డిసెంబరులో బాగా పెరిగిన మారుతి విక్రయాలు
దేశంలో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి డిసెంబరు నెలలో ఆశాజనక ఫలితాలను రాబట్టగలిగింది. అంతకు ముందు నెలతో పోలిస్తే 10.3% వృద్ది సాధించి 2017 డిసెంబరు నెలలో 1,30,066 యూనిట్లను విక్రయ
దేశంలో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి డిసెంబరు నెలలో ఆశాజనక ఫలితాలను రాబట్టగలిగింది. అంతకు ముందు నెలతో పోలిస్తే 10.3% వృద్ది సాధించి 2017 డిసెంబరు నెలలో 1,30,066 యూనిట్లను విక్రయించింది. అదే 2016 డిసెంబరు నెలలో మారుతి కంపెనీ అమ్మకాలు 1,17,908గా ఉన్నాయి.
దేశీయ అమ్మకాల పరంగా 12% వృద్దితో 1,19,286 యూనిట్ల విక్రయాలను మారుతి జరపగలిగింది. ఆల్టో, వేగాన్ ఆర్ లాంటి మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు 2 శాతం పెరిగి 31,146 యూనిట్లుగా ఉన్నాయి. ఇక కాంపాక్ట్ విభాగంలో స్విప్ట్, ఎస్టిలో, డిజైర్, బాలెనో కార్లు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. గత నవంబరు నెలలో ఇలాంటి కార్లన్నీ కలిపి 53,336 అమ్ముడయ్యాయి.

మధ్య శ్రేణి వాహనమైన మారుతి సియాజ్ విక్రయాలు డిసెంబరు నెలలో 35.8 వృద్దితో 2382 యూనిట్ల స్థాయిని చేరాయి. ఇక ఎగుమతులు మాత్రం 2016తో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. 2016 డిసెంబరులో 11,494 యూనిట్లను ఎగుమతి చేయగా... 2017 డిసెంబరులో ఆ సంఖ్య 6.2% తగ్గుదలతో 10,780 యూనిట్లుగా నమోదయింది.
దక్షిణ ఆసియాలోనే కార్లను రూపొందించే సంస్థలలో మారుతి సుజుకి అతి పెద్దది. జపాన్ దేశానికి చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ ఈ సంస్థలో అత్యధిక వాటా కలిగి ఉంది. ఒక 10 లక్షల కార్లను సైతం ఇప్పటిదాకా ఈ సంస్థలు కలిసి రూపొందించాయి. 17 సెప్టెంబరు 2007న ముతి ఉద్యోగ్ లిమిటెడ్ అనే దాన్ని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌గా మార్చారు.


Click it and Unblock the Notifications