ప్రముఖ ఫోర్డ్ మోటార్స్ $ 11 బిలియన్ పెట్టుబడి, 2022 నాటికి 40 రకాల ఎలక్ట్రిక్ వాహనాలు.

2022 నాటికీ ఎలక్ట్రిక్ మోటార్స్ తయారీకి $ 11 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫోర్డ్ మోటార్స్ వెల్లడించింది.డెట్రాయిట్ ఆటో షోలో చైర్మన్ బిల్ ఫోర్డ్ మాట్లాడుతూ, భవిష్యత్లో 40 ఎలక్ట్రిక్ వ

2022 నాటికీ ఎలక్ట్రిక్ మోటార్స్ తయారీకి $ 11 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫోర్డ్ మోటార్స్ వెల్లడించింది.డెట్రాయిట్ ఆటో షోలో చైర్మన్ బిల్ ఫోర్డ్ మాట్లాడుతూ, భవిష్యత్లో 40 ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తామని పేర్కొన్నారు.
ఫోర్డ్ సీఈఓ(CEO) జిమ్ హాకెట్ పెట్టుబడిదారులతో మాట్లాడుతూ,"వచ్చే ఐదు సంవత్సరాల్లో 14 బిలియన్ల డాలర్లను వెచ్చించి ,అంతర్గత దహన ఇంజిన్ల,ట్రక్కులు,విద్యుత్ మరియు హైబ్రిడ్ కార్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు."
మ‌రిన్ని వివ‌రాల‌ను ఈ కింద తెలుసుకుందాం.

 1. ఇంజినీరింగ్, ప‌రిశోధ‌న, అభివృద్దికై భారీ వ్య‌యం

1. ఇంజినీరింగ్, ప‌రిశోధ‌న, అభివృద్దికై భారీ వ్య‌యం

గత అక్టోబర్లో ప్రకటించిన 2020 నాటి పెట్టుబడి వ్యయం $ 4.5 బిలియన్ల కన్నా ప్రస్తుతం ప్రకటించిన పెట్టుబడి చాలా ఎక్కువగా ఉందని ఫోర్డ్ ప్రతినిధులు పేర్కొన్నారు, ఫోర్డ్ యొక్క ఇంజనీరింగ్, పరిశోధన మరియు అభివృద్ధి ఖర్చులు 2015 లో $ 6.7 బిలియన్లు కాగా 2016 నాటికీ $ 7.3 బిలియన్లకు చేరింది.

2.2022 నాటికీ 40 రకాల విద్యుత్ వాహనాలు

2.2022 నాటికీ 40 రకాల విద్యుత్ వాహనాలు

ఫోర్డ్ 40 రకాల విద్యుత్ వాహనాలు 2022 నాటికి తమ ప్రపంచ శ్రేణుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, అందులో 16 పూర్తి విద్యుత్ ఆధారితంగాను , మిగిలినవి హైబ్రిడ్లలో ప్లగ్-ఇన్ ఉంటాయని తెలిపారు.

ఫోర్డ్ సంస్థ విలేఖరులతో మాట్లాడుతూ తమ ప్రధాన వాహనాలు మరియు ఐకానిక్ వాహనాలపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అలాగే విద్యుదీకరణంతో విజయవంతం కావాలనుకుంటే, ఇప్పటికే జనాదరణ పొందిన వాహనాలతో వీటిని తాయారు చేయాలనీ చెప్పారు.

3. వివిధ కంపెనీల ప్ర‌ణాళిక‌లు ఇలా

3. వివిధ కంపెనీల ప్ర‌ణాళిక‌లు ఇలా

జనరల్ మోటార్స్ కంపెనీ , టొయోటా మోటార్ కార్పొరేషన్ మరియు వోక్స్వాగన్ AG ఇప్పటికే వారి ఎలక్ట్రిక్ వాహన త‌యారీలను విస్తరించేందుకు మరియు విలాసవంతమైన, పనితీరు మరియు SUV బాడీ శైలిని కోరుకుంటున్న వినియోగదారులకు అందిస్తున్నాయి - అదే వాహనంలో మూడు లక్షణాలను కలిగి ఉంటాయి.

చైనా, యూరప్ మరియు కాలిఫోర్నియాలో నియంత్ర‌ణ సంస్థ‌లు నుంచి ఒత్తిడి కార‌ణంగా ప్ర‌ధాన వాహ‌న త‌యారీదారులు త‌మ ప్రణాళిక‌ల‌ను మార్చుకుంటున్నారు. వారు ఎలక్ట్రిక్ సెడాన్ మరియు SUV లను తయారుచేసే టెస్లా ఇంక్ యొక్క విజయానికి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

4. జన‌ర‌ల్ మోటార్స్, వోక్స్ వాగ‌న్ ఇలా...

4. జన‌ర‌ల్ మోటార్స్, వోక్స్ వాగ‌న్ ఇలా...

2023 నాటికి కొత్త‌గా 20 ర‌కాల బ్యాట‌రీ ఆధారిత విద్యుత్ వాహ‌నాల త‌యారీ చేప‌ట్ట‌నున్న‌ట్లు జ‌న‌ర‌ల్ మోటార్స్ పేర్కొంది. అమెరికా, చైనా దేశాల్లో అమ్మ‌కాల ద్వారా దీనికి సంబంధించిన నిధుల రాక జ‌రుగుతోంది.

2022 నవంబర్ నాటికీ ఎలక్ట్రిక్ కార్లు, స్వతంత్ర డ్రైవింగ్ మరియు కొత్త మొబిలిటీ సేవలపై 40 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వోక్స్వ్యాగన్ వెల్లడించింది. స్వీయ డ్రైవింగ్ కార్ల కోసం 2 నెల‌ల క్రితం 2030 భ‌విష్య‌త్ ప్రణాళికలో ప్ర‌క‌టించిన 20 బిలియ‌న్ యూరోల కంటే ఇది ఎక్కువ‌.

*హైబ్రిడ్ -పెట్రోల్,డీజిల్ లేదా విద్యుత్ ఆధారిత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+