సెబి(ఎస్ఇబిఐ)ప్రకారం, భారత దేశ పౌరుల్లో ఇన్వెస్ట్ మెంట్ నాలెడ్జ్(పెట్టు పడి పరిజ్ఝానం) లేకపోవడం వల్ల పాపులర్ మోడల్స్ ఇష్టపడే ఈక్వెటి క్రౌడ్ ఫండింగ్ మరియు ఇన్వెస్ట్ మెంట్ క్రౌడ్ ఫండింగ్ లు మన ఇండియాలో
క్రౌండ్ ఫండింగ్ (సమూహ నిధులు) అంటే నిధులను కొంత మంది లేదా సంస్థల దగ్గర నుండి సేకరించి, తిరిగి వాటిని ప్రజలకు అందేలా చేసి, తిరిగి ఆ రుణాలను లాభోపేతంగా పెట్టుబడి దారులకు అందించడాన్నే ఫండ్ రైజర్స్ అంటారు. అయితే ఇలా సంస్థలుగా ఏర్పడిన తర్వాత మెయింటెన్స్ కోసం మంటి కొంత చార్జ్ చేస్తుంటారు.
క్రౌడ్ ఫండింగ్ (సమూహ నిధిలకు)ఇండియా మంచి ఫ్లాట్ ఫార్మ్ వంటిది, అయితే యుఎస్ లో లాగ జనాదరణ పొందనప్పటికీ, నెమ్మదిగా క్యాచ్ చేస్తున్నారు. ఫండ్ రైజింగ్ సంస్థలే పెద్ద పాత్ర పోషిస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ వివిధ రకాలుగా ఉన్నాయి.
సెబి(ఎస్ఇబిఐ)ప్రకారం, భారత దేశ పౌరుల్లో ఇన్వెస్ట్ మెంట్ నాలెడ్జ్(పెట్టు పడి పరిజ్ఝానం) లేకపోవడం వల్ల పాపులర్ మోడల్స్ ఇష్టపడే ఈక్వెటి క్రౌడ్ ఫండింగ్ మరియు ఇన్వెస్ట్ మెంట్ క్రౌడ్ ఫండింగ్ లు మన ఇండియాలో అంతగా ప్రజాదరణ పొందలేదు. అయితే మన ఇండియాలో టాప్ 15 క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫార్మ్స్ గురించి , ముఖ్యంగా ఈ ఫౌండరీస్ ఫండ్స్ గురించి, ఈ పెట్టుబడిదారులు, సాంస్కృతిక కారణాలు, సాంఘిక కారణాలు, వైద్య కారణాలు మొదలైన వివిధ రంగాలలో నిధుల సేకరణకు ఎలా నిధులు సమకూరుస్తాయో వాటి గురించి మరికాస్త వివరంగా తెలుసుకుందాం..

1. బిట్ గివింగ్
స్థాపకుడు మరియు సిఇఓ: ఇషిత ఆనంద్
కమిషన్ చార్జ్డ్: 6% - 10%
న్యూఢిల్లీలో, బిట్ గివింగ్ వివిధ నేపథ్యాలు (కళాకారులు, ఇంజనీర్లు, మొదలైనవి) కలిసి, వారి కథను పంచుకునేందుకు మరియు అనేక కారణాల కోసం నిధులు సేకరించేందుకు - వ్యాపార, సామాజిక మరియు సృజనాత్మక ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ప్రజలను అనుమతిస్తుంది. వారు వైద్య అవసరాల కోసం 15% నిధులను పెంచడంలో వాటి పై దృష్టి పెట్టారు

2. కాటాపూల్ట్
స్థాపకుడు: సతీష్ కటారియా
కమిషన్ చార్జీలు: ప్రాజెక్ట్ సబ్మిషన్ ఫీజు: 23 USD ప్లస్ మొత్తం నిధులు 10-15% కమిషన్ పెంచింది.
2013 జూలై లో ఈ సంస్థను స్థాపించబడింది, కాటపూల్ట్ విజం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కథలే ఉన్నాయి. కాటపూల్స్ ఎక్కువగా స్పోర్ట్స్, పాలిటిక్స్, సోషియల్ ఎంటర్ ప్రైజెస్ మరియు క్రియేటివ్ ప్రొజెక్ట్స్ తో పాటు స్టార్టప్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. తమ వినియోగదారులందరికి 300,000 రిటైల్ అవుట్లెట్లలో పంపిణీకి నిధుల సమకూర్చడానికి భారతదేశంలో ఒకే క్రౌడ్ సోర్సింగ్ ప్లాట్ఫారం గా కాటాపూల్ట్ స్థాపించబడినది.
ఈ క్రౌడ్ సోర్సింగ్ ప్లాట్ ఫార్మ్ దాదాపు 40 ప్రాజెక్టులను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా 2000 మంది కంట్రిబ్యూటర్ల నుండి సుమారు 150,000 డాలర్ల నిధులను సేకరించడానికి సహాయపడింది.

3. క్రౌదెర
సహ వ్యవస్థాపకులు: చెట్ జైన్, చైతన్య ఆత్రేయ, రిచ్ మాస్టుయురా
క్రౌదెర సంస్థను పాలో ఆల్టో, కాలిఫోర్నియాలో స్థాపించబడింది. ఇందులో ఇద్దరు భారతీయులు మరియు ఒక అమెరిక్ భాగస్వాములు. ఇది నిధుల సేకరణ కోసం ప్రపంచ వేధికగా మారింది. అంతే కాదు, గత సంవత్సరం ఏప్రిల్ ల్లో ఇండియన్ బ్రాంచెస్ ను కూడా ప్రారంభించింది. ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే USD 537,000 పైగా వసూలు చేసింది. ఈ నిధులను అనేక ప్రతిష్టాత్మక లాభరహిత సంస్థలకు, వ్యక్తులకి మరియు సంస్థలకు డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ నిధులను సేకరించిన సంస్థలు ప్రస్తుతం బూట్స్ట్రాప్ దశలో ఉన్నారు. అంతే కాదు ఈ సంస్థలన్నీ కూడా 2017 లో లాభదాయకంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి వడ్డీ వసూలు చేయకుండా జీరో కమీసన్ తో వసూలు చేస్తారు .

4. డ్రీమ్ వాలెట్స్
కోఫండర్స్: నిఖిల్ అగర్వాల్ మరియు మనీష్ హరోడియా
డ్రీమ్ వాలెట్స్ ప్రధాన కార్యాలయం జైపూర్లో మరియు అనుబందిత కార్యాలయాలు ముంబై మరియు పూణేలలో ఉన్నాయి. ఫ్యూయల్ డ్రీమ్ వంటి నిధులను సేకరించడానికి ఆన్ లైన్ రివాడ్ ఆధారిత సహకార సంస్థలకు వేదిక అయ్యాయి. ఇక్కడ ఎవరైన ప్రొజెక్ట్స్ ను తిరిగి తీసుకున్నట్లైతే వారికి ద్రవ్య మార్గంలో రివార్డ్ చేయబడుతారు
డ్రీమ్ వాలెట్ 200నగరాల్లో సినిమాలు, థియేటర్, ఈవెంట్స్, ఆర్ట్ & క్రాఫ్ట్, మ్యూజిక్, లిటరేచర్, ఫోటోగ్రఫీ, ప్రయాణం, సాంకేతిక ఉత్పత్తి / సేవ, సామాజిక కార్యకలాపాలు మొదలైన 16 క్యాటగెరీలలో నిధులను పెట్టుబడులుగా పెడుతారు .

5. ఫెయిర్ సెంట్
సహ వ్యవస్థాపకులు: రజత్ గాంధీ, వినయ్ మాథ్యూస్, నితిన్ గుప్త
కమీషన్ వసూలు చేయబడింది: ఫెయిర్సెంట్ లో రుణం తీసుకునే వారికి లోన్ అమౌంట్ ను మరియు ఇంట్రెస్ట్ అమౌంట్ ను బట్టి ఫీజు గా USD 23 + అడ్మినిస్ట్రేషన్ పీజ్ ఉంటాయి. ఇది చెల్లించిన వడ్డీ నుండి సేకరించరు.
గుర్గావ్ ఆధారంగా, ఫెయిర్సెంట్ అనేది ఒక వర్చువల్ మార్కెట్ మరియు పీర్-టు-పీర్ లెండింగ్ ప్లాట్ఫాం, ఇక్కడ రుణగ్రహీతలు మరియు రుణదాతలు నేరుగా బ్యాంకుల ప్రమేయం లేకుండా రుణాల నిబంధనలను సంప్రదించవచ్చు మరియు చర్చలు చేయవచ్చు. ప్రారంభంలో రుణాలపై అధిక మార్జిన్లను తొలగించగలిగింది మరియు తక్కువ సంస్థాగత రుసుములను కూడా సాధించింది.
ఈ ఫెయిర్సెంట్ సంస్థలో 6,000 పొటెన్షియల్ లీడర్స్ మరియు 26,000 మంది రుణగ్రహీలు ఉన్నారు . గత 24 నెలల్లో ఫెయిర్సెంట్ దాదాపు 973,000 డాలర్ల మొత్తం రుణాల(లోన్లను) అందజేశారు.

6. ఫ్యూయల్ ఎ డ్రీమ్
స్థాపకుడు: రంగనాథ్ థోటా
కమిషన్ చార్జెస్ : వీళ్ళు 9% చార్జ్ చేస్తారు(2% గేట్వే + 7% ఒప్పంద ఛార్జీలు) మొత్తం రుసుము వసూలు చేస్తారు. 9% మీద, వారు అదనంగా 14.5% సేవా పన్ను వసూలు చేస్తారు. ఓవరాల్ గా వీరు కమీషన్ రూపంలో 10.3%వసూలు చేస్తారు.
ఏప్రిల్ 2016 లో ఫ్యూయల్ ఎ డ్రీమ్ సంస్థను స్థాపించారు . ఈ సంస్థ సామాజిక ప్రయోజనాలు, సృజనాత్మక కళ మరియు ధార్మికతలతో సహా అనేక విభాగాలపై దృష్టి సారించే బహుమాన-ఆధారిత ప్రేక్షకుల వేదిక. వీరి సంస్థలలో పెట్టుబడి దారులు రెండు రకాలుగా ఎంపిక చేసుకుంటారు. వారిలో ఒకటిAON ( ఆల్ or నథింగ్) లేదా KWYG (మీకు కావల్సినవి పొందండి) . ఈ రెండింటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. పెట్టు బడి దారులు చెల్లించే మొత్తం డబ్బు ఫౌండర్ కు రిటర్న్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఒక బ్యాటరీ శక్తితో కూడిన ఇ-బైక్ మరియు ఒక గ్రామం యొక్క శుష్క వ్యవసాయ భూములను సాగుచేయడం కోసం వినియోగించడం జరిగింది.

7. ఫండ్ డ్రీమ్స్ ఇండియా
కమిషన్ వసూలు: తీసుకుని మొత్తం మీద 5% కమీషన్ తో పాటు, అదనపు ఛార్జీలు 3.95% ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు.
ఫండ్ డ్రీమ్స్ఇండియా బ్లూబిస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రారంభించబడింది. వ్యక్తుల యొక్క వ్యక్తిగత కారణాలు, జీవిత సంఘటనలు మరియు సామాజిక కారణాల కోసం ప్రజలకు కావల్సిన నిధుల సమకూర్చటానికి ఈ సంస్థ సహాయపడుతుంది. అందుకు ఈ ఫండ్ రైజర్ గురించి చాలా త్వరగా పాపులర్ అయింది.

8. ఇగ్నేట్ ఇంటెంట్
కోఫండర్స్: రినికేష్ షా
ఇగ్నేట్ ఇంటెంట్ ముంబాయిలో స్థిరపడింది, ఈ సంస్థ ముఖ్యంగా కొత్తగా సంస్థలు ప్రారంభించే వారికి కాలేజ్ ప్రొజెక్ట్స్ , ఎంటర్ ప్రైజెస్ ప్రారంభాలకోసం వేదికగా నిలిచింది. ఇగ్నేట్ ఇంటెంట్ ఇన్ సెంటివ్ బేస్డ్ క్రౌండ్ ఫండింగ్ పద్దతిని అనుసరిస్తుంది. ఇందులో చాలా మంది వ్యక్తులు వ్యాపారం కోసం చిన్న పెట్టుబడులు చేస్తారు. ఈ సంస్థంలో ఇన్ వెస్ట్ చేసిన వారు వారి ఇష్టప్రకారమే వివరాలను అందించే ఫ్రీడం కల్పించారు
పూణెప్రెస్, పుణె కేంద్రీకృత ఆన్లైన్ కిరాణా దుకాణం వంటి ప్రారంభ సంస్థలకు సహాయపడింది.

9. ఇంపాక్ట్ గురు
సహ వ్యవస్థాపకులు: ఖుష్బూ జైన్ మరియు పియూష్ జైన్
కమీషన్ చార్జెస్: యూజర్ డీఫాల్ట్ ఎంపిక చేసుకునేదాన్ని బట్టి 5% ఉంటుంది
ఈ ఇంపాక్ట్ సంస్థ ముంబైలో 2014 లో స్థాపించబడింది, ఇంపాక్ట్ గురు లాభాపేక్షలేని సంస్థల కోసం ఒక క్రౌండ్ ఫండింగ్ ప్లాట్ ఫార్మ్. ఇంకా సోషియల్ ప్రాజెక్టులకోసం నిధులను సమకూర్చుతుంది. ఇప్పటి వరకు, ఈ సంస్థ స్టార్ట్ అప్స్ కోసం, సామాజిక సంస్థలకు మరియు లాభాపేక్షలేని సంస్థలకు సమూహ విరాళాలను మరియు పెట్టుబడుల నిధులతో సహాయపడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 100 ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది.
ఇది 2016 లో USD 500,000 డాలర్లలో సీడ్ ఫండ్స్ తో సింగపూర్ ఆధారిత వెంచర్ కాపిటల్ ఫండ్ ఆర్బి ఇన్వెస్ట్మెంట్స్ మరియు ప్రైవేటు పెట్టుబడులకు వేదికైంది.

10. కేటో
సహ వ్యవస్థాపకులు: కునాల్ కపూర్, వరుణ్ శ్థ్ మరియు జహీర్ అద్ెన్వాలా
కమిషన్ ఛార్జ్ చేసేది: 5-8% నిధుల సేకరణ లేదా USD 30 (ఏది అధికం) గేట్ వే ఛార్జీలతో కూడితో కలిపి చార్జ్ చేస్తుంది.
కేటో 2012 లో స్థాపించబడింది మరియు ప్రధానంగా మూడు రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సహాయపడుతుంది.
వ్యక్తిగత అభివృద్ధి (ఆరోగ్యం / విద్య / ప్రయాణం)
క్రియేటివ్ ఆర్ట్స్ (సినిమాలు / సంగీతం / థియేటర్ / ఫ్యాషన్ / టెక్నాలజీ)
కమ్యూనిటీ / సామాజిక ప్రాజెక్టులు (NGO లు / లాభాపేక్షలేని / చారిటీస్)
ముంబై వంటి నగరాల్లో పెట్టుబడిదారుల నుండి నిధులను తీసుకోవడానికి అనుమతి ఇస్తుంది. ఈ నిధులను నుండి వారికి ఎలాంటి లాభం లేకపోయినా టార్గెట్స్ చేరకపోయినా నిధులను సేకరించడానికి అనుమతి ఇస్తుంది.
ఈ సంస్థ ఇప్పటి వరకు పది వేల ప్రొజెక్ట్స్ కు (ఆవెరేజ్ గా ఒక్కొక్క ప్రాజెక్టుకు 600 డాలర్లు ) సహాయం చేయడానికి 100,000 మంది మద్దతుదారులకు నుండి 5,990,400 డాలర్లు సేకరించింది. ఈ సంస్థ యొక్క భాగస్వాములు మరియు మద్దతుదారులలో గూగుల్ గ్రాంట్స్,కెడబ్ల్యులఎన్, సిఎపి ఇండియా, డిఎఎస్ఆర్ఎ సాంఘిక సంస్థలు ఉన్నాయి.

11. మిలాప్
సహ వ్యవస్థాపకులు: మేఖ్ చౌదరి మరియు అనోజ్ విశ్వనాథన్
కమిషన్ ఛార్జ్డ్: 5-8%
మిలాప్ బెంగళూరులో స్థాపింపబడినది.మిలాప్ మైక్రో కాస్ట్ లోన్స్(సూక్ష్మ వ్యయ రుణాలను) ప్రజలకు అందిస్తోంది. లోయర్ లెవల్ ప్రొజెక్టులైన విద్య, శక్తి, నీరు, పారిశుద్ధ్యం వంటి అనేక ప్రాజెక్టుల కొరకు ప్రజలకు సహాయపడుతుంది. మిలాప్ 2011లో స్థాపించబడినది. అయితే 2014 వరకూ బాగా విస్తరింపబడినది. డొనేషన్లు, మైక్రోలెండింగ్ ఎమర్జెన్సీ కేసులు నైబర్ హుడ్ ప్రొజెక్ట్స్ లో మెడికల్ కండీషన్స్, ప్రకృతి వైపరీత్యాలు మరియు సూక్ష్మ వ్యాపార ప్రాజెక్టులకు విరాళాలు మరియు సూక్ష్మ రుణాల భీమాతో నిధులను అందివ్వడంలో 2014 లో ఈ సంస్థ యొక్క ప్రణాళిక బాగా విస్తరించింది.
ప్రపంచవ్యాప్తంగా దాతలు నుండి USD $ 12.7 మిలియన్లు నిధులను వసూలు చేసింది మరియు 50,000 పైగా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చింది.

12. రంగ్ దే
సహ వ్యవస్థాపకులు: స్మిత రామ్ మరియు రామ్ ఎన్. కే
కమిషన్ ఛార్జీలు: వడ్డీ రేట్లు సంవత్సరానికి - 4.5% - 10%. రంగ్ దే నుండి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే అన్ని రుణాల మీద 2 శాతం కట్ ఆఫ్ కూడా ఉంటుంది.
రంగ్ దే సంస్థ బెంగుళూరులో ముఖ్య కేంద్రంగా ఉంది, రేంగ్ దే సంస్థ మైక్రో లేదా తక్కువ ధరలకు రుణాల అందించే సంస్థగా ఉంది, అలాగే గ్రామీణ పారిశ్రామికవేత్తలకు సహాయపడేందకు పీర్-టూ-పీర్ రుణ వేదికగా ఉంది. ఈ సంస్థను 2008 లో స్థాపించబడింది మరియు రుణగ్రహీతలలో చెప్పుకోదగ్గ శాతం మహిళలే ఉన్నారు, నివేదిక ప్రకారం 93% మంది ఉండవచ్చు. రంగ్ దే క్రౌండ్ ఫండింగ్ సంస్థ నుండి ఇప్పటివరకు 50,008 రుణాలు పంపిణీ చేయడం జరిగింది, మరియు 9699 సామాజిక పెట్టుబడిదారులు ఆకర్షించింది. ఇంతవరకు వారు సుమారు 7 మిలియన్ డాలర్ల సామాజిక పెట్టుబడులను అందివ్వడం మాత్రమే కాదు, ఇప్పటికే దాదాపు 5 మిలియన్ డాలర్లు కూడా వసూలు చేశారు.

13. స్టార్ 51
సహ వ్యవస్థపకులు: అటీట్ బజాజ్
కమిషన్ చార్జెస్: 5%
స్టార్ 51.కామ్ క్రౌండ్ ఫండింగ్ , కలలను నెరవేర్చుకోవడం కోసం పనిచేస్తోంది. ఈ సంస్థ కంట్రిబ్యూటర్లకు ప్రత్యక్ష ఆర్ధిక సహాయాన్ని అందించే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ సంస్థ అన్నీ లేదా ఏమిలి లేని ఫండింగ్ పాలసీని అనుసరిస్తుంది. అన్ని రకాల నిధులను సేకరించడానికి మ్యానేజ్ చేయొచ్చు. లేదంటే మీరు పెరిగిన నిధులను మీరు పొందలేరు. ఈ సంస్థ నుండి మొత్తం నిధులను చలన చిత్ర తయారీ, సంగీతం, రూపకల్పన మరియు అనేక ఇతర స్ట్రార్టప్స్ కోసం ప్రజలకు మద్దతుగా నిలుస్తుంది. ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీకి సేవ చేయడానికి ఖర్చు చేయబడిన డబ్బును గేవర్స్ మరియు ఉద్యోగార్ధులకు భరోసా ఇస్తారు. ఇది అహ్మదాబాద్లో ఉంది.
ముఖ్యంగా ఈ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ప్రధానంగా విద్యార్థుల కోసమే అంకితం చేయబడినది. వారికోసం ఈ సంస్థ వీడియో క్రియేట్ చేయడం, మరియు ప్రచారంక కొరకు కవాల్సిన ఏర్పాట్లను చేయడానికి వ్యవస్థాపకులు సహాయపడుతున్నారు

14. ది హాట్ స్టార్ట్
కమీషన్ చార్జెస్ : మొత్తం ప్లాట్ఫాం ఫీజు రేటు - 16.75%
ది హాట్ స్టార్ట్ సంస్థను జనవరి 2014 లో ప్రారంభించబడింది, ది హార్ట్ స్టార్ట్ సంస్థను బ్లూ బెర్రీ బే వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ వెంచర్ దాదాపు 50 లక్షల రూపాయల వరకూ ప్రొజెక్ట్స్ కు సహాయం చేసింది. ఇందులో మద్దతుదారులు, కమ్యూనిటీ సభ్యులు మరియు ప్రాజెక్ట్ సృష్టికర్తలు మద్దతు ఇచ్చే వారికి కోసం ప్రత్యేకమైన బహుమతిని అందిస్తారు.
ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి: ఒకటి ఫ్లెక్సిబుల్ ఫండింగ్, మరియు రెండవది‘‘ఆల్ ఆర్ నథింగ్ మోడల్'' . ఫ్లెక్సిబుల్ ఫండింగ్ మోడల్లో పెట్టుబడిదారులు వారు ఎంత వరకూ పెట్టుబడి పెట్టాలో పెట్టుకోవచ్చు. ఇక రెండవ్ మోడల్ లో వారికి లక్ష్యం ఎంత వరకూ ఉంటుందో అంతవరకూ మాత్రమే పెట్టుబడులు పెట్టగలరు.

15. విష్ బెర్రీ
సహ వ్యవస్థాపకులు: ప్రియాంక అగర్వాల్, అన్షులకా దుబే
ముంబైలో 2010 లో స్థాపించబడింది, విష్ బెర్రీ విరాళాల కోసం బహుమతిని ఇచ్చే వేదికగా ఉంది మరియు ఇక్కడ నిధులు కేవలం స్టాండ్-అప్ కామెడీ, ఫిల్మ్ ప్రొడక్షన్, డిజైన్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్ మొదలైన ప్రొజెక్ట్స్ మీద నిధులను సేకరించి సహాయం చేస్తుంది.
ఈ సంస్థలో పెట్టుబడి దారులుచాలా సమర్థవంతంగా 70శాతం పెట్టుబడులను సేకరించి, సహాయపడం జరిగింది. ముఖ్యంగా వీడియో ప్రచారాలకు ఎక్కువ నిధులను వెచ్చుస్తుంది.


Click it and Unblock the Notifications