వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ
బేస్ రేటును 8.65 శాతానికి తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం రోజు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) ఆధారిత రేటుపై రుణాలు తీసుకున్న బ్యాంకు వినియోగ
బేస్ రేట్ల తగ్గింపుతో ఎస్బీఐ వడ్డీ రేట్లు మారాయ్
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ సోమవారం వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని రకాల రుణాలకు సంబంధించి బేస్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. బేస్ రేటును 8.65 శాతానికి తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం రోజు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) ఆధారిత రేటుపై రుణాలు తీసుకున్న బ్యాంకు వినియోగదారులకు ఈ వడ్డీ రేట్లు వర్తించవు. ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించిన చాలా మంది ఖాతాదారులకు ఇది శుభవార్త. ఎస్‌బీఐ టర్మ్ లోన్లలో ముఖ్యంగా విద్యార్థులు, గృహ రుణ గ్రహీతలు తీసుకునే రుణాలన్నీ ఎంసీఎల్‌ఆర్ ఆధారంగా కాకుండా బేస్ రేటు ఆధారంగా ఉంటాయి. ఈ మేరకు రుణాలపై ఈఎంఐ తగ్గుతుంది. ప్రతి బ్యాంకు వివిధ కాలపరిమితికి సంబంధించి వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఎస్‌బీఐ సంబంధించి ఓవర్ నైట్ రుణాలకు 7.70%, అదే మూడేళ్ల కాలపరిమితి రుణాల విషయంలోనైతే 8.10% వడ్డీ రేట్లు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి.

2016 ఏప్రిల్ నుంచి పలు బ్యాంకులు... వాటి రుణ వితరణ కోసం ఎంసీఎల్ఆర్ వ్యవస్థలోకి మారినప్పటికీ, చాల వరకూ రుణాలు.. ముఖ్యంగా రిటైల్ రుణలు గత బేస్ రేటు పద్ధతి పైనే అనుసంధానం అయి ఉన్నాయి. ఈ వినియోగదారులకు తాజా తగ్గింపు ఆఫర్‌తో మిగిలిన చాలా ప్రభుత్వ రంగ,ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకి గృహ రుణాలు లభించినట్లు అవుతుంది. ఆర్బీఐ ప్రతిసారి పాలసీ సమీక్షలో భాగంగా అవసరాన్ని బట్టి రెపో రేటును మారుస్తూ ఉంటుంది. ఆ విధంగా 2014 డిసెంబరు నుంచి అక్టోబర్ 2016 మధ్య 1.75% పాయింట్ల మేర వడ్డీ రేట్లను మార్చింది. అయితే బ్యాంకులు మాత్రం తమ బేస్ రేట్లను కేవలం 0.61% మేర తగ్గించి ఈ మేరకు మాత్రమే ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ అయ్యేలా చేశాయి.


Click it and Unblock the Notifications