగ్య బీమాను అందరికీ అందుబాటులోకి తీసుకోస్తే 2019ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం చేకూరగలదని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications