మెజార్టీ దిశగా భాజపా సాగుతుండటంతో మార్కెట్లకు జోష్
మోడీ మ్యాజిక్ గుజరాత్ ఫలితాల్లో కనిపిస్తుండటంతో ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. మొదట్లో హోరా హోరీ పోటీ నెలకొనడంతో ప్రతికూలంగా సాగిన ఇన్వెస్టర్లు భాజపా స్పష్టమైన ఆధిక్యంలోకి రావ
మోడీ మ్యాజిక్ గుజరాత్ ఫలితాల్లో కనిపిస్తుండటంతో ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. మొదట్లో హోరా హోరీ పోటీ నెలకొనడంతో ప్రతికూలంగా సాగిన ఇన్వెస్టర్లు భాజపా స్పష్టమైన ఆధిక్యంలోకి రావడంతో కొనుగోళ్ల జోరును కొనసాగిస్తున్నారు

10.10 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 200పాయింట్లు బలపడి 33,664 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకుని 10,389 వద్ద కొనసాగుతున్నది.
52 వారాల గరిష్టానికి వెళ్లిన వాటిలో అస్ట్రల్, యాక్సిస్ బ్యాంక్, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో బాగా లాభపడిన వాటిలో రెలిగేర్(4.98%), వీడియోకాన్ ఇండస్ట్రీస్(4.06%), పేజ్ ఇండస్ట్రీస్(3.78%), ఎంఫసిస్(3.25%), నెట్వర్క్18(3.11%)ఉన్నాయి. మరో వైపు నష్టపోయిన వాటిలో వెల్‌కార్ప్(2.70%), ఎస్కేఎఫ్ఇండియా(1.95%), బలరామ్‌చిన్-BALRAMCHIN(1.94%) ప్రధానంగా ముందున్నాయి. డాలరుతో రూపాయి 64.20 వద్ద కొనసాగుతోంది


Click it and Unblock the Notifications