ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రి
ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) శతాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో ఈ సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభి
ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) శతాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో ఈ సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవ వేడుకలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్, ఐఈఏ అధ్యక్షుడు సుఖదేవ్‌సింగ్ థోరట్, పాల్గొన్నారు. సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ఆర్థికవేత్తలు హాజరయ్యారు. సదస్సులో నోబెల్ గ్రహీత, బంగ్లాదేశ్ ఆర్థికవేత్త మహ్మద్ యూనిస్‌తో పాటు 16 దేశాలకు చెందిన 60 మంది ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. సదస్సు నాలుగు రోజుల పాటు జరగనుంది. సదస్సులో పలు అంశాలపై చర్చించనున్నారు.

ఆర్థిక శాస్త్రంలో ఎదురయ్యే ఇబ్బందులను చర్చించేందుకు, తగిన విధానాలను రూపొందించేందుకు 1917లో ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) ఏర్పడింది. ఇందులో ఇప్పటికి 5000కు పైగా సభ్యులు ఉన్నారు. ఐఈఏ ప్రస్తుతం 100వ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గతేడాది దాకా 99 వార్షిక సమావేశాలు నిర్వహించింది. అంతర్జాతీయ ఆర్థిక సంఘంలో సైతం ఐఈఏ భాగస్వామి. 1986లో అంతర్జాతీయ ఆర్థిక సంఘం సాయంతో న్యూఢిల్లీలో ప్రపంచ ఆర్థిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ కెన్నెత్ జె.ఆరో నేతృత్వం వహించారు.
అభివృద్ది చెందిన దేశాల్లో ఎక్కువ చర్చల ద్వారానే ఉత్తమ ఫలితాలు వస్తుంటాయి. యూరప్ ఖండంలోని చాలా దేశాల్లో వివిధ ఉద్దేశాల కోసం సంఘాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే భారత్‌లో సైతం బ్రిటీష్ పాలన తర్వాత చాలా వాటిల్లో సంఘాలు ఏర్పడటం మొదలైంది. అయితే ఏర్పడిన ఉద్దేశానికి అనుగుణంగా పాటు పడుతున్న సంఘాలను వేళ్ల మీద లెక్కగట్టొచ్చు. ఏది ఏమైనా ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ నాలుగు రోజుల సమావేశాల సందర్భంగా ఒక మంచి ఫలితాన్ని, భవిష్యత్ ఆర్థిక వాతావారణాన్ని మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications