నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
మొత్తానికి మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్లు దిగజారి 33,848 వద్ద స్థిరపడగా మరో సూచీ నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 10,477 వద్ద ముగిసింది.
డిసెంబర్ నెలకు సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభ ట్రేడింగ్లో సూచీలు లాభాలను గడించినా కొద్ది సేపటికే ప్రతికూలంగా సాగడం మొదలుపెట్టాయి. చివరికి ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్లు దిగజారి 33,848 వద్ద స్థిరపడగా మరో సూచీ నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 10,477 వద్ద ముగిసింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(2.97%), లోహ రంగం(2.04%), ఐటీ రంగం(0.11%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.04%) లాభపడ్డాయి. మరో వైపు పీఎస్‌యూ(0.77%), చమురు,సహజ వాయు(0.46%), ఆటో లేదా వాహన రంగం(0.35%), బ్యాంకింగ్(0.27%) నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ,నష్టపోయిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
టాటా స్టీల్(1.78%), డాక్టర్ రెడ్డీస్(1.3%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (+ 0.82%), విప్రో (+ 0.72%), ఐసిఐసిఐ బ్యాంక్ (+ 0.51%) లాభపడగా,మరో వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.86 శాతం), హీరో మోటోకార్ప్ (-1.74 శాతం), సన్ ఫార్మా (-1.70 శాతం), అదానీ పోర్ట్స్ (-1.35 శాతం), యాక్సిస్ బ్యాంక్ (-1.29 శాతం)ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications