For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజువారీ ధ‌ర‌ల మార్పు విధానంతో సామాన్యుడి న‌డ్డి విరుస్తున్న పెట్రోలు, డీజిల్

. అయితే తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌కు 9 పైసలు పెంచగా.. డీజిల్ లీటర్‌కు 14-16 పైసల వరకు పెంచారు. ప్రస్తుతం పెరిగిన ధరల ప్

|

దేశ రాజధాని సహా, పలు ప్రధాన నగరాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు నిత్యం పెరుగుతుండడంతో.. దానికి అనుగుణంగా దేశంలోనూ చమురు ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌కు 9 పైసలు పెంచగా.. డీజిల్ లీటర్‌కు 14-16 పైసల వరకు పెంచారు. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 61.88 ఉండగా.. పెట్రోల్ లీటర్ రూ. 71.27 ఉంది. పెరిగిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమలుకానున్నాయి. కాగా, 2014 ఆగస్టు నాటి చమురు ధరలను పరిగణనలోకి తీసుకుంటే.. సదరు నగరాల్లో నేటి ధరలు చాలా అధికమని విశ్లేషకులు చెబుతున్నారు. చమురుపై రాష్ట్రాలకు ప్రత్యేకంగా పన్ను విధించే అవకాశం ఉండడంతో.. దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేట్లు ఉంటున్నాయి.

పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

ఇండియన్ ఆయిల్ కార్పొరేష‌న్ వెబ్సైట్ ప్ర‌కారం ఢిల్లీలో డీజిల్ లీట‌రుకు రూ.61.74కు, పెట్రోలు లీట‌ర‌కు రూ.71.18 స్థాయికి చేరింది. ఆగ‌స్టు 1,2014 త‌ర్వాత ప్ర‌ధాన ఇంధ‌న ధ‌ర‌లు ఈ స్థాయికి పెర‌గ‌డం ఇదే తొలిసారి.
ఇంకా డీజిల్ ధ‌ర‌ల‌ను చూస్తే కల‌క‌త్తాలో రూ.64.40గాను, ముంబ‌యిలో రూ.65.74గాను , చెన్నైలో రూ65.08 గాను ప‌లుకుతోంది.

దేశంలోని నాలుగు ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు డీజిల్ ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి.

పెట్రోలు డీజిల్
న్యూఢిల్లీ రూ. 71.27 రూ. 61.88
కోల్ క‌త రూ. 74.00 రూ.64.90
ముంబ‌యి రూ. 79.15 రూ. 65.9
చెన్నై రూ. 73.89 రూ. 65.23
పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

బిట్ కాయిన్ అంటే ఏమిటి.. ? మ‌న దేశంలో ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా? బిట్ కాయిన్ అంటే ఏమిటి.. ? మ‌న దేశంలో ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా?

Read more about: petrol diesel
English summary

రోజువారీ ధ‌ర‌ల మార్పు విధానంతో సామాన్యుడి న‌డ్డి విరుస్తున్న పెట్రోలు, డీజిల్ | petrol and diesel prices hit all time high

According to Indian Oil Corp. Ltd., diesel price touched Rs 61.74 a litre in Delhi, while petrol hit Rs 71.18 a litre, the highest since 1 August 2014. Diesel was sold for Rs 64.40 in Kolkata, Rs 65.74 in Mumbai and Rs 65.08 in Chennai.
Story first published: Tuesday, January 16, 2018, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X