For Quick Alerts
For Daily Alerts
రూ.10 నాణేలు అన్నీ చెల్లుతాయి: ఆర్బీఐ
మొత్తం 14 రకాల డిజైన్లతో కూడిన పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, లావాదేవీల సందర్భంగా వీటిని అనుమతించవచ్చని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) బుధవారంనాడు స్పష్టం చేసింది. కొంత మంది వ్యాపారులు పది రూప
|
మొత్తం 14 రకాల డిజైన్లతో కూడిన పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, లావాదేవీల సందర్భంగా వీటిని అనుమతించవచ్చని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) బుధవారంనాడు స్పష్టం చేసింది. కొంత మంది వ్యాపారులు పది రూపాయల నాణేలను అనుమతించడంలేదన్న వార్తల నేపథ్యంలో ఆర్బిఐ ఈ వివరణ ఇచ్చింది.
పది రూపాయల నాణేలపై అనుమానంతో కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు, ప్రజలు వీటిని తీసుకోవడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు ఆర్బిఐ పేర్కొంది. ఈ నాణేలపై అనుమానం అవసరంలేదని, విభిన్న రకాల డిజైన్లతో కూడిన నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ కాయిన్లు విలక్షమైన ఫీచర్లను కలిగి ఉన్నాయని, ఆర్థిక , సామాజిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో ఈ నాణేలను ఎప్పటికప్పుడు చలామణిలోకి తెచ్చినట్టు తెలిపింది. 14 డిజైన్లతో కూడిన పది రూపాయల నాణేలను ప్రభుత్వ మిట్స్లోనే తయారు చేసినట్టు పేర్కొంది. లావాదేవీలు, ఎక్స్ఛేంజ్కు బ్యాంకులు ఈ నాణేలను అనుమతించాలని ఆర్బిఐ వెల్లడించింది
Comments
English summary
రూ.10 నాణేలు అన్నీ చెల్లుతాయి: ఆర్బీఐ | all 14 designs of rs 10 coins are legal tender
Story first published: Thursday, January 18, 2018, 10:50 [IST]