రికార్డు స్థాయి 34,000 మార్కును తాకి వెనక్కు మళ్లిన సెన్సెక్స్
క్రిస్మస్ ఉత్సాహంతో దేశీయ మార్కెట్లకు ఆరంభ ట్రేడింగ్లో ఊపు వచ్చింది. ఒక దశలో ట్రేడింగ్ ప్రారంభంలోనే 34,000 మైలు రాయిని చేరుకుంది. అంతే కాకుండా నిఫ్టీ కూడా తొలిసారి 10,500 పాయింట్ల సెంటిమెంటు స్
క్రిస్మస్ ఉత్సాహంతో దేశీయ మార్కెట్లకు ఆరంభ ట్రేడింగ్లో ఊపు వచ్చింది. ఒక దశలో ట్రేడింగ్ ప్రారంభంలోనే 34,000 మైలు రాయిని చేరుకుంది. అంతే కాకుండా నిఫ్టీ కూడా తొలిసారి 10,500 పాయింట్ల సెంటిమెంటు స్థాయి వరకూ వెళ్లింది. ఇవి మొత్తం దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డులని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తర్వాత ఆ స్థాయిల వద్ద మార్కెట్ సూచీలు నిలబడలేకపోయాయి.

ప్రస్తుతం 12.29 గం.ల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 20.74 పాయింట్లు దిగజారి 33,919.56 వద్ద కొనసాగుతుండగా, మరో సూచీ నిఫ్టీ 4 పాయింట్లు క్షీణించి 10,489 వద్ద కదలాడుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాప్ గెయినర్లుగా ఆర్‌కామ్, జేపీ అసోసియేట్స్, కమ్మిన్ ఇండస్ట్రీస్, జస్ట్ డయల్, జెట్ ఎయిర్వేస్ ముందున్నాయి. మరో వైపు నష్టపోయిన వాటిలో అదానీట్రాన్స్, రెలిగేర్, సిండిబ్యాంక్, కేఈసీ, ఏఐఏఇంజినీరింగ్ లిమిటెడ్ వంటివి ఉన్నాయి.
మన దేశంలో రెండు ప్రధాన సూచీల ఆధారంగా షేర్లను కొనడం, అమ్మడం జరుగుతూ ఉంటుంది. బీఎస్ఈ సెన్సెక్స్ అనేది దేశంలోనే అతి పురాతన ఎక్స్చేంజీ. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంటుంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తర్వాత మరో ముఖ్యమైన సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ.


Click it and Unblock the Notifications