2జీ కేసులో నిందితుల‌కు ఊర‌ట‌నిచ్చిన ప‌టియాలా కోర్టు

2జీ కుంభ‌కోణం కేసులో ప‌టియాలా హౌజ్ కోర్టు ఈరోజు చ‌రిత్రాత్మ‌క తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ క‌నిమొళి స‌హా నిందితుంద‌రినీ ప‌టియాలా కోర్టు నిర్దోషులుగ

2జీ కుంభ‌కోణం కేసులో ప‌టియాలా హౌజ్ కోర్టు ఈరోజు చ‌రిత్రాత్మ‌క తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ క‌నిమొళి స‌హా నిందితుంద‌రినీ ప‌టియాలా కోర్టు నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు చెప్పింది. నేరారోప‌ణ‌ల‌ను నిరూపించ‌డంలో ప్రాసిక్యూష‌న్ విఫ‌లం అయింద‌న్న కోర్టు ఈ మేర‌కు తీర్పును వెల్ల‌డించింది. కోర్టు తీర్పు వెలువ‌డిన త‌ర్వాత పాటియాలా హౌజ్ కోర్టు బ‌య‌ట డీఎంకే నేత‌లు, పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకున్నారు. అయితే ప‌టియాలా హౌస్ కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయ‌నుంది.

2జీ కేసులో వారు నిర్దోషుల‌ట‌

దేశంలో అతిపెద్ద కుంభ‌కోణాల్లో ఒక‌టైన 2జీ స్కాం కేసులో ఏ రాజా, రాజ్య స‌భ మాజీ స‌భ్యురాలు క‌నిమొళితో స‌హా 17 మందిపై చార్జీషీటులో చేసిన ఆరోప‌ణ‌ల్ని కోర్టు ఏక‌ప‌క్షంగా కొట్టివేసింది. గురువారం ఉద‌యం న్యూఢిల్లీలో ప్ర‌త్యేక కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. టెలికాం 2జీ త‌రంగాల‌ను వివిధ కంపెనీల‌కు కేటాయించ‌డంలో భారీగా ముడుపులు అందాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఈ కుంభ‌కోణం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి విదిత‌మే.

యూపీఏ ప్ర‌భుత్వ హయాంలో ఈ కుంభ‌కోణం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో డీఎంకేకు చెందిన ఎ.రాజా టెలికాం శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఆయ‌న నేతృత్వంలో వివిధ టెలికాం సంస్థ‌ల‌కు 2జీ స్పెక్ట్రంను కేటాయించారు. ఆ స‌మ‌యంలో భారీ ఎత్తున ముడుపులు అంద‌డం వ‌ల్లే త‌క్కువ ధ‌ర‌కు స్పెక్ట్రం కేటాయింపులు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతే కాకుండా ఇందులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగిన‌ట్లు కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్(కాగ్) ఆరోపించింది. ఈ అవినీతి కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వానికి రూ.1.76 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా వేశారు.
కాగ్ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో 2010లో ఎ.రాజాను అప్ప‌టి ప్ర‌భుత్వం ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. ఈ కుంభ‌కోణంపై సీబీఐ, ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్టాయి. ఏ.రాజా, క‌నిమొళి స‌హా 17 మంది నేత‌లు, కార్పొరేట్ సంస్థల అధికారుల‌పై ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేశారు. 2011లో రాజాను అరెస్ట్ చేశారు. ఏడాది పాటు జైల్లో గ‌డిపిన రాజా ఆ త‌ర్వాత బెయిల్ పై విడుద‌ల అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+