దేశంలో ఎంబీఏ ఫైనాన్స్ కోర్సునందించే 10 ఉత్త‌మ క‌ళాశాల‌లివే! చేరిపోతారా?

మ‌న దేశంలో సుమారు 3వేల విద్యాసంస్థ‌లు మ‌నేజ్‌మెంట్ విద్య‌నందిస్తున్నాయి. ఐతే వీటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే నాణ్య‌మైన విద్య‌ను అందిస్తూ , జీవితకాలానికి స‌రిపోయే అనుభ‌వాన్ని క్యాంప‌స్ లో అందిస్తున్నా

మ‌న దేశంలో సుమారు 3వేల విద్యాసంస్థ‌లు మ‌నేజ్‌మెంట్ విద్య‌నందిస్తున్నాయి. ఐతే వీటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే నాణ్య‌మైన విద్య‌ను అందిస్తూ , జీవితకాలానికి స‌రిపోయే అనుభ‌వాన్ని క్యాంప‌స్ లో అందిస్తున్నాయి. కొన్ని క‌ళాశాలల్లో ప్ర‌పంచ శ్రేణి నాణ్య‌తా ప్ర‌మాణాలున్నాయి.
మ‌న దేశంలో ఎంబీఏ ఫైనాన్స్ కోర్సును అందించే టాప్ 10 కాలేజీలు ఇవే...

1. ఐఐఎం, అహ్మ‌దాబాద్‌

1. ఐఐఎం, అహ్మ‌దాబాద్‌

మేనేజ్‌మెంట్ కోర్సు చ‌ద‌వాల‌నుకునే ప్ర‌తి విద్యార్థి క‌ల‌ల కాలేజీ ఐఐఎం అహ్మ‌దాబాద్‌. వ్యాపారం నిర్వ‌హించాల‌నుకునేవారికి, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా ఎద‌గాల‌నుకునేవారికి ఈ క‌ళాశాల చాలా ఉత్త‌మ‌మైన‌ది. మొత్తం నాలుగు ప్రోగ్రాముల‌ను ఈ క‌ళాశాల అందిస్తుంది. ఎంబీఏ ఫైనాన్స్‌ను చాలా చ‌క్క‌గా బోధిస్తారు ఇక్క‌డ‌.

2.ఐఐఎం క‌ల‌క‌త్తా

2.ఐఐఎం క‌ల‌క‌త్తా

ఐఐఎం క‌ల‌క‌త్తా భార‌త‌దేశంలో ఉన్న అన్ని ఐఐఎంలోకెల్లా చాలా పాత‌ది. ఆయా విభాగాల్లో అత్యంత చురుకైన‌, తెలివైన విద్యార్థుల‌ను త‌యారుచేస్తుంద‌ని క‌ళాశాల‌కు మంచి పేరుంది. ఇక్క‌డున్న ఆచార్యులు చాలా నిష్ణాతులు. క్యాంప‌స్ ప్లేస్‌మెంట్లు సైతం బాగా జ‌రుగుతుంటాయి. ఫైనాన్స్ విభాగంలో ఉత్త‌మంగా రాణిస్తోంది. కొన్నిసార్లు ఫైనాన్స్ విభాగంలో అహ్మ‌దాబాద్ ఐఐఎంతో పోలుస్తారు.

3. ఐఐఎం బెంగ‌ళూరు

3. ఐఐఎం బెంగ‌ళూరు

మేనేజ్‌మెంట్ కోర్సులో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఈ క‌ళాశాల అందిస్తుంది. దీంతో పాటు మేనేజ్‌మెంట్‌లో ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హిస్తుంది. క్యాట్‌లో మెరుగైన స్కోరును సాధించిన‌వారికి ఇక్క‌డ ప్ర‌వేశం ల‌భిస్తుంది. కొన్న సార్లు బెంగ‌ళూరు క్యాంప‌స్ క‌ల‌కత్తా కంటే మెరుగైన ఫ‌లితాలు అందిస్తుంది.

4. ఐఐఎం, ల‌క్నో

4. ఐఐఎం, ల‌క్నో

ఆ త‌ర్వాతి స్థానం ల‌క్నో ఆక్ర‌మిస్తోంది. ఇది కూడా బెస్ట్ ఎంబీఏ ఇనిస్టిట్యూట్‌ల‌తో ఒక‌టి. ఈ క‌ళాశాల ఓవ‌ర్‌సీస్ ఎక్స్‌ఛేంజీ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. అంటే ఇత‌ర దేశాల‌కు వెళ్లి ఒక ఏడాదిపాటు చ‌దివి రావొచ్చు అన్న‌మాట‌. ఇది జీవిత కాలానికి స‌రిప‌డా అనుభ‌వాన్ని మిగ‌ల్చ‌గ‌లుగుతుంది. ఒక నిర్ణీత విభాగంలో జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇదెంతో దోహ‌ద‌ప‌డుతుంది. ల‌క్నో క్యాంప‌స్‌కు మంచి ఫైనాన్స్ క‌రిక్యుల‌మ్ ఉంది.

5. గ్జేవియ‌ర్ లేబ‌ర్ రీసెర్చ్ ఇన్సిటిట్యూట్‌, జంషెడ్‌పూర్ (ఎక్స్ఎల్ఆర్ఐ)

5. గ్జేవియ‌ర్ లేబ‌ర్ రీసెర్చ్ ఇన్సిటిట్యూట్‌, జంషెడ్‌పూర్ (ఎక్స్ఎల్ఆర్ఐ)

1949లో జంషెడ్‌పూర్‌లో దీన్ని స్థాపించారు. ప్ర‌పంచ‌శ్రేణి వ‌స‌తులు, హాస్ట‌ల్ సదుపాయాలు, ఇత‌ర సౌక‌ర్యాలు ఇక్క‌డ ఉంటాయి. ఐఐఎంల‌తో స‌మానంగా అత్యాధునిక వ‌సతులు ఇక్క‌డ ల‌భిస్తాయి. దీంతోపాటు క‌ళాశాల‌కు ప్లేస్‌మెంట్లు బాగా వ‌స్తాయని పేరుంది. చాలా ర‌కాల స్పెష‌లైజేష‌న్ కోర్సుల‌ను ఇక్క‌డ అందిస్తారు. 4-5 ఏళ్ల అనుభ‌వం ఉన్నవారికి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాముల‌ను సైతం ఈ క‌ళాశాల అందిస్తుంది. వ‌ర్చువ‌ల్ పాఠాల‌ను కూడా అందిస్తారిక్క‌డ‌. ఉత్త‌మ‌మైన మాన‌వ వ‌న‌రుల విభాగం ఇక్క‌డుంద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తిగా పేరుంది. ఐతే చాలా మందికి తెలియ‌ని విష‌య‌మేమిటంటే ఫైనాన్స్‌లోనూ మంచి బోధ‌న సిబ్బంది ఉన్నారు. దేశంలోనే ఉత్త‌మ‌మైన ఫైనాన్స్ టీచింగ్ సిబ్బంది ఇక్క‌డ ఉన్నారు.

6. ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌, హైదరాబాద్‌

6. ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌, హైదరాబాద్‌

ఐఎస్‌బీ హైద‌రాబాద్ ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌కు హాట్ చాయిస్‌గా ఉంటోంది. అప్‌డేటెడ్‌గా ఉన్న సిల‌బ‌స్ విధానం వ‌ల్లే ఇది సాధ్య‌ప‌డుతుంది. ఏడాది వ్య‌వ‌ధి క‌లిగిన కోర్సులు ఇక్క‌డ అందిస్తున్నారు. మ‌న దేశంలో అతి ఖ‌రీదైన ఎంబీఏ సంస్థ‌ల్లో ఇదీ ఒక‌టి.

7. ఫ్యాక‌ల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్‌, ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం

7. ఫ్యాక‌ల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్‌, ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం

ఎఫ్ఎమ్ఎస్ ఢిల్లీ విశ్వవిద్యాల‌య ప‌రిధి కిందికి వ‌స్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన క‌ళాశాలల్లో ఒక‌టి. ఇత‌ర మేనేజ్‌మెంట్ విద్యాసంస్థ‌ల‌తో పోలిస్తే దీంట్లో నామ‌మాత్ర‌పు ఫీజును వ‌సూలుచేస్తారు. మంచి ఫ్యాక‌ల్టీ దీని సొంతం. ఆధునిక మేనేజ్‌మెంట్‌, బిజినెస్ స్ట‌డీకి అనుగుణంగా క‌రిక్యుల‌మ్‌ను రూపొందించ‌డం జ‌రిగింది.

8. ఐఐఎం, ఇండోర్‌

8. ఐఐఎం, ఇండోర్‌

ఐఐఎంల జాబితాలో ఇండోర్ క‌ళాశాల ఇటీవ‌లె చోటు సంపాదించింది. ఉత్త‌మ ఎంబీఏ క‌ళాశాల‌ల జాబితాలో 8వ స్థానానికి ఎగ‌బాకింది. రెండు కోర్సుల‌ను ఈ సంస్థ అందిస్తుంది. 2ఏళ్ల పీజీ డిప్లొమా కోర్సు ఒక‌టి కాగా, 5ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు మ‌రొక‌టి. దీంట్లో 3ఏళ్ల‌పాటు బీబీఏ చ‌దివాక‌, 2ఏళ్ల‌పాటు ఎంబీఏ చ‌ద‌వ‌నిస్తారు. మూడేళ్ల త‌ర్వాత వేరే ద‌గ్గ‌ర ఎంబీఏ చేసుకునే అవ‌కాశం సైతం క‌ల్పిస్తున్నారు. ఇది కాకుండా కాలేజీలో ఎన్నో స‌దుపాయాలున్నాయి.

9. ఐఐఎం, కోజికోడ్

9. ఐఐఎం, కోజికోడ్

1996లో దీన్ని స్థాపించారు. ఫుల్‌టైం 2ఏళ్ల డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఇత‌ర స్వ‌ల్ప‌కాల కోర్సుల‌ను అందిస్తుంది. ప్లేస్‌మెంట్ రికార్డు బాగుంది. స‌రాస‌రిని 94శాతం మందికి మంచి సంస్థ‌ల్లో ప్లేస్‌మెంట్‌లు దొరుకుతాయి. సుంద‌ర‌మైన ప్ర‌దేశంలో కొండ‌ల న‌డుమ క్యాంప‌స్ ఉంటుంది.

10. జ‌మ్నాలాల్ బ‌జాజ్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్‌(జేబీఐఎమ్ఎస్‌)

10. జ‌మ్నాలాల్ బ‌జాజ్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్‌(జేబీఐఎమ్ఎస్‌)

టాప్ 10 ఎంబీఏ క‌ళాశాల‌ల జాబితాలో దీనికి స్థానం ఉంది. ప్ర‌తి స్పెష‌లైజేష‌న్‌లోనూ మంచి బోధ‌నా సిబ్బంది కొలువుదీరి ఉన్నారు. విద్యార్థుల‌కు చ‌క్క‌ని జ్ఞానాన్ని ప్ర‌సాదిస్తున్నారు. మంచి ప్లేస్‌మెంట్లు కూడా అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ అయిన చందా కొచ్చ‌ర్ ఒక‌ప్పుడు ఇక్క‌డి విద్యార్థిని కావ‌డం విశేషం.

మా క‌థ‌నం మీకు బాగా ఉప‌యోగప‌డింద‌ని భావిస్తున్నాం. మ‌రిన్ని ఆర్థిక‌ప‌ర అప్‌డేట్ల కోసం స‌బ్‌స్కైబ్ అవ్వండి. త‌ర్వాతి క‌థ‌నం మీ మెయిల్‌కు వెంట‌నే పంపిస్తాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+