For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ‌త ఏడాది కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్లలోకి నిధుల వ‌ర‌ద‌

2016 చివరి నాటికి ఫండ్ నిర్వ‌హ‌ణ ఆస్తులు రూ.16.46 ల‌క్ష‌ల కోట్లు కాగా, ఈ ఏడాది న‌వంబ‌రు చివ‌రి నాటికే ఈ విలువ రూ.23 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. అంటే దాదాపు ఏడాది కాల వ్య‌వ‌ధిలో రూ.6 ల‌క్ష‌ల కోట్లు అన్

|

వివిధ మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీల్లోకి వ‌చ్చే నిధుల ప్ర‌వాహం గ‌త ఏడాది కాలంలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగింది. 2016 చివరి నాటికి ఫండ్ నిర్వ‌హ‌ణ ఆస్తులు రూ.16.46 ల‌క్ష‌ల కోట్లు కాగా, ఈ ఏడాది న‌వంబ‌రు చివ‌రి నాటికే ఈ విలువ రూ.23 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. అంటే దాదాపు ఏడాది కాల వ్య‌వ‌ధిలో వ‌చ్చి పడిన సొమ్ము రూ.6 ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌.

ఈ మ‌ధ్య కాలంలో సిప్ మార్గంలో పెట్టుబ‌డుల‌కు గ‌ణ‌నీయ‌మైన ఆద‌ర‌ణ ఏర్ప‌డ‌టం మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ ఆస్తులు పెరిగేందుకు ఒక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. మొత్తానికి ఈ సంవ‌త్స‌ర కాలంలో ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత ప‌థ‌కాల్లోకి వ‌చ్చిన పెట్టుబ‌డుల విలువ రూ.1.4 ల‌క్ష‌ల కోట్లు. ఒక నెల‌లో దాదాపుగా 9 ల‌క్ష‌ల సిప్ ఖాతాలు పెరిగాయి. ఒక్కో ఖాతాలో స‌గ‌టున ఒక్కో నెల‌కు రూ.5893 వ‌చ్చి చేరాయి. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లోకి వ‌చ్చిన మొత్తం డ‌బ్బు విలువ 5.3 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది.

మ్యూచువ‌ల్ ఫండ్

ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌లో మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌న్నీ క‌లిపి పెట్టుబ‌డి పెట్టిన సొమ్ము విలువ రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు. ఏడాది కాలంలో ఇన్వెస్ట‌ర్ల సంఖ్య భారీగా పెర‌గ్గా మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ ఇన్వెస్ట‌ర్ల సంఖ్య 1.7 కోట్ల మేర పెరిగి ఉంటుంద‌ని అంచ‌నా. దీంతో రిటైల్ ఇన్వెస్ట‌ర్ల ఖాతాల సంఖ్య 6.5 కోట్లు అయింది.
ఫండ్ హౌస్‌ల‌కు సిప్ ద్వారా రూ.53వేల కోట్లు వ‌చ్చి చేరాయి. 9ల‌క్ష‌ల సిప్ ఖాతాలు కొత్త‌గా వ‌చ్చాయి. అంత‌కు ముందు ఏడాది కాలంలో సిప్ రూపేణా వ‌చ్చిన పెట్టుబ‌డి విలువ రూ.3973 కోట్లుగా ఉండ‌గా అదే ఈ ఏడాది అది రూ.5893 కోట్లుగా ఉంది. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్ల‌ను నిర్వ‌హిస్తున్న కంపెనీల వ‌ద్ద ఉన్న మొత్తం డ‌బ్బు విలువ 40% పెరిగింద‌ని తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్ నిర్వ‌హ‌ణ ఆస్తుల విలువ ఇలా పెరుగుకుంటూ వెళ్ల‌డం వ‌రుస‌గా ఐదో ఏడాది.

Read more about: mutual funds investments
English summary

గ‌త ఏడాది కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్లలోకి నిధుల వ‌ర‌ద‌ | mutual fund asset base increased by 6 lakh crore in a year

The industry's AUM had crossed the milestone of Rs 10 lakh crore for the first time in May 2014 and in a short span of about three-and-a-half years, the asset base shot up more than two-fold to Rs 23 lakh crore in November-end.
Story first published: Wednesday, December 27, 2017, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X