For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 శాతం వార్షిక వృద్ది సాధించిన ఆర్‌ఐఎన్‌ఎల్‌

రాష్ట్రీయా ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) టర్నోవర్‌ దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ కాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థ టర్నోవర్‌ రూ.11,405 కోట్లకు చేరింది.

|

రాష్ట్రీయా ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) టర్నోవర్‌ దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ కాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థ టర్నోవర్‌ రూ.11,405 కోట్లకు చేరింది. ఇంత క్రితం ఏడాది ఇదే కాలం టర్నోవర్‌తో పోల్చితే 30 శాతం వృద్ధి సాధించింది. ఇదే సమయంలో 13 శాతం పెరుగుద లతో 36.5 లక్షల టన్నుల హాట్‌ స్టీల్‌ ఉత్పత్తిని సాధించింది. కాగా 15 శాతం వృద్ధితో పెరుగుదలతో 35.4 లక్షల మిలి యన్‌ టన్నుల లిక్విడ్‌ స్టీల్‌ ఉత్పత్తిని నమోదు చేసింది. సీలే బుల్‌ స్టీల్‌ ఉత్పత్తి 15 శాతం పెరిగి 31.9 లక్షల టన్నులుగా నమోదు చేసింది. 2017లో విస్తరణ కూడా పూర్తి అయ్యిం దని ఆర్‌ఐఎన్‌ఎల్‌ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సిఎండి) మధూసుధన్‌ తెలిపారు. విస్త రణ, ఆధునీకరణతో ఈ ప్లాంట్‌ సామర్థ్యం 73 లక్షల టన్ను లకు చేరిందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా ప్రగతిని కనబర్చిందని మధుసూధన్‌ పేర్కొన్నారు.

ఆర్‌ఐఎన్‌ఎల్ ట‌ర్నోవ‌ర్లో మంచి పురోగ‌తి

నవంబర్‌, డిసెంబర్‌ కాలంలో స్థూల మార్జిన్లు సాధించా మని, ఇదే సమయంలో ఎలాంటి అప్పులు తీసుకోలేద న్నారు. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో మార్కెటింగ్‌ డిపార్టుమెంట్‌ 10 లక్షల టన్నుల అమ్మకాలు చేసిందన్నారు. చివరి నెలలో రూ.2,000 కోట్ల టర్నోవర్‌ వచ్చిందన్నారు. 2017-18లో 10 లక్షల మిలియన్‌ టన్నుల ప్రత్యేక స్టీల్‌ను ఉత్పత్తి చేయాలని గతేడాది అక్టోబర్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ రంగంలో అధిక మార్కెట్‌ వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఇప్పటికే నూతన టెక్నలాజీని అందిపుచ్చుకుందని సిఎండి తెలిపారు. స్పెషల్‌ స్టీల్‌ సెగ్మెంట్‌లో మార్కెట్‌ వాటా పెంపునపై దృష్టి కేంద్రీకరించామన్నారు.

Read more about: rinl results
English summary

30 శాతం వార్షిక వృద్ది సాధించిన ఆర్‌ఐఎన్‌ఎల్‌ | RINL Outperfomed in April decmeber period

Rashtriya Ispat Nigam Ltd(RINL) registered a growth in all areas of operations including the turnover which stood at Rs 11,405 crore during April-December of 2017, the PSU said.
Story first published: Wednesday, January 3, 2018, 13:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X