అప్పుల భారంతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)కు భారీ ఉపశమనం లభించింది. ఆర్‌కామ్‌కు అతిపెద్ద విదేశీ రుణదాతగా ఉన్న చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ (సీడ
అప్పుల భారంతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)కు భారీ ఉపశమనం లభించింది. ఆర్‌కామ్‌కు అతిపెద్ద విదేశీ రుణదాతగా ఉన్న చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ (సీడీబీ) ఆ సంస్థపై దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నది. ఈ పిటీషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీడీబీ తరఫు న్యాయవాది ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కు తెలియజేయడంతో అందుకు ట్రిబ్యునల్ అనుమతించింది.

చైనాకు చెందిన మరో రెండు బ్యాంకులతో కలసి ఆర్‌కామ్‌కు దాదాపు 200 కోట్ల డాలర్ల రుణమిచ్చిన సీడీబీ.. తమకు ఆర్‌కామ్ పెద్ద మొత్తంలో బకాయి పడిందని, కనుక ఆ సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ గత ఏడాది నవంబర్‌లో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. అయితే ఈ విషయమై సదరు బ్యాంక్‌తో చర్చలు జరుపుతున్న ఆర్‌కామ్ గత వారం రుణ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్‌తో పాటు టెలికం టవర్లను కొనుగోలు చేసేందుకు అనిల్ అంబానీ అన్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ముందుకు రావడంతో సీడీబీ తన దివాలా పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications