అరకు కాఫీ... అమెరికాలో కూడా
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతానికి చెందిన కాఫీ అమెరికా దేశానికి పరిచయం కాబోతోంది. బెంగుళూరు స్టార్టప్ క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా సంస్థ అరకు అరోమా కాఫీని అమెరికాలో ప్రవేశపెట్టేందుకు ప్రణా
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతానికి చెందిన కాఫీ అమెరికా దేశానికి పరిచయం కాబోతోంది. బెంగుళూరు స్టార్టప్ క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా సంస్థ అరకు అరోమా కాఫీని అమెరికాలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. "న్యూజెర్సీ ప్రాంతంలోని ఎడిసన్ లో అరకు అరోమా కాఫీని ప్రవేశపెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పండిన కాఫీ పంటకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో, వారి సరకును సరసమైన ధరకు అమ్మేందుకు మేము సాయం చేస్తున్నాం. అరకు అనేది విశాఖపట్నం సమీపంలోని గిరిజన ప్రాంతం" అని క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా సంస్థ ఎండీ క్రిష్ణ చైతన్య చెప్పారు.
ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ సమయంలో జనవరి నెలలో దేశీయంగా సైతం ఈ కాఫీకి ప్రాచుర్యం కల్పించేందుకు కంపెనీ యోచిస్తోంది. ఒప్పందం ప్రకారం 250 ఎకరాల్లో గిరిజన రైతులు పండించిన పంటను మేము కొంటామని, కంపెనీ వార్షికంగా 500 టన్నుల వరకూ మార్కెటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నదని క్రిష్ణ చైతన్య చెప్పారు. ఇందు కోసం సంస్థ రూ.2.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టిందని తెలిపారు.

ప్రతి ఒక్కరికీ చిన్నప్పుడు తిన్న ఆహారం గురించి కొద్దిగా ఆసక్తి ఉంటూనే ఉంటుంది. ఎక్కువగా ఇంట్లో తయారుచేసిన అన్నం,రొట్టె తినడం మధురానుభూతే. అదే విధంగా మీ రుచి గుళికలను ఎప్పుడు తడి ఆరనివ్వకుండా చేసే ఉద్దేశంతో స్థానిక రుచులను ప్రోత్సహించే విధంగా స్థాపించిన సంస్థే క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా, ఇది బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తోంది. అది వెజ్ అయినా లేదా నాన్ వెజ్ అయినా, దక్షిణ భారతీయ వంటకం అయినా మీ తట్టలో ఆహారాన్ని రుచికరంగా ఉండేలా చేయడమే ఈ సంస్థ ఉద్దేశం.


Click it and Unblock the Notifications