దేశ రైల్వే ముఖ చిత్రం మారుతోంది. 2022 కల్లా అన్ని బ్రాడ్ గేజ్ ట్రాక్‌లను విద్యుదీకరణ చేయడంతో పాటు అన్ని స్టేషన్లలో ఎల్ఈడీ ఆధారిత బల్బులను పెట్టాలని సంకల్పించారు. విద్యుత్‌ను ఆదా చేసి, పర
దేశ రైల్వే ముఖ చిత్రం మారుతోంది. 2022 కల్లా అన్ని బ్రాడ్ గేజ్ ట్రాక్‌లను విద్యుదీకరణ చేయడంతో పాటు అన్ని స్టేషన్లలో ఎల్ఈడీ ఆధారిత బల్బులను పెట్టాలని సంకల్పించారు. విద్యుత్‌ను ఆదా చేసి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే కాంతివంతమైన ఎల్‌ఈడీ వెలుగులు దేశవ్యాప్తంగా ప్రతి రైల్వేస్టేషన్‌లో నింపాలని కేంద్రం నిర్ణయించింది. ఐదేళ్లలో 30 వేలకు పైగా కి.మీ ట్రాక్‌ల విద్యుదీకరణ, 16 రైల్వే జోన్ల సమూల మార్పుకు సంబంధించి కేంద్ర రైల్వే నిశ్చయించుకున్న కొన్ని లక్ష్యాలు, వాటి ప్రణాళికల గురించి కింద వివరంగా తెలుసుకుందాం.

మెట్రో నగరాలతో మొదలు
బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే వీటిని రానున్న మూడు మాసాల్లో అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగా తొలుత ప్రముఖ పట్టణాల్లో ఉండే రైల్వేస్టేషన్లు, ఆ తరువాత క్యాటిగిరీలోకి వచ్చే మరికొన్ని రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయదలించింది. దేశంలో ముంబై, చెన్నై, బెంగళూరు, హౌరా, గౌహతి, హైదరాబాద్ వంటి ముఖ్యమైన నగరాలకు చెందిన రైల్వే స్టేషన్లలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తారు.

రెండు, మూడు దశల్లో
తరువాత విశాఖపట్నం, భువనేశ్వర్, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ రైల్వేస్టేషన్లలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధంగా మూడవ దశలో అన్ని రైల్వేస్టేషన్లను ఎల్‌ఈడీ వెలుగులతో నింపాలని కేంద్రం సంకల్పించింది.

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఇలా
దేశవ్యాప్తంగా 16 రైల్వేజోన్లు, వీటి పరిధిలో 48 డివిజన్లు ఉండగా, మొత్తంమీద 7500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ విధంగా ఒక్కో రైల్వేస్టేషన్‌లో ఎన్ని ఎల్‌ఈడీ దీపాలు అమర్చాల్సి ఉంటుంది? వీటికి ఎన్నాళ్ళపాటు గ్యారంటీ ఇస్తారు? ఏయే కార్పొరేట్ సంస్థలు వీటి ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి? దీనికి డివిజన్ల వారీగా ఎంత మంది అధికారులు, సిబ్బందిని నియమించాలి.? అనే పలు అంశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత రైల్వేస్టేషన్లలో ఎల్‌ఈడీ దీపాలు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే వీటిని వేగవంతం చేయాలని, రానున్న మూడు నెలల్లో పూర్తిస్థాయిలో స్టేషన్లకు ఎల్ఈడీ వెలుగులు అందివ్వాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది.

లక్షల కొద్దీ ఉన్న లైట్లు మార్చాలి
దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ ఎల్ఈడీ దీపాలు అమర్చాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్నవాటిని తొలగించే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఒక్కో రైల్వేస్టేషన్‌లో కనీసం వంద దీపాలకు తక్కువ లేకుండా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని లెక్కలు కట్టి మరీ ఆయా డివిజన్ల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్ళినట్టు తెలిసింది.

ప్రతి ప్లాట్ ఫారంపైన ఎల్ఈడీ వెలుగులు
విశాఖపట్నం వంటి ఎనిమిది ప్లాట్‌ఫారాలు కలిగి పెద్ద రైల్వేస్టేషన్‌గా పేరున్న ఇక్కడ రైల్వే పోలీసు వ్యవస్థతోపాటు కమర్షియల్, ఆపరేటింగ్, రన్నింగ్ తదితర విభాగాలు నడుస్తున్నాయి. ప్రతి ప్లాట్‌ఫారం మీద, ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు పైన ఎల్‌ఈడీ దీపాలను అమర్చాల్సి ఉంటుంది. అలాగే ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరిధిలోకి వచ్చే వాల్తేరు, ఖుర్దా, సంబల్‌పూర్ డివిజన్లకు సంబంధించి నాలుగైదు పెద్ద రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ విధంగా జోన్లు, డివిజన్ల వారీగా ఉండే రైల్వేస్టేషన్లను క్యాటగిరీల వారీగా నిర్దేశించి తొలుత పెద్దపెద్ద రైల్వేస్టేషన్లకు ఎల్‌ఈడీ దీపాలను అమర్చాలని కేంద్రం సంకల్పించింది.

జోన్లు, డివిజన్లకు ఆదేశాలు
రైల్వే బృహత్తర ఎల్ఈడీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఆయా జోన్లు, డివిజన్లకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. కాగా రైల్వేస్టేషన్లకు ఎల్‌ఈడీ దీపాలు అమర్చే కార్యక్రమం విజయవంతమైతే దీని తరువాత రైల్వే పార్కింగ్, రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వేయార్డులు, రైల్వే కార్యాలయాల్లోను వీటిని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది.
More From GoodReturns

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్థ గంట ముందు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications