For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త‌గా రూ.10 నోటును ముద్రించనున్న రిజ‌ర్వ్ బ్యాంక్

ఆర్బీఐ కొత్త రూపులో రూ.10 నోట్ల‌ను తీసుకురానుంది. చాక్లెట్ బ్రౌన్ రంగులో ఉండే ఈ నోటును ఆర్బీఐ ముద్రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నోటుకు వెనుక‌వైపు దేశ వార‌స‌త్వ సాంస్కృతిక సంప‌ద అయిన కోణార్క్ సూర్య దే

|

ఆర్బీఐ కొత్త రూపులో రూ.10 నోట్ల‌ను తీసుకురానుంది. చాక్లెట్ బ్రౌన్ రంగులో ఉండే ఈ నోటును ఆర్బీఐ ముద్రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నోటుకు వెనుక‌వైపు దేశ వార‌స‌త్వ సాంస్కృతిక సంప‌ద అయిన కోణార్క్ సూర్య దేవాల‌యం ఉండేలా నోటును ప్రింట్ చేయ‌నున్న‌ట్లు ఆర్బీఐ ప్ర‌క‌టించింది. మామూలుగా ఇత‌ర నోట్ల లాగే ముందు మ‌హాత్మాగాంధీ బొమ్మ‌, అశోక స్థూపం ఉంటాయి. వెనుక మాత్రం ఈసారి చరిత్ర‌ను గుర్తు చేస్తూ వార‌స‌త్వ క‌ట్ట‌డం బొమ్మ‌ను ఉంచేలా ఎంచుకున్నారు. 100 కోట్ల రూ.10 నోట్ల‌ను ముద్ర‌ణ చేస్తార‌ని కేంద్ర బ్యాంకు తెలిపింది.ఆర్బీఐ ఈ ప‌నులు చేస్తుంద‌ని మీకు తెలుసా..

 ఆర్బీఐ నుంచి కొత్త రూ.10 నోటు

రూ.10 నోట్ల‌కు సంబంధించి ఇదివ‌ర‌కూ చివ‌ర‌గా 2005లో డిజైన్ చేశారు. నోట్ల న‌కిలీల‌కు తావివ్వ‌కుండా, నోట్ల‌ను దుర్వినియోగం చేసే అవ‌కాశం ఇవ్వ‌కుండా నోట్ల ముద్ర‌ణ‌కు సంబంధించి డిజైన్ మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం సూచిస్తూ ఉంటుంది. గ‌తేడాది ప్ర‌భుత్వం రూ.200 నోట్ల డిజైన్ కోసం అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లో రూ.50, రూ.200 నోట్లు చ‌లామ‌ణీలోకి వ‌చ్చిన సంగ‌తి విదిత‌మే. న‌వంబ‌రు 8,2016 నాడు నోట్ల మార్పిడి త‌ర్వాత రూ.2000 నోట్ల‌ను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే రూ2000 నోటుకు, రూ.500 నోటుకు మ‌ధ్య ఎటువంటి నోటు లేక‌పోవ‌డంతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంతే కాకుండా రూ.2000 నోటుకు చిల్ల‌ర లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం, ఆర్బీఐ రూ.200 నోటు తీసుకురావాల‌ని యోచించాయి.

Read more about: rbi notes currency
English summary

కొత్త‌గా రూ.10 నోటును ముద్రించనున్న రిజ‌ర్వ్ బ్యాంక్ | New 10 Currency Notes Introduced, In Chocolate Brown Colour

The Reserve Bank of India (RBI) will shortly issue new banknotes of Rs. 10 denomination, the central bank said on Friday. The new Rs. 10 notes will be in the Mahatma Gandhi (New) Series, and will bear the signature of RBI Governor Dr Urjit R Patel, the central bank said in an official statement.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X