కొత్త ఏడాదిలో విమాన ప్రయాణాలపై ఆఫర్ ప్రకటించిన ఇండిగో
ఇండిగో విమానయాన సంస్థ కొత్త ఏడాది విక్రయాలను ప్రకటించింది. నేటి(సోమవారం)నుంచి మూడు రోజులు పాటు ఈ సేల్ నిర్వహించనుంది. ఈ న్యూ ఇయర్ సేల్‌లో విమాన టికెట్ల ప్రారంభ ధర రూ. 899 గా ఉంటుందని ఇండిగో ప్రకటించ
ఇండిగో విమానయాన సంస్థ కొత్త ఏడాది విక్రయాలను ప్రకటించింది. నేటి(సోమవారం)నుంచి మూడు రోజులు పాటు ఈ సేల్ నిర్వహించనుంది. ఈ న్యూ ఇయర్ సేల్‌లో విమాన టికెట్ల ప్రారంభ ధర రూ. 899 గా ఉంటుందని ఇండిగో ప్రకటించింది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసిన చెల్లింపులపై10శాతం దాకా క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. తద్వారా సుమారు రూ.600 వరకు అదనపు ప్రయోజనం అలాగే మరో రూ. 600 వరకువరకు అదనంగా రూ. 600 వరకు ఇండిగో స్పెషల్ సర్వీస్ వోచర్లు కూడా అందుబాటులోఉంటాయని తెలిపింది.అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్లు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణాలకు చెల్లుబాటులో ఉంటాయి.

ఇండిగో అధికారిక వెబ్ సైట్ www.goindigo.in, సంస్థ యాప్‌తోపాటు ఇతర బుకింగ్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రయాణ కాల వ్యవధిలో రూ .899 నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే కేవలం చట్టపరమైన పన్నులు తిరిగి ఇవ్వబడతాయి.గ్రూప్ బుకింగులకు ఈ ఆఫర్ వర్తించదు. ఎంపిక చేసిన విమానాల్లో పరిమిత సీట్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పరిమితి ముగిసిన తరువాత సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇండిగో వెబ్‌సైట్‌లో ఇచ్చారు. నియమ నిబంధనలను పూర్తిగా చదివి టికెట్ బుక్ చేసుకోండి.


Click it and Unblock the Notifications