For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్థిరాస్తి, చమురు,స‌హ‌జ వాయు రంగ షేర్లు న‌ష్టాల్లో

తొలుత సెన్సెక్స్‌ 125 పాయింట్ల వరకూ ఎగసి తొలిసారి 34,100ను అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 60 పాయింట్లు జంప్‌చేసి 10,550ను దాటేసింది. అయితే చివరి గంటలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకో

|

వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను అందుకున్నాయి. తొలుత సెన్సెక్స్‌ 125 పాయింట్ల వరకూ ఎగసి తొలిసారి 34,100ను అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 60 పాయింట్లు జంప్‌చేసి 10,550ను దాటేసింది. అయితే చివరి గంటలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా సాంకేతికంగా కీలకమైన స్థాయిల దిగువన ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 99 పాయింట్లు క్షీణించి 33,912 వద్ద నిలిచింది. తద్వారా 34,000 పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 41 పాయింట్లు నష్టపోయి 10,491 వద్ద ముగిసింది. వెరసి 10,500 దిగువన స్థిరపడింది.

న‌ష్టాల్లో మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఆరోగ్య రంగం త‌ప్ప అన్నీ న‌ష్టాల బాట ప‌ట్టాయి. వాటిల్లో స్థిరాస్తి(0.98%), చ‌మురు,స‌హజ వాయు(0.83%), పీఎస్‌యూ(0.82%), క్యాపిట‌ల్ గూడ్స్‌(0.78%) న‌ష్ట‌పోయాయి. మ‌రో వైపు హెల్త్ కేర్ మాత్రం 1.67% లాభ‌ప‌డింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డ్డ‌, న‌ష్ట‌పోయిన వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. లాభ‌ప‌డిన వాటిలో సన్ ఫార్మా (+ 6.89%), డాక్టర్ రెడ్డీస్ (+ 1.71%), ఎం అండ్ ఎం (+ 0.77%), విప్రో (+ 0.69%), హెచ్ యూఎల్ (+ 0.19%) ముందుండ‌గా , మ‌రో వైపు భారతీ ఎయిర్టెల్ (-1.62 శాతం), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.53 శాతం), ఎల్ అండ్ టి (-0.87 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.85 శాతం), బజాజ్ ఆటో (-0.82 శాతం) న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.

English summary

స్థిరాస్తి, చమురు,స‌హ‌జ వాయు రంగ షేర్లు న‌ష్టాల్లో | markets down due to losses in realty, oil and gas sector

Top five Sensex gainers were Sun Pharma (+6.89%), Dr Reddy's (+1.71%), M&M (+0.77%), Wipro (+0.69%) and HUL (+0.19%), while the major losers were Bharti Airtel (-1.62%), ICICI Bank (-1.53%), L&T (-0.87%), State Bank of India (-0.85%) and Bajaj Auto (-0.82%).
Story first published: Wednesday, December 27, 2017, 17:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X