కేంద్ర బడ్జెట్ 2018 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టనుంది.
స్వాతంత్రం తర్వాత ఏటా ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్ పెట్టే సంప్రదాయాన్ని భాజపా ప్రభుత్వం ఒక్కసారిగా మార్చివేసింది. ఈ సారి కేంద్ర బడ్జెట్ 2018 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టనుంది
స్వాతంత్రం తర్వాత ఏటా ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్ పెట్టే సంప్రదాయాన్ని భాజపా ప్రభుత్వం ఒక్కసారిగా మార్చివేసింది. ఈ సారి కేంద్ర బడ్జెట్ 2018 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టనుంది.

సాధారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి రోజుల్లో అనగా 28,29 తేదీల్లో నిర్వహిస్తారు కానీ 2018నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ బడ్జెట్ తేదీలను దేశ రాష్ట్రపతికి తెలియజేసింది. అంతే కాకుండా జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 9న పార్లమెంటరీ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తాయని తెలిపారు. దాని తర్వాత ఒక నెల విరామం ఇచ్చి రెండో దశ సమావేశాలను మార్చి 5న మొదలుపెట్టి ఏప్రిల్ 6న ముగిస్తారని వివరించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు గత శుక్రవారమే ముగిశాయి. ఎగువ సభ, దిగువ సభ కలిసి మొత్తం 13 బిల్లులను ఈ సమావేశాల్లో పాస్ చేశాయి.భారత రాజ్యాంగంలోని 112 కథనంలో వార్షిక ఆర్థిక నివేదిక వలె సూచించబడిన భారత కేంద్ర బడ్జెట్ అనేది పార్లమెంట్‌లో భారత ఆర్థిక శాఖామంత్రి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో చివరి రోజు సమర్పించే గణతంత్ర భారతదేశ వార్షిక బడ్జెట్. ఈ బడ్జెట్ భారతదేశ ఆర్థిక సంవత్సరం ప్రారంభ రోజు ఏప్రిల్ 1న అమలులోకి రావడానికి ముందు సభలో ఆమోదాన్ని పొందాలి. మాజీ ఆర్థిక శాఖామంత్రి మోరార్జీ దేశాయి గరిష్ఠంగా ఎనిమిదిసార్లు బడ్జెట్‌ను రూపొందించారు.


Click it and Unblock the Notifications