నష్టాల్లో మార్కెట్లు
రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే సాగాయి. ట్రేడింగ్ ఆద్యంతమూ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య నడిచింది. చివరికి మార్కెట్లు నామమాత్ర నష్టాలతో ముగిశాయి.
రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే సాగాయి. ట్రేడింగ్ ఆద్యంతమూ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య నడిచింది. చివరికి మార్కెట్లు నామమాత్ర నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 21 పాయింట్లు తక్కువగా 33,756 వద్ద నిలవగా.. 4 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 10,440 వద్ద స్థిరపడింది.

లాభపడ్డ మూలధన వస్తువులు
బీఎస్‌ఈలో ప్రధానంగా మూలధన వస్తువులు(1.73%), మౌలిక రంగం(1.22%), పవర్(1.00%), హెల్త్ కేర్(0.93%)లాభపడ్డాయి. మరో వైపు వాహన రంగం(0.81%), ఎఫ్ఎంసీజీ(0.27%), బ్యాంకింగ్(0.24%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.11%) నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. లాభపడిన వాటిలో ఎల్ అండ్ టీ(1.92%), టాటా స్టీల్ (+ 1.84%), హీరో మోటో కార్ప్ (+ 1.45%), ఎన్టిపిసి (+ 0.9%), ఇన్ఫోసిస్ (+ 0.81%) ముందున్నాయి. మరో వైపు ఎం అండ్ ఎం (-3.74%), మారుతి (-1.11%), హెచ్‌యూఎల్(-1.09%), బజాజ్ ఆటో (-1.08%), యాక్సిస్ బ్యాంక్ (-0.99%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications