ఏటా తమకు వచ్చే ఆదాయం తక్కువ చేసి చూపిస్తూ ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులను ఎగ్గొడుతున్నాయి. దీనికి సంబంధించి జియో సైతం టాప్5 ఎగ్గొట్టిన టెలికాం సంస్థల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏయే సంస్థ ప్రభు
ఒక వైపు 4జీ రాకతో ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు ఇస్తున్న టెలికాం సంస్థలు మరో వైపు ప్రభుత్వాన్ని దారుణంగా మోసం చేస్తున్నాయి. ఏటా తమకు వచ్చే ఆదాయం తక్కువ చేసి చూపిస్తూ ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులను ఎగ్గొడుతున్నాయి. దీనికి సంబంధించి జియో సైతం టాప్5 ఎగ్గొట్టిన టెలికాం సంస్థల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏయే సంస్థ ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగించిందో తెలుసుకుందాం.

1. కాగ్ నివేదికలో
కాగ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో మొత్తం 5 టెలికాం సంస్థలు ప్రభుత్వాన్ని మోసం చేశాయని తెలిపింది. ప్రభుత్వానికి ఇటీవల టెలికాం ఆదాయం అనుకున్నంతగా రాలేదు. దీనికి తోడు ఐదు టెలికాం సంస్థలు కలిసి ప్రభుత్వానికి తమ ఆదాయంలో చెల్లింపుల్లో భాగంగా దాదాపు రూ.2579 కోట్ల మేర నష్టం కలిగించాయని కాగ్ తప్పుపట్టింది.

2. పార్లమెంటులో నివేదిక
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కాగ్ ఈ నివేదికను సమర్పించింది. ఇందులో టాటా టెలిసర్వీసెస్, టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర), క్వాండ్రంట్ టెలివెంచర్స్ లిమిటెడ్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్ లిమిటెడ్, టెలినార్ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ సంస్థలు 2006-07 నుంచి 2014-15 మధ్య తమకు వచ్చిన ఆదాయం కంటే తక్కువగా చూపి తద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాయని కాగ్ బయటపెట్టింది. వార్షిక స్థూల ఆదాయం మొత్తం రూ.14,813 కోట్లు తక్కువ చేసి చూపడం ద్వారా ఇవి మోసానికి పాల్పడ్డాయనేది ఇక్కడ వెల్లడైన అంశం.

3.వివిధ రుసుములు, చార్జీలు
టెలికాం సంస్థలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను ఏటా ప్రభుత్వానికి కొన్ని చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీలు వంటివి ఉంటాయి. వీటన్నింటి విషయంలో టెలికాం సంస్థలు తమ మాయజాలాన్ని ప్రదర్శించినట్లు ఆడిటింగ్ సంస్థ నిరూపించింది.

4. ఈ రెండు ఇలా...
కార్పొరేట్లో పేరెన్నికగన్న టాటా గ్రూప్ సంస్థలు సైతం ప్రభుత్వాన్ని మోసం చేయడం గమనార్హం. టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా టెలి సర్వీసెస్(మహారాష్ట్ర) రెండూ కలిసి దాదాపు రూ.1893 కోట్లు చెల్లించాల్సిన దాన్ని ఎగ్గొట్టాయి. మొత్తం ప్రభుత్వానికి నష్టం కలిగిన దానిలో ఇది సింహ భాగం. అదే విధంగా జియో ఇన్ఫోకామ్ సైతం రూ.6.78 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయంలో తక్కువ చూపి చేయవలసిన చెల్లింపులను చేయలేదని ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ వెల్లడించింది.

5. టాటా టెలిసర్వీసెస్, టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర)
లైసెన్సె ఫీజు: రూ.724.23 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 387 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 1111.23 కోట్లు
వడ్డీ: రూ. 782.37 కోట్లు
మొత్తం ప్రభుత్వానికి కలిగించిన నష్టం: రూ. 1893.6 కోట్లు

6. టెలినార్
లైసెన్సు ఫీజు: రూ. 257.32 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 110.81 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 368.13 కోట్లు
వడ్డీ: రూ. 235.62 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ.603.75 కోట్లు

7. వీడియోకాన్
లైసెన్సు ఫీజు: రూ. 20.3 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 8.9 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 29.2 కోట్లు
వడ్డీ: రూ. 18.88 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ. 48.08 కోట్లు

8. క్వాడ్రంట్
లైసెన్సు ఫీజు: రూ. 8.22 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 4.82 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 13.04 కోట్లు
వడ్డీ: రూ. 13.58 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ. 26.62 కోట్లు

9. రిలయన్స్ జియో
లైసెన్సు ఫీజు: రూ. 5.1 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 0
పై రెండింటి మొత్తం:రూ. 5.1 కోట్లు
వడ్డీ: రూ. 1.68 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ. 6.78 కోట్లు

10. 2006-07 నుంచి 2014-15 మధ్య
మొత్తం లైసెన్సు ఫీజు రూపంలో 5 కలిపి రూ.1015 కోట్లను ఎగ్గొట్టాయి.
స్పెక్ట్రం యూసేజీ చార్జీల రూపంలో 5 కలిసి రూ.511.53 కోట్లను ఎగవేశాయి.
వడ్డీ రూపంలో 1052.13 ఈ ఐదు సంస్థలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది.
మొత్తం మీద ఐదు సంస్థలు కలిపి రూ.2578.83 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం చేశాయనేది కాగ్ నివేదిక సారాంశం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications