ఓవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు, మరోపక్క మెటల్ కౌంటర్లూ పోటాపోటీగా పెరగడంతో మార్కెట్లు చివరి గంటలో జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 176 పాయింట్లు(0.5
ఓవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు, మరోపక్క మెటల్ కౌంటర్లూ పోటాపోటీగా పెరగడంతో మార్కెట్లు చివరి గంటలో జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 176 పాయింట్లు(0.52%)పెరిగి 33,970 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు జంప్‌చేసి 10,505 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 34,000 పాయింట్ల మైలురాయిని మరోసారి చేరువకాగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,500ను అధిగమించింది. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 3 శాతం చొప్పున ఎగశాయి. ఫార్మా సైతం 1.3 శాతం పుంజుకోవడం గమనించదగ్గ అంశం.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో రంగాల వారీగా చూస్తే మూలధన వస్తువులు(2.02%), లోహ రంగం(1.96%), మూలధన వస్తువులు(1.69%), పీఎస్‌యూ(1.37%) రంగాలు లాభపడ్డాయి. మరో వైపు స్థిరాస్తి(0.3%), వాహన రంగం(0.28%), ఐటీ రంగం(0.13%) నష్టాలకు గురైన వాటిలో ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి.లాభపడ్డ వాటిలో టాటా స్టీల్ (3.74 శాతం), డాక్టర్ రెడ్డీస్ (3.14 శాతం), ఎల్ అండ్ టి (+ 3.08 శాతం), ఓఎన్జిసి (2.92 శాతం), ఆసియా పెయింట్స్ (2.71 శాతం) ముందున్నాయి, మరో వైపు టాటా మోటార్స్ (-0.81%), పవర్గ్రిడ్ (-0.67%), యాక్సిస్ బ్యాంక్ (-0.4%), ఇన్ఫోసిస్ (-0.37%) మరియు మారుతి (-0.37%) నష్టాలకు గురైన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications