జనవరి నుంచి మోటార్ సైకిల్ ధరలు పెంచుతున్న హీరో మోటోకార్ప్
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది నుంచి పలు మోటారు సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ బట్టి రూ.400 మేర టూవీలర్ ధరలను పెంచుతున్నట్లు, ఇది 2018 జ
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది నుంచి పలు మోటారు సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ బట్టి రూ.400 మేర టూవీలర్ ధరలను పెంచుతున్నట్లు, ఇది 2018 జనవరి నుంచి అమల్లో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ వారంలో హీరో మోటో కార్ప్ మూడు కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఒకప్పుడు యువకులు స్ప్లెండర్ అంటే బాగా ఇష్టపడేవారు. తర్వాత అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తయారయింది. అయితే ఎన్ని పోటీ బైక్‌లు వచ్చినప్పటికీ అందులో చిన్న చిన్న మార్పులు చేస్తూ వివిధ వర్గాల్లో ఆసక్తి తగ్గకుండా స్ప్లెండర్ విషయంలో హీరో సంస్థ జాగ్రత్తలు పడుతూ వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు సరికొత్తగా స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్రో, సూపర్ స్ప్లెండర్ వంటి వాటిని తీసుకొచ్చింది. ఇప్పుడు సూపర్ స్ప్లెండర్ సహా ప్యాషన్ ప్రోకు కొన్ని మార్పులు చేసి మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 2018 కొత్త ఏడాదిని దృష్టిలో పెట్టుకుని బైక్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే నూతన సంవత్సరంలో ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

హీరో మోటోకార్ప్, హీరో హోండాగా స్థాపించబడిన దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. ఇది భారతదేశంలోనే టూవీలర్ల తయారీలో మొదటి స్థానంలో ఉంది. 1984లో హీరో సైకిల్స్ సంస్థకు చెందిన ఓం ప్రకాష్ మంజల్ జపాన్‌కు చెందిన హోండా కంపెనీతో కలిసి హీరో హోండాను స్థాపించారు.


Click it and Unblock the Notifications