వారాంతంలో మంచి లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
సానుకూల ఆసియా మార్కెట్ల,కొనుగోళ్ల జోరు వేళ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 209 పాయింట్లు ఎగసిపడి 34,056.83 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 52.8
జనవరి నెలకు సంబంధించి డెరివేటివ్ కాంట్రాక్టుల ప్రారంభ వేళ మార్కెట్లు పైపైకి వెళ్లాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల మేర గెయిన్ అయింది. సానుకూల ఆసియా మార్కెట్ల,కొనుగోళ్ల జోరు వేళ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 209 పాయింట్లు ఎగసిపడి 34,056.83 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 52.80 పాయింట్లు పుంజుకుని 10,530.70 వద్ద స్థిరపడింది.
చమురు,సహజ వాయు రంగం, లోహ రంగం, ఇంధన రంగం తప్ప దాదాపు మిగిలిన అన్ని రంగాలు బాగా రాణించాయి. టెలికాం, ఐటీ, ఫార్మా రంగాలు బాగా లాభపడ్డాయి. ఇంకా పవర్, వాహన, టెక్నాలజీ, మూలధన వస్తువులు, హెల్త్ కేర్ రంగాలు సైతం లాభాల్లో కొనసాగాయి. వారం వారీగా చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో వారం. మొత్తం వారం మీద సెన్సెక్స్ 116.53(0.34%) పాయింట్లు లాభపడగ మరో సూచీ నిఫ్టీ సైతం 37.7(0.35%)పాయింట్లు పుంజుకుంది.

ఈ రోజు ట్రేడింగ్‌లో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు రూ.562 కోట్లకు పైగా విలువైన స్టాక్‌లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్(డీఐఐ)లు రూ.744 కోట్లు వెనక్కు తీసుకున్నారు.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ,నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. టాటా మోటార్స్(3.06%), టాటా మోటార్స్(డీ) (2.99%), యాక్సిస్ బ్యాంకు(2.74%), టీసీఎస్(2.72%), హీరో మోటోకార్ప్(2.38%) లాభపడిన వాటిలో ఉండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో గెయిల్(2.26%), బీపీసీఎల్(1.62%), హెచ్పీసీఎల్(0.96%), వేదాంత(0.84%), జీ ఎంటర్ టైన్ మెంట్(0.69%) ముందున్నాయి.


Click it and Unblock the Notifications