For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ‌రుస‌గా మూడో రోజు రికార్డు స్థాయి ముగింపును న‌మోదు చేసిన సెన్సెక్స్

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 90 పాయింట్లు పెరిగి 34,443 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్లు జమచేసుకుని 10,637 వద్ద స్థిరపడింది.

|

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 90 పాయింట్లు పెరిగి 34,443 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్లు జమచేసుకుని 10,637 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ నిఫ్టీ 34,488 వరకూ ఎగసింది. నిఫ్టీ సైతం ఒక దశలో 10,659ను తాకింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెంచరీ చేసిన సెన్సెక్స్ ఆపై రోజంతా కన్సాలిడేట్‌ అయినప్పటికీ చివర్లో పెరిగిన కొనుగోళ్లతో తిరిగి పటిష్ట లాభంతో ముగిసింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి అన్నిటికంటే అత్య‌ధికంగా 2.88% లాభ‌ప‌డింది. దాని త‌ర్వాత క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.81%), ఎఫ్ఎంసీజీ(0.45%), ఐటీ(0.32%) లాభ‌ప‌డ్డ వాటిలో ముందున్నాయి. మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో ప‌వ‌ర్(0.34%), హెల్త్ కేర్(0.63%), ఆటో(0.39%), క్యాపిట‌ల్ గూడ్స్(0.36%) ముందున్నాయి.

 90 పాయింట్లు లాభ‌ప‌డ్డ సెన్సెక్స్

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో కోల్ ఇండియా(5.63%), యెస్ బ్యాంక్(2.31%), విప్రో(2.11%), ఐటీసీ(1.94%), రిల‌య‌న్స్(1.34%) ముందుండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో బ‌జాజ్ ఆటో(0.69%), ఎన్‌టీపీసీ(0.73%), స‌న్ ఫార్మా(0.86%), హీరో మోటోకార్ప్‌(0.91%) ,అదానీ పోర్ట్స్(1.13%), భార‌తీ ఎయిర్‌టెల్(1.18%) ముందు వ‌రుస‌లో ఉన్నాయి.

విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట‌ర్లు రూ. 692.83 కోట్ల మేర విలువైన షేర్ల‌ను కొన్నారు. అదే స‌మ‌యంలో దేశీయ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు రూ. 206.30 కోట్ల మేర విలువైన షేర్ల‌ను అమ్మేశారు.

English summary

వ‌రుస‌గా మూడో రోజు రికార్డు స్థాయి ముగింపును న‌మోదు చేసిన సెన్సెక్స్ | Sensex hits record closing high for 3rd straight session

The Sensex and Nifty edged higher to a record close for a third consecutive session on Tuesday, helped by gains in energy shares such as Reliance Industries Ltd and Coal India Ltd.
Story first published: Tuesday, January 9, 2018, 16:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X