For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌భుత్వ బ్యాంకుల‌ను మూసేసే ప్ర‌సక్తే లేదు

బ్యాంకుల‌ను గాడిలో పెట్టే క్ర‌మంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను మూసివేసే ప్ర‌స‌క్తి లేద‌ని ఆర్బీఐ శుక్ర‌వారం స్ప‌ష్టం చేసింది. మీడియాలో కొన్ని బ్యాంకుల‌ను మూసివేస్తార‌ని కథ‌నాలు రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ర

|

బ్యాంకుల‌ను గాడిలో పెట్టే క్ర‌మంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను మూసివేసే ప్ర‌స‌క్తి లేద‌ని ఆర్బీఐ శుక్ర‌వారం స్ప‌ష్టం చేసింది. మీడియాలో కొన్ని బ్యాంకుల‌ను మూసివేస్తార‌ని కథ‌నాలు రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆ మేర‌కు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇంకా స‌త్వ‌ర దిద్దుబాటు చ‌ర్య‌(పీసీఏ)ల్లో భాగంగా కొన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు మూత ప‌డ‌తాయిన వాట్స‌ప్, ఫేస్‌బుక్ల్లో అస‌త్య ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌టంతో ఆర్బీఐ, కేంద్ర ప్ర‌భుత్వం త‌గు స‌మ‌యంలో రంగంలోనికి దిగాయి.
మొండి బ‌కాయిల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న బ్యాంక్ ఆఫ్ బ‌రోడ స‌హా 9 బ్యాంకుల కార్య‌క‌లాపాల‌పై ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు స‌త్వ‌ర దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు కేంద్ర బ్యాంకు న‌డుం క‌ట్టిన నేప‌థ్యంలో కొన్ని బ్యాంకుల‌ను మూసివేస్తారనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను మ‌రింత‌గా బ‌ల‌ప‌ర‌చ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని కేంద్రం, ఆర్‌బీఐ స్ప‌ష్ట‌త నిచ్చాయి.

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను మూయం

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను మ‌రింత బ‌లోపేతం చేసే ప్ర‌ణాళిక‌లో ఉన్నామ‌ని కేంద్రం తెలిపింది. రూ. 2.11 ల‌క్ష‌ల కోట్ల మూల‌ధ‌న ప్ర‌ణాళిక‌ల‌తో బ్యాంకుల‌ను పున‌రుజ్జీవింప చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్లు ఆర్థిక సేవ‌ల కార్య‌ద‌ర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల కోసం సంస్క‌ర‌ణ‌ల మార్గ సూచీని రూపొందించిన‌ట్లు వివ‌రించారు.
అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా విష‌యంలో స‌త్వ‌ర దిద్దుబాటు చ‌ర్య‌లు(పీసీఏ) తీసుకోవాల‌ని ఆర్బీఐ నిర్ణ‌యించింది. ఈ పీసీఏ ఫ్రేమ్ వ‌ర్క్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన బ్యాంకుల కార్య‌క‌లాపాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన‌ది కాద‌ని ఆర్‌బీఐ విస్ప‌ష్ట‌ప‌రిచింది.

Read more about: rbi banks banking
English summary

ప్ర‌భుత్వ బ్యాంకుల‌ను మూసేసే ప్ర‌సక్తే లేదు | No question of closing down any public sector bank: Govt, RBI

Placing banks under the Prompt Corrective Action (PCA) framework will not affect their normal operations, said the RBI on Friday.The Reserve Bank of India statement comes in the wake of media reports about the closure of some public sector banks, post their being placed under the PCA framework.
Story first published: Saturday, December 23, 2017, 14:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X